May 08,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/804659

ఓటర్ల స్పందన బీజేపీని బెంబేలెత్తిస్తోందా?
నాలుగు
దశల పోలింగ్ పూర్తయ్యింది. మూడో దశలో ఓటింగ్‌లో పాల్గొన్న ప్రధానమంత్రి
పోలింగ్‌కు ముందు, పోలింగ్ తర్వాత ఓటర్లకు ఇచ్చిన సందేశం ఒక్కటే. ఇబ్బడి
ముబ్బడిగా వచ్చి ఓటేయండి అని. చూడటానికి ఓటు హక్కు విలువను ఓటర్లకు
చెప్పేందుకు చేసిన ప్రయత్నంగానే కనిపిస్తుంది. కానీ తరచి చూస్తే మరికొన్ని
వాస్తవాలు గుర్తించవచ్చు. ఇక్కడ ఓటర్ల స్పందన గురించి ప్రత్యేకంగా
పరిశీలించటానికి మూడు కారణాలు ఉన్నాయి. మొదటిది 2014లో మోడీ పట్ల
ఆకర్షితులైన తొలితరం ఓటర్లు 2019లో మోడీకి ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్నారా
లేదా అన్నది. 2019 ఎన్నికల్లో స్తబ్దతకు లోనైక ఓటర్ల స్పందన పాలక బీజేపీని ఏ
విధంగా ప్రభావితం చేయబోతోంది అన్నది రెండో కారణం. బీజేపీ
ఉద్దేశ్యపూర్వకంగా కలిగిస్తున్న జాతీయ అభధ్రతాభావానికి ప్రజలు లొంగారా లేదా
అన్న విషయాన్ని కూడా నిర్ధారించేందుకు ఓటింగ్ సరళి ఓ మార్గంగా
ఉపకరిస్తుంది.
2014లో బీజేపీకి తొలిసారి ఓటు వేయటానికి సిద్ధమవుతున్న యువ ఓటర్లకు గాలం వేసింది. ఊకదంపుడు ప్రచారంతో ఊరించింది. అవినీతి, నిరుద్యోగం ప్రధాన సమస్యలుగా 2014ఎన్నికల ప్రచారం సాగింది. 2007లో ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమైన అంతర్జాతీయ పెట్టుబడిదారీ సంక్షోభం ప్రభావం 2012నాటికి భారతదేశంలో కొట్టొచ్చినట్లు కనిపించసాగింది. ఉపాధి కల్పన స్తంభించింది. మార్కెట్ ఆర్థిక వేత్తల విశ్లేషణల్లోనే లాభాల రేటు మందగించింది. విదేశీ పెట్టుబడులు హుస్సేన్ బోల్టు వేగాన్ని వదిలేసి మూడు కాళ్ల ఉస్మాన్ వేగానికి పరిమితమైంది. ఈ పరిణామాలతో ఉపాధి కోసం కార్పొరేట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న యువత విసిగిపోయింది. అటువంటి యువతను ఊరించటానికి మోడీ ఇచ్చిన నినాదం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు. సహజంగానే ఆవురావురు మంటున్న నిరుద్యోగ యువత మోడీకి ఓట్లు గుద్దింది. 2014లో పోలింగ్ శాతం గతం కంటే ఎనిమిది శాతం పెరిగింది. 2009లో బీజేపీకి 23శాతం ఓట్లు పోలైతే 2014లో 31శాతం పెరిగాయి. అంటే 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అదనంగా పోలైన ఓట్లు మొత్తం బీజేపీకి పోలయ్యాయన్నది స్పష్టం. కానీ 2019ఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన పోలింగ్‌లో ఓటర్ల భాగస్వామ్యం తగ్గటం గమనిస్తే బీజేపీకి పోలైన ఓట్ల మోతాదు 2009నాటి స్థాయికి తిరోగమనించనుందా అన్న సందేహం కలుగుతోంది. బహుశా ఈ ఆందోళనతోనే కావచ్చు బిజెపి నాయకత్వం కొత్త పల్లవి అందుకొంది. ''ఇప్పటికే బీజేపీ గెలిచేసింది అన్న అభిప్రాయం కొంత మందిలో ఉంది. మరికొంత మంది ఈ ప్రచారం చేస్తున్నారు. వాటి లక్ష్యమంతా బీజేపీ ఓటర్లు ఓటు వేయకపోయినా మోడీ బీజేపీ అధాకారానికి వస్తున్నాయన్న తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారానికి లోనుకావద్దు'' అన్నదే ఆ కొత్త పల్లవి. దీని కొనసాగింపుగానే ఓటర్లు పెద్దఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలన్న మోడీ పిలుపు. అన్యాపదేశంగా బీజేపీ ఓటర్లంతా స్తబ్దత వదిలి ఓటింగ్ రావాలని ప్రాధేయపడటమే మోడీ పిలుపులోని అన్యాపదేశం.
2019లో ఇప్పటి వరకు ముగిసిన నాలుగు దశల ఓటింగ్ శైలి పరిశీలిస్తే 2014లో మోడీ ప్రత్యేక ఆకర్షణగా పని చేసిన మంత్రం 2019లో పని చేయటం లేదన్న విషయం రుజువు అవుతోంది. ఈ ఎన్నికల్లో పోలింగ్ 2014నాటి స్థాయితో పోలిస్తే పెద్దగా పెరిగినట్టు కనిపించటం లేదు. తొలి దశ పోలింగ్ 2014నాటి కంటే కేవలం 0.68శాతం పెరగ్గా రెండో దశ పోలింగ్ 0.47శాతం తగ్గింది. ప్రత్యేకించి బీజేపీకి కంచు కోటగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో పోలింగ్ శాతం తగ్గటం బీజేపీకి చెమటలు పట్టిస్తోంది.
ఈ ఎన్నికల్లో మొదటి దశలో పోలింగ్ జరిగిన స్థానాల్లో 2014లో 66శాతం ఓటింగ్ నమోదు అయితే 2019లో 63శాతానికి పడిపోయింది. మరీ ప్రత్యేకించి పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో పోలైన ఓట్ల శాతం 49శాతానికి మించలేదు. ఇక్కడ పశ్చిమ ఉత్తరప్రదేశ్ పోలింగ్ సరళికి ఓ ప్రత్యేకత ఉంది. 2012 నుంచీ మొదలైన మతకలహాల్లో దాదాపు రెండు లక్షలమంది ముస్లింలు నిరాశ్రయులయ్యారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో పెచ్చరిల్లిన ఉద్రిక్తతల నడుమ భావోద్వేగం పెద్దఎత్తున పొంగుకొచ్చి 2014లో బీజేపీకి ఓటుగా మారింది. కానీ ఇదే కైరానా, ఘజియాబాద్, సహారన్ పూర్ వంటి స్థానాల్లో తాజా ఎన్నికల్లో పోలింగ్ యాభైశాతం కూడా దాటలేదు. ప్రజల్లో బీజేపీ పట్ల, బీజేపీ ఉద్దేశ్య పూర్వకంగా రెచ్చగొట్టే భావోద్వేగాల పట్ల ఆసక్తి సన్నగిల్లటమే దీనికి కారణం.
ఆంధ్రప్రదేశ్‌లో 2014తో పోల్చినపుడు తొమ్మిదిశాతం అదనంగా పోలైంది. ఈ తొమ్మిది శాతం ఓటింగ్ పెరగటానికి తెలుగుదేశం వ్యతిరేకత కారణమైతే వేర్వేరు సర్వేల రూపంలో వాట్సప్‌ల ద్వారా వెల్లడవుతున్న అంచనాలు నిజరూపం దాల్చే అవకాశం ఉంది. అదే విధంగా బీజేపీకి మరో కోటగా ఉన్న మహారాష్ట్రలో పోలింగ్ 2.3శాతం తగ్గింది. ప్రతిపక్షాల ఏలుబడిలో ఉన్న బెంగాల్, ఒడిస్సా రాష్ట్రాల్లో నమోదైన ఓటింగ్ శాతం 2014లో పోల్చితే పెద్దగా చెప్పుకోదగ్గ మార్పు కనిపించలేదు. ఉత్తరప్రదేశ్‌లో మహాగంఠబంధన్ వల్ల జరిగే నష్టాన్ని బెంగాల్, ఒడిస్సాల్లో అదనపు సీట్లు సంపాదించుకోవటం ద్వారా పూరించుకోవచ్చన్న బీజేపీ అంచనాలు తల్లకిందులయ్యే అవకాశాన్ని ఈ పోలింగ్ సరళి వెల్లడిస్తోంది. అంతేకాదు. బీజేపీ ముందుకు తెచ్చిన భావోద్వేగ పూరితమైన విషయాలు కూడా పెద్గగా ఓటర్లను ఆకట్టుకోలేదన్న అంచనాకు రావటానికి కూడా ఈ పోలింగ్ సరళి అవకాశం కల్పిస్తోంది.
ఓటింగ్ మోతాదు తగ్గితే బీజేపీకి ఎందుకు చెమటలు పడతాయో పరిశీలించటానికి గతేడాది జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే సరిపోతుంది. ప్రతిష్టాత్మకమైన గోరఖ్‌పూర్ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం 49కి పడిపోయింది. బీజేపీ ఓడిపోయింది. ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్ధి విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన అరారియాలో పోలింగ్ యాభైశాతానికి, ఫూల్పూర్లో కేవలం 37శాతానికి పరిమితమైంది. 2014 ఎన్నికల్లో బీహార్, ఉత్తరప్రదేశ్‌లల్లో 128స్థానాలకు గాను 115లోక్‌సభ స్థానాలు బీజేపీ దక్కించుకుంది. కానీ ఈ దఫా ఎన్నికల్లో తగ్గుతున్న పోలింగ్ శాతం ప్రభుత్వం పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయారనేందుకు ఓ నిదర్శనంగా కానుండి. 2019 ఎన్నికల్లో అదే విసిగి చెందిన నిరుద్యోగ యువత పెద్దగా ఓటు వినియోగించుకోవటానికి ఉత్సాహం చూపటం లేదు. 2018 ఏప్రిల్ నాటికి మోడీ పట్ల ప్రజల్లో ఉన్న సానుకూల ప్రభావం 81శాతం నుంచి 50 శాతానికి పడిపోయింది. బాలాకోట దాడుల పుణ్యమా అంటూ తిరిగి 75శాతానికి చేరినా పోలింగ్ ప్రక్రియ మొదలయ్యే నాటికి ప్రత్యేకించి తొలి దశ ఓటింగ్ పూర్తి అయ్యే నాటికి మోడీ ప్రజాదరణ తిరిగి 2018 నాటి దశకు చేరింది. ఈ పరిస్థితుల్లో ఓటర్ల స్పందన స్తబ్దతకు లోనుకావటం అంటే మోడీ పట్ల తగ్గిన ప్రజాదరణ ఓటింగ్ శైలిలో కూడా ప్రతిఫలి స్తోందని రుజువు కావటమే. మోడీ పట్ల తగ్గుతున్న ప్రజాదరణకు, స్తబ్దతకు లోనవుతున్న ఓటర్ల స్పందనకు మధ్య సారూప్యత ఉంది. ఈ రెండు రకాల అంచనాలు బీజేపీకి తగ్గిన ప్రజాదరణను తెలియచేస్తున్నాయి. వరస పరాజయాలతో బీజేపీ మనువాద ఉన్మాదం ఒక్కటే అధికార సోపానానికి రాచబాటగా భావిస్తూ మతోన్మాద, పాకిస్థాన్ వ్యతిరేకతను రెచ్చగొట్టినా ప్రజలు స్పందించటం లేదు అన్న విషయాన్ని ఈ పరిణామం రుజువు చేస్తుంది.
- చైతన్య

No comments:
Post a Comment