Mar 22,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/782502
కాపలా మాని కథలు చెపుతున్న చౌకీదార్!
చారువాలాతో
మొదలైన ప్రయాణం ఈ ఐదేండ్లల్లో చౌకీదార్ వరకు వచ్చింది. 2014 ఎన్నికల్లో
ఒక చారువాలాగా జీవితం ప్రారంభించి ప్రధాని పదవికి పోటీ పడగలుగుతున్నాను
అన్నది మోడీ ప్రచారంలో కీలక అంశంగా ఉండేది. 2014 ఎన్నికల సందర్భంగా చారు
కొట్టు దగ్గర చర్చ (చారు పే చర్చ) ఓ విన్నూత్న ఎన్నికల ప్రచార రూపంగా
ముందుకు తెచ్చారు. ఈ చర్చలో ఆరెస్సెస్, బీజేపీ కార్యకర్తలు దేశంలో
పెరుగుతున్న అవినీతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, మహిళలపై అత్యాచారాలు,
పతనమవుతున్న రూపాయి, ఆర్థిక వ్యవస్థ వంటి అనేక అంశాలు చర్చకు పెట్టారు.
ఎన్నికలయ్యాయి. ఓట్లు దండుకున్నారు. గద్దె నెక్కారు. చారు దుకాణం దారులను
మర్చిపోయారు.
ఈ ఐదేండ్లల్లో పాల ధర ప్రభుత్వ లెక్కల్లోనే 60పాయింట్లు పెరిగింది. పాలబూత్‌లో లీటర్ పాకెట్ ధర 2014లో మోడీ అధికారానికి వచ్చే నాటికి రూ.36గా ఉంటే 2019 మార్చి 20 నాటికి రూ.42కు పెరిగింది. అంటే ఈ ఐదేండ్లలో పాల ధర 16శాతం పెరిగింది. 2014 జూన్‌లో టీ పొడి కిలో రూ.150 ఉంటే, 2019 ఫిబ్రవరి నాటికి రూ.180కు పెరిగింది. అంటే 20శాతం. ఆ మేరకు టీ దుకాణం యజమానుల ఆదాయాలు పడిపోతున్నాయి. చారువాలాలు ప్రధాని కావాలని ఆశపడటం అటుంచి పిల్లలను బడిలోకి పంపించేంత ఆదాయం కూడా సంపాదించలేని పరిస్థితి. బహుశా ఈ కారణంగానే నేమో 2019 ఎన్నికల్లో చారువాలాలను వదిలేసి మోడీ కొత్తగా చౌకీదార్ అవతారమెత్తాడు.
మార్చి 20న దాదాపు పాతిక లక్షలమంది చౌకీదార్లుతో ప్రధాని మోడీ పెద్ద మనసు చేసుకుని మాట్లాడినట్టు ప్రభుత్వం ప్రకటించింది. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన ఓ 22నిముషాల వాయిస్ క్లిప్ కూడా విడుదలయ్యింది. ఈ 22నిముషాల్లో కేవలం ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, ఏపీల నుంచి ముగ్గురు మాత్రమే ప్రధానితో ఫోన్లో మాట్లాడగలిగారు. ఈ కసరత్తు ఏ ప్రమాణాల ప్రకారం చూసుకున్నా ఆహౌరాత్రులు కష్టపడుతున్న చౌకీదార్ల సమస్యలు తెలుసుకుని వారిని సమాధానపర్చేందుకు కాదు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానితో ముచ్చటించిన ముగ్గురు గూర్ఖాలు కూడా తమ సర్వీస్ కండిషన్స్ గురించో, నామమాత్రంగా ఉన్న వేతనాల గురించో లేక నివాస ప్రాంత సమస్యల గురించో మాట్లాడనే లేదు. ఉత్తరప్రదేశ్ నుంచి మాట్లాడిన ఓ మహిళ మీది తెనాలి మాది తెనాలి అన్నట్టు మీరు గూర్ఖాయే నేను గూర్ఖాయే. ప్రతిపక్షాల రాజకీయ ప్రచారంతో అవమానాల పాలవుతున్నామని చెప్పారు. ఒడిస్సా నుంచి మాట్లాడిన మరో వ్యక్తి పుల్వామా దాడికి పాల్పడిన పాకిస్థాన్‌కు మోడీ తిరుగులేని సమాధానం ఇచ్చారని ప్రశంసించటానికి పరిమితమయ్యారు. చివరిగా శ్రీకాకుళం నుంచి మాట్లాడిన వ్యక్తి రానున్న ఎన్నికల్లో మోడీ ఢంకా భజాయించి గెలుస్తారని, ఆందోళన పడొద్దని సముదాయించారు. ఈ 22నిముషాల పాటు ఒకవైపున మాట్లాడుతున్న మోడీని చూపిస్తూ మరో వైపున వివిధ ప్రాంతాల్లో యూనిఫారాలు ధరించిన గూర్ఖాల చిత్రాలు ప్రదర్శించారు.
ఈ ఉపన్యాసంలో తాను ఐదేండ్లుగా దేశానికి కాపలా కాస్తున్నానని చెప్పుకున్నారు. తనలాగే మిగిలిన చౌకీదార్లంతా ఉగ్రవాదం మొదలు స్వచ్ఛభారత్ వరకు అన్ని పనుల్లో దేశానికి రక్షణ కల్పిస్తున్నారని చెప్పటం విడ్డూరంగా ఉంది. ఉగ్రవాదంనుంచి దేశాన్ని చౌకీదార్లు కాపాడుతున్నారని చెప్పటం కన్నా ప్రాణత్యాగాలు చేస్తున్న సైన్యాన్ని అవమానించటం మరోటి ఏముంది? నిజంగా మోడీ దుడ్డు కర్ర పట్టుకుని సరిహద్దుల్లో కాపలా కాస్తుంటే నీరవ్ మోడీ దేశం వదిలి ఎందుకు పారిపోయినట్టు? విజరుమాల్యా లండన్‌లో కేళీవిలాసాల్లో ఎలా మునిగి తేలుతున్నట్టు? బ్యాంకులకు రూ.37వేల కోట్లు ఎగ్గొట్టిన అనిల్ అంబానీ జైల్లో కూర్చోకుండా దర్జాగా ఎలా వ్యాపారాలు చేసుకుంటున్నట్టు? చౌకీదార్ మోడీ కండ్లు గప్పి దాదాపు రూ.18 లక్షల కోట్లు రుణాలు తీసుకున్న పెద్ద పెద్ద బాబులు దర్జాగా ఎలా బతగ్గలుగుతున్నారు.
స్వయంగా తనే కాపలా కాస్తుంటే నరేంద్ర ధబోల్కర్, గోవింద పన్సారే, గౌరీ లంకేశ్‌లను పట్టపగలే ఎలా కాల్చి చంపారో, కాల్చి చంపిన హిందూ జనజాగృతి సంస్థకు చెందిన ముద్దాయిలు ఇంకా ఎందుకు అరెస్టు కాలేదో ప్రధాన చౌకీదార్ వివరించాలి. చౌకీదార్ పాలనలో విద్వేష హత్యలు గత 70ఏండ్లల్లో లేనంతగా పెరిగాయి. ఉనాలో పట్టపగలే దళితులను లారీకి కట్టి విరగబాదుతూ వీడియోలు తీసుకున్న ఆరెస్సెస్ కార్యకర్తలు యదేచ్ఛగా తిరుగుతూనే ఉన్నారు. తాజాగా పుల్వామా దాడి తర్వాత దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కాశ్మీరీ యువతపై బరితెగించి దాడులకు దిగిన కాషాయధారులపై కనీసం ప్రాధమిక దర్యాప్తు నివేదిక కూడా దాఖలు కాలేదు. బీజేపీ చౌకీదారీతనం ఎంతగా దిగజారిందంటే ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ అధాకారానికి వచ్చాక రాష్ట్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్త లందరి మీద ఉన్న కేసులు రద్దు చేస్తూ ఏకంగా చట్టాన్నే ఆమోదించారు. ఇవన్నీ పరిశీలించినప్పుడు మరి చౌకీదార్ మోడీ ఎవరికి కాపలాగాస్తున్నారో దేశానికి తేటతెల్లంగా కనపడుతున్నది.
చౌకీదారు పహరాలోనే దేశంలో ముస్లిం మైనారిటీలు, హేతువాదులు, రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులు పెద్దఎత్తున పెరిగాయి. మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల మీద ఎటువంటి దర్యాప్తు లేదా చర్యలు లేవు. ప్రత్యేకించి మూక హత్యలు ప్రభుత్వ వ్యతిరేకులను అణచివేయడమే సంఘపరివార్ వ్యూహంగా మారింది. అయినా ప్రధాన చౌకీదార్ నోటి నుంచి ఈ దాడులను ఖండిస్తూ పల్లెత్తు మాట రాలేదు. ఈ మూక హత్యలపై కేసులు నమోదు కాలేదు. అయినా నేను జాగ్రత్తగా కాపలా కాస్తున్నాను అని ప్రధాని మోడీ చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ ఐదేండ్లల్లో వివిధ రాష్ట్రాల్లో 63చోట్ల గో సంరక్షణ పేరుతో అల్ప సంఖ్యాక వర్గాలకు లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఈ దాడులు అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చాయి. అయినా కేంద్ర ప్రభుత్వానికి, మన చౌకీదారుకు చీమ కుట్టినట్టు కూడా లేదు. తన పాలనలో బహుచక్కగా పహరా కాస్తున్నానని కాపలదారుల గుంపులో చేరానని ఆత్మ వంచనకు పాల్పడ్డారు మోడీ. ఇటువంటి గారడీలు చూసి మోసపోవద్దని మోడీచేత కాళ్లు కడిగించుకున్న ఐదుగురు పారిశుధ్య కార్మికులు ఈ మధ్య ఓ ఇంటర్వూ ఇచ్చారు. ప్రధాని కట్టుదిట్టమైన చలవ గదిలో పూర్తి భద్రతల మధ్య ఐదుగురు పారిశుధ్య కార్మికులను కూర్చో బెట్టి వెండి పళ్లాల్లో వాళ్ల కాళ్లు పెట్టించి రాగి చెంబుతో కార్మికుల కాళ్లు కడిగారు. ఇదంతా ఐదు నిమిషాల్లో పూర్తి అయ్యింది. కనీసం చౌకీదార్లతో అయినా 22నిముషాలు ముచ్చటించారు కానీ పారిశుధ్య కార్మికులకు ఆ ముచ్చట కూడా దక్కలేదు. కాళ్లు కడిగించుకుని బయటకు వచ్చిన పారిశుధ్య కార్మికులు ఇలా ఆయన ఎందుకు కాళ్లు కడిగారో తెలీదు కానీ దీనివల్ల ఒరిగిందేమీ లేదని స్పష్టం చేశారు. పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం నిజంగా గుర్తింపు గౌరవం ఇవ్వదల్చుకుంటే ఇలా కాళ్లా వేళ్లా పడాల్సిన పని లేదని, తమకు ఉద్యోగ భద్రత కల్పించి కాంట్రాక్టర్ల వేధింపుల నుంచి విముక్తి కల్పిస్తే చాలని మొత్తుకున్నారు. ఈ టక్కుటమార గారడీ విద్యలన్నీ చూశాక చిన్నప్పుడు విన్న ఓ కథ గుర్తుకొస్తోంది.
ఓ యజమాని దేహదారుఢ్యం కలిగిన ఓ వ్యక్తిని రాత్రి కాపలాకు కుదుర్చుకుంటారు. రోజూ ఈ కాపలదారుడు యజమానికి ఆసక్తికరమైన కథలు వినిపిస్తూ ఉండేవాడు. ఇదే అదనుగా భావించిన దొంగలు తమ పని తాము పూర్తి చేసుకున్నారు జయప్రదంగా. ఈ విషయం గమనించిన యజమాని నెలకాగానే కాపలాదారుకు రెట్టింపు జీతం ఇచ్చి మరునాటి నుంచీ రావద్దని ఉద్యోగం నుంచి పీకేశాడు. కారణం ఏమిటని అడిగితే కాపలాకు పెట్టుకున్నాను కానీ కథలు చెప్పటానికి కాదని యజమాని గద్దించాడట. మరి ప్రజాస్వామ్యంలో ప్రజలే యజమానులు. వారు వేసే ఓటే ప్రజా ప్రతినిధులకు ఐదేండ్ల పాటు జీతం ఇచ్చే తాళం చెవి. ఈ గారడీ విద్యతో కథలు చెప్పి ప్రజ లను మోసగిస్తున్న నయా కాపలాదారులను కూడా సాగనంపాల్సిన సమయం దగ్గర పడింది.
- ప్రశాంత్

No comments:
Post a Comment