Jan 17,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/753911
మీడియా గొంతు నొక్కుతున్న బీజేపీ
''పత్రికా
రంగమే ప్రజాస్వామ్య పరిరక్షకురాలు. ప్రజాస్వామ్య పరిణతిని కొలిచే బారో
మీటర్. పత్రికా రంగం, విలేకరులు ఎంత శక్తివంతంగా ఉంటారో ప్రజాస్వామ్యం అంత
ఆరోగ్యంగా ఉంటుంది. నిజాయితీతోకూడిన పాత్రికేయ వృత్తి దేశాన్ని శక్తివంతం
చేస్తుంది. నా అభిప్రాయంలో జర్నలిజం నిస్పాక్షికమైనదిగాను, ధైర్యంగానూ,
జాతీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునేదిగానూ ఉండాలి.'' ఇవేవో మెగస్సేసే
అవార్డు వితరణ సభలో మీడియా అగ్రజులు మాట్లాడిన మాటలు కాదు. కేంద్ర హోం శాఖ
మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ఉప న్యాసం. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఏటా
నిర్వహించే రామనాథ్ గోయెంకా అవార్డుల ఉత్సవం దీనికి సందర్భం. ఈ ఉపన్యాసం
వింటే పత్రికా స్వేఛ్చ పట్ల, ప్రత్యేకించి నిస్పాక్షికంగా పని చేసే పత్రికా
రంగం పట్ల బిజెపి ప్రభుత్వానికి ఎంత ప్రేమో అనిపిస్తుంది. కాని ఇలాంటి
కపటత్వం ప్రదర్శించటంలో బీజేపీకి సాటి వచ్చే రాజకీయ పార్టీ దేశంలోనే లేదు.
ఉదాహరణకు రాజ్యసభలో బీజేపీ నేత అరుణ్‌జైట్లీ నోరెత్తితే ఎమర్జెన్సీని
గుర్తుకు తెస్తారు. కాంగ్రెస్ తన హయాంలో పత్రికా స్వాతంత్య్రాన్ని
ఉరితీసిందని విమర్శిస్తారు. ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసిన ఎమర్జెన్సీ
వ్యతిరేక పోరాటపటిమ నేటి బీజేపీ నేతలదే అని జబ్బలు చరుస్తారు.
రాజకీయాల్లో ఏ పార్టీ తీసుకునే వైఖరులైనా ఆయా సమయాల్లో ఆయా పార్టీలు ఆశించే ప్రయోజనాల ఆధారంగానే ఉంటాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శతృవులు ఉండరు అన్నది పాత మాట. రాజకీయాల్లో శాశ్వత వైఖరి అంటూ ఉండదన్నది తాజా నానుడి. ఒకప్పుడు పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి కొలమానమని వీధల్లోకి వచ్చిన బీజేపీ నేతలు నేడు అదే పత్రికా స్వేఛ్చ పట్ల వ్యవహరిస్తున్న వైఖరే ఇందుకు తిరుగులేని ఉదాహరణ. ఎన్డీయే 2 పరిపాలనలో పత్రికా స్వేచ్ఛతో పాటు భావవ్యక్తీకరణ స్వేఛ్ఛ కూడా అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంది. గత నాలుగున్నరేండ్లలో ఈ ప్రమాద హెచ్చరికలు పతాక స్థాయికి చేరాయి. మోడీ మిత్రుడు, సన్నిహితుడైన అదానీ గుట్టు విప్పిన ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ సంపాదకుడు పరంజరు గుహ ఠాకూర్‌దా రాజీనామాతో మొదలైన ఈ హెచ్చరికలు హిందూస్తాన్ టైమ్స్ సంపాదకుడి రాజీనామా, ఎబిపి టివి ఛానల్ ఎడిటర్ ప్రసూన్ బాజ్పాయిని ఇంటికి పంపటం, ఎన్డీటీవిలో సీనియర్ న్యూస్ రీడర్ రావిష్ తివారీ రాజీనామా వరకు అనేక సందర్భాలు ఉదహరించుకోవచ్చు. వీటన్నింటినీ పరిశీలించాక 'శక్తివంతమైన నిస్పాక్షికమైన మీడియా ప్రజాస్వామ్య పరిరక్షకురాలు' అంటున్న రాజ్‌నాథ్ సింగ్ చిత్తశద్దిని ప్రశ్నించకుండా ఉండలేము.
అంతే కాదు. ఇప్పటి వరకు ప్రభుత్వాలు మీడియా గొంతు నులమాలంటే కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, ప్రచార ప్రకటనలు మాత్రమే నిలిపి వేసేవి. ఈ దాడి పత్రికా యాజమాన్యానికి ప్రభుత్వానికి మధ్య పోరాటంగా మాత్రమే ఉండేది. వీలేకరుల జీవితాలను ప్రభావితం చేసేది కాదు. కానీ బీజేపీ ప్రభుత్వం బహుముఖ దాడి వ్యూహాన్ని అనుసరిస్తోంది. మీడియా సంస్థల ఆదాయ వనరులను నిర్వీర్యం చేయటంతో పాటు విలేఖరుల జీవితాలను నేరుగా ప్రభావితం చేస్తోంది. అంతర్జాతీయ జర్నలిజం ప్రమాణాలు పాటించటానికి ప్రయత్నం చేసిన స్వాతి చతుర్వేది వంటి విలేకరులను ఆరెస్సెస్ 'కర'సేనలు ఇంటర్నెట్లో ఎంతగా వేధించింది బహిరంగ రహస్యమే. ఇంకా ప్రపంచం దృష్టికి రాని ఇలాంటి విలేకరులు వందల సంఖ్యలో ఉన్నారు. ఈ ఇంటర్నెట్ సైన్యం ఏకంగా విలేకరుల వ్యక్తిత్వ హననానికి సైతం వెనకాడటం లేదు. గౌరీ లంకేష్ విషయంలో సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం దీనికి ఉదాహరణ. ఇవన్నీ చాలవన్నట్లు ఏకంగా మీడియా సంస్థలపై పరువు నష్టం కేసులు దాఖలు చేయటం, వందలు వేల కోట్ల రూపాయల పరువు నష్టం చెల్లించాలని కోర్టులనాశ్రయించటం మీడియా గొంతు నులమటానికి బీజేపీ మాత్రమే ఉపయోగిస్తున్న సాధనం. ఇప్పటికే అనేక మీడియా సంస్థలపై బీజేపీ నేతలు వందల కోట్ల రూపాయల నష్ట పరిహారాన్ని కోరుతూ కేసులు వేశారు. అంతే కాదు. కీలకమైన నేతలు, వారి ఆశ్రితుల అవినీతికి సంబంధించిన వ్యాజ్యాలను పత్రికల్లో రిపోర్ట్ చేయరాదంటూ కోర్టుల ద్వారా ఆదేశాలు జారీ చేయించటం మోడీ హాయంకు మాత్రమే పరిమితమైన శైలి.

మీడియా స్వాతంత్య్రంపై బీజేపీ సాగిస్తున్న బహుముఖ దాడిలో చివరిది అత్యంత
కీలకమైనది సమాచార నియంత్రణకు సంబంధించింది. 2013-2014 మధ్యకాలంలో
దేశవ్యాప్తంగా జరుగుతున్న అవినీతిపై సమాచార హక్కు ఉపయోగించుకుని పెద్ద
పెద్ద కుంభకోణాలను బయటకు తీయగలిగారు జర్నలిస్టులు. 2014 ఎన్నికల్లో మోడీ
ఫిరంగిని పేల్చటానికి ఉపయోగించిన మందుగుండు సామాగ్రి ఆ విధంగా వెలుగు చూసిన
కుంభకోణాలే. అటువంటి స్వతంత్ర పాత్రికేయవృత్తికున్న శక్తి సామర్ధ్యాలు,
పదును, సామాజిక గుర్తింపు గౌరవాలను ధ్వంసం చేయటమే ఎన్డీయే 2 ప్రభుత్వం
లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తోంది. 2012లో ఆగస్టా వెస్ట్‌లాండ్
హెలికాఫ్టర్ల కుంభకోణాన్ని బయటికి తీయటానికి జాతీయ భద్రతా ప్రయోజనాలు ఆటంకం
కాలేదు. కానీ అదే జాతీయ భద్రత ప్రయోజనాలు నేడు రాఫెల్ గుట్టు రట్టు
చేయటానికి ఆటంకమవుతున్నాయి. పెద్దనోట్ల లెక్క తీయటానికి కూడా జాతీయ భద్రత
కారణాలు అడ్డుపడ్డాయి. సమాచార హక్కు చట్టంలో '' జాతీయ సార్వభౌమత్వం,
సమగ్రతలకు, శాస్త్ర సాంకేతిక పురోగమనానికి, దౌత్య సంబంధాలకు భంగం కలిగే
సమాచారమైతే బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు'' అన్న షరతు ఉంది. అయితే ఈ
షరతును అమల్లోకి తేవాలా వద్దా అన్నది నిర్ణయించేది మాత్రం ఆయా సంస్థల్లో
సమాచార అధికారులే. అంటే కేంద్ర ప్రభుత్వంలోనో, రాష్ట్ర ప్రభుత్వంలోనో ఓ
విభాగంలో దిగువ స్థాయిలో ఉండే అధికారి ఏ సమాచారం వల్ల దేశ
సార్వభౌమత్వానికి, సమగ్రతకు, దౌత్య సంబంధాలకు భంగం కలుగుతుందో అంచనా
వేసుకునేంత కీలకమైన బాధ్యతను మోస్తున్నాడు. బీజేపీ ప్రభుత్వం ఈ షరతును
అడ్డుపెట్టుకుని అనేక కీలక అంశాలకు, పరిణామాలకు సంబంధించిన సమాచారాన్ని
బహిర్గతం చేయాల్సిన బాధ్యతనుండి తప్పుకుంటున్నది.అయితే ఈ విధంగా ప్రజల
మధ్యకు రావల్సిన సమాచారాన్ని అదుపు చేసినంతనో, నియంత్రించినందువల్లనో
ప్రభుత్వం చేసే తప్పులు ఒప్పులైపోవు. మోడీ ప్రభుత్వం గత నాలుగున్నరేండ్లుగా
అనుసరిస్తున్న ఈ వైఖరి కండ్లు మూసుకుని పాలుతాగే పిల్లి ఆలోచనా స్థాయిని
మించి ఎదగలేదన్న విషయం పదే పదే రుజువు చేస్తున్నది. తాజాగా మరో ఉదాహరణను
కూడా ఇక్కడ ప్రస్తావించుకోవటం అవసరం. అది రాఫెల్ వివాదంతో ముడిపడి ఉన్న
అంశం. 2017లోనే కొందరు విలేకరులు సమచార హక్కు చట్టం కింద భారత వైమానిక దళ
అధికారులను ఆశ్రయించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు అయిన ఖర్చును
తెలపాలంటూ అర్జీలు దాఖలు చేసుకున్నారు. అప్పట్లోనే వైమానిక దళ ప్రతినిధులు ఈ
సమాచారం జాతీయ భద్రతతో ముడిపడి ఉందనీ, బహిరంగంగా చర్చించే అంశం కాదనీ
శెలవిచ్చారు. అక్టోబరు నుండీ నేటి వరకు సుప్రీం కోర్టు నుండీ పార్లమెంట్
వరకు మోడీ ప్రభుత్వం ఇదే వాదనను తలకెత్తుకున్నది. సుప్రీం కోర్టులో దాఖలైన
వ్యాజ్యంలోనూ కేంద్ర ప్రభుత్వం ఇదే వైఖరి తీసుకున్నది. రాఫెల్ యుద్ధ
విమానాల ధరలు నిర్ణయించిన పద్దతి బయటికి పొక్కితే దేశ భద్రత ప్రమాదంలో
పడుతుందన్నది వారి వాదన. ఈ వాదన ఆధారంగా సుప్రీం కోర్టులో కేసు గెలిచాక నెల
కూడా తిరక్కుండానే రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాఫెల్ వివాదంపై
పార్లమెంట్లో జరిగిన చర్చలో పాల్గొంటూ భారత వైమానిక దళం కోసం హిందూస్తాన్
ఏరోనాటిక్స్ లిమిటెడ్ కంపెనీకి పంపిన ప్రతిపాదనల గురించి
ప్రస్తావించారు. చర్చ ముగిసిన మరునాడే ఏ తరహా సాయుధ వైమానిక సేవల కోసం
ఎంతెంత ధర నిర్ణయించారో వివరంగా తెలియచేస్తూ రెండు పేజీల పట్టికలు సోషల్
మీడియాలో స్వైర విహారం చేశాయి.
దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? కేవలం రాఫెల్ యుద్ధ విమనాల కొనుగోలు ఖర్చు మాత్రమే దేశ భద్రతతో ముడిపడి ఉన్న అంశం. దేశీయంగా తయారయ్యే ఆయుధ సేవల గురించిన సమాచారం, ఈ సేవలు వినియోగించుకోవటానికి అయ్యే ఖర్చు గురించిన సమాచారం బయటకు పొక్కితే దేశభధ్రతకు ఎటువంటి ముప్పూ లేదని స్వయంగా రక్షణశాఖ ప్రకటనలే రుజువు చేస్తున్నాయి. అంటే... ఏ సమాచారాన్ని ఎందుకు విడుదల చేయాలి, ఎందుకు దాయాలో ప్రభుత్వానికి ఓ లెక్క జమ ఉంది. ఇటువంటి అనేక అడ్డదిడ్డమైన వాదనలతో వాస్తవాలు మీడియా ద్వారా ప్రజలముందుకు రానీయకుండా ప్రభుత్వం అడ్డు కట్ట వేస్తోంది. ఏ కపటత్వాన్ని కాచుకోవటానికీ, అవినీతిని దాచుకోవటానికి ఈ ప్రభుత్వం మీడియా గొంతు నొక్కుతుందో అర్థం చేసుకునే బాధ్యత పాఠకులకే వదిలేద్దాం. ఈ నేపథ్యంలోనే బీజేపీ పాలనలో అమిత్‌షా మోడీ ద్వయం మీడియా పట్ల అనుసరిస్తున్న కక్షపూరిత అణచివేత వైఖరి అంతర్జాతీయంగా విమర్శలనెదుర్కొంటోంది. ఇదేదో ప్రధాన స్రవంతి ఇంగ్లీషు, హిందీ మీడియా సంస్థలకే పరిమితం కాలేదు. ప్రాంతీయ భాషా ప్రతికలు, టీవీలు చివరకు సోషల్ మీడియా సాధనాలు కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ప్రసారం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్న సందర్భాలు మీడియా నిపుణులకు సుపరిచితమే. ఒకవైపున స్వతంత్రమైన, నిస్పాక్షికమైన జాతీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వ్యవ హరించే జర్నలిజం కావాలంటూనే మరోవైపు ఈ కోవకు చెంది న మీడియా సంస్థలను సాధ్యమైనన్ని మార్గాల్లో నిర్వీర్యం చేయ టం భారత ప్రజాస్వామ్యానికి పొంచి ఉన్న ముప్పును తెలియచేస్తోంది.
No comments:
Post a Comment