Apr 03,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/788069
ప్రజాస్వామ్యానికి ఫేక్‌న్యూస్ వైరస్
ఎంత
గొప్ప హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ ఉన్న కంప్యూటరైనా వైరస్ సోకితే ఎలా పని
చేస్తుందో మనందరికీ తెలిసిందే. మరో ఉదాహరణగా చెప్పాలంటే నిలువెత్తు
ఊడలమర్రి అయినా చీడ సోకితే లోలోనే తొలుచుకుపోయి నిట్టనిలువునా
కుప్పకూలుతుంది. అలాంటి వైరస్ (చీడ) ఫేక్‌న్యూస్. ప్రపంచంలో అతిపెద్ద
ప్రజాస్వామిక దేశాలుగా చెప్పబడుతున్న అమెరికా, భారతదేశాలు ఫేక్ న్యూస్
వైరస్ బారినపడ్డాయి. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫేక్ న్యూస్
వైరస్ ఫలితాలను ప్రభావితం చేసిందని విశ్లేషణలు నిర్థారిస్తున్నాయి.
భారతదేశంలో 2019 ఎన్నికల్లో చీడవార్తలు అదేతరహా పాత్ర పోషించనున్నాయన్న
ఆందోళన కలుగుతోంది. ఈ రెండు దేశాల అనుభవాల్లో తేడా ఒక్కటే. అమెరికా ఎన్నికల
ఫలితాలను తారుమారు చేసిన ఫేక్‌న్యూస్ విదేశాల్లో తయారైంది. మన దేశంలో
మాత్రం 'స్వదేశీ' సృజనాత్మకత ఫలితమే.
ఏప్రిల్ ఒకటో తేదీన అభూతకల్పనలు ప్రచారం చేస్తున్న 702 ఫేస్బుక్ పేజీలను తొలగిస్తున్నట్టు ఫేస్బుక్ సంస్థ ప్రకటించింది. ఇలా రద్దు చేసిన పేజీల్లో ఇండియా ఐ అనే పేరుతో నడుస్తున్న పేజీకూడా ఉంది. ఈ పేజీలో వచ్చే ఫేక్‌న్యూస్‌ను రోజూ 26లక్షలమంది చూస్తున్నారు. భారతీయుల మనస్తత్వం పెదరాయుడు సినిమాలో బ్రహ్మానందం పాత్ర వంటిది. కంటికి కనిపించింది చెవికి వినిపించింది తప్పో ఒప్పో చూసుకోకుండా ప్రచారం చేయటంలో ఉన్నంత ఆనందం మరోపనిలో ఉండదు. ఇక్కడ విశేషమేమిటంటే ఈ ఇండియా ఐ అనే ఫేస్బుక్ పేజీ నడుపుతున్న కంపెనీ సిల్వర్ టచ్. ఈ కంపనీయే ప్రధానమంత్రి మోడీ వ్యక్తిగత ఫేస్బుక్ పేజీలను కూడా నడుపుతోంది. దీన్నిబట్టి సామాజిక మాధ్యమాల్లో ప్రధాని మోడీ కనుసన్నల్లో సాగుతున్న ప్రచారంలో నిజమెంతో ఫేక్ ఎంతో సరిచూసుకోవటం పాఠకుల వంతు.
ఈ విధంగా తప్పుడు సమాచారంతో ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేసేందుకు భారత రాజకీయాలు సరికొత్త సమాచార సాంకేతిక యుద్ధానికి తెరతీశాయి. ఈ యుద్ధానికి లోక్‌సభ ఎన్నికలు వేదిక కావటం ముంచుకొస్తున్న ముప్పుకు సంకేతం. ఈ మధ్యనే 400కి పైగా ఐటీ కరసేవకులతో కూడిన బీజేపీ సోషల్ మీడియా సైన్యం ఓ వార్తను ప్రచారంలో పెట్టింది. వామపక్షాలు, కాంగ్రెస్‌లకు ఓటు వేయొద్దన్నది ఈ వార్త సారాంశం. పనిలో పనిగా దేశభక్తులైన హిందువులు నిరంతరం చూస్తూ ఉండాల్సిన కొన్ని యూ ట్యూబ్ చానళ్లు, వార్త పత్రికలు, ప్రధాన స్రవంతి టెలివిజన్ చానెళ్ల జాబితా కూడా ఇచ్చింది. వీటన్నింటిలో కేవలం రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేయటమే కాదు. నిరసన తెలిపే స్వతంత్ర మేధావులు, ప్రభుత్వ అభిప్రాయంతో విభేదించే విశ్లేషకులు వంటి వారి మీద కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడేందుకు ఇవన్నీ వేదికలు కానున్నాయి. ముస్లింలపై సాగుతున్న ప్రచార దాడికి అంతులేదు. ఇటువంటి తప్పుడు వార్తల ప్రచారం పర్యవసానమే దేశంలో గత నాలుగేండ్లల్లో సాగుతున్న మూకహత్యలు.
ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ఓ పరిశోధనా సంస్థ అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రం (సీఎస్డీఎస్). 2016లో ఈ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో 34ఏండ్ల లోపు వయసున్న యువకులు 57శాతం మంది వారంలో కొన్ని రోజులు టీవీలు చూస్తే అంతే మోతాదులో యువకులు సమాచారం కోసం వార్తాపత్రికలపై ఆధారపడుతున్నారు. 18శాతం కేవలం ఇంటర్నెట్ మాధ్యమంపై ఆధారపడుతున్నారు. గూగుల్ సంస్థ అధ్యయనం ప్రకారం దేశంలో 23కోట్లమందికి పైగా వాట్సప్ ఖాతాదారులున్నారు. పనిచేసే వయస్సున్న జనాభాలో సగానికి సగం మంది. వీరిలో కొందరు రాజకీయ పార్టీలకు ఐటీ కరసేవకులుగా మారి వేలాది మందితో వాట్సప్ గ్రూపులు ప్రారంభించి క్షణాల్లో తప్పుడు వార్తలు, అభూతకల్పనలు ప్రచారం చేసే 'ఉద్యోగం'లో ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాబోలు సంపత్ సరల్ అనే హిందీ వ్యంగ్య హాస్యకవి ''వీరందరికీ ఉచితంగా జియో కంపెనీ ఇంటర్నెట్ అందుబాటులోకి తేవటంతో దేశంలో నిరుద్యోగ సమస్య మటుమాయమైంది. ఒక్కొక్కరికి రెండు చేతుల నిండా పని దొరికింది'' అని వ్యంగ్యోక్తి వదిలారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన గూగుల్ ఒక్కో వార్తను (పోస్ట్) ఏకకాలంలో ఐదుగురుకి మించి పంపటానికి వీల్లేకుండా నియంత్రించింది. త్వరలో 'పదేపదే పదిమందికీ పంచడుతున్న వార్త(పోస్ట్)' అనే హెచ్చరికను కూడా జోడించనున్నట్టు వాట్సప్ నిర్వాహకులు చెప్పారు. దాన్నిబట్టి ప్రజలు అటువంటి వార్తలు చూడకుండా వాటివలన ప్రభావితం కాకుండా ఉంటారని ఓ ఆశ.
పైన ప్రస్తావించిన బీజేపీ సైబర్ ఆర్మీ 400+ అనే గ్రూపులో ఐదుగురు నిర్వాహకులున్నారు. బీజేపీ సామాజిక మాధ్యమాల ప్రధాన పర్యవేక్షకుడు అమిత్ మాలవీయ కూడా ఒకరు. ''కమ్యూనిస్టులు, కాంగ్రెసు వాదులు, ముస్లింలు, క్రైస్తవులు వంటి దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తుల నుంచి దేశాన్ని కాపాడే యోధుల బృందం'' అని తమకు తాము కితాబునిచ్చుకున్న గ్రూపు ఇది. 2014 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 31శాతం. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేసిన వాళ్లు 69శాతం. అంటే అమిత్ మాలవీయ నాయకత్వంలో బీజేపీ ఐటీ కరసేవకులు ఈ 69శాతంపై దాడికి సిద్ధమవుతున్నారన్న మాట. దేశంలో సగానికి పైగా జనాభాను అస్మదీయులుగా జమకట్టే పార్టీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందా? వారం రోజుల క్రితం రిపబ్లిక్ టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ప్రధాని మోడీ తనది ఏకాభిప్రాయంతో సాగుతున్న పరిపాలన అని, సంఖ్యాబలంతో సాగుతున్న పరిపాలన కాదనీ సెలవిచ్చారు. విన్న వాళ్లకు ఏకాభిప్రాయం (అందరిదీ ఒకే మాట) అని పొరపాటున అర్థం చేసుకునే అవకాశం ఉంది. మోడీ చెప్పింది ఏక అభిప్రాయం (ఒకరి అభిప్రాయంతోనే) సాగుతున్న పరిపాలన అని స్వయంగా స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రూఢ చేస్తున్నదే బీజేపీ సైబర్ ఆర్మీ స్వీయ కితాబు.
తాజాగా ముగిసిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మసీదులకు ఉచిత కరెంట్ సరఫరా, ముస్లిం విద్యార్ధులకు మాత్రమే ఉపకారవేతనాలు వంటి వాగ్దానాలు చేసిందనీ బీజేపీ ఆధీనంలో నడిచే సామాజిక మాధ్యమాలు ప్రచారం చేశాయి. హిందూస్థాన్‌టైమ్స్ పత్రిక నిర్వహించిన ఓ పరిశోధనలో ఇటువంటి తప్పుడు ప్రచారం, ఫేక్ న్యూస్‌ను ప్రసారం చేసే పది గ్రూపుల్లో ఎనిమిది గ్రూపులు బీజేపీ శ్రేణులు నడుపుతున్నాయని తేలింది. ఏప్రిల్, మే నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పని చేయటానికి 12లక్షలమంది ఐటీ కరసేవకులను వినియోగించనున్నది. ఓ చిన్న లెక్క వేద్దాం. ఈ 12లక్షలమంది ఒక్కొక్కరు ఒక్కో వాట్సప్ గ్రూపే నడుపుతారు అనుకుందాం. అంటే బీజేపీ అనుకూలంగా రూపొందించిన ఓ సందేశం (పోస్ట్) ఏకకాలంలో 30 కోట్ల 70లక్షలమందికి చేరుతుంది. అంటే 2014 ఎన్నికల్లో బీజేపీకి ఎంతమంది ఓటు వేశారో దాదాపు అంతమందికి రోజూ నేరుగా ఎన్నికల ప్రచారం చేరవేయగల యంత్రాంగాన్ని బీజేపీ సిద్ధం చేసింది. కనీసం రోజూ ఆరుకోట్ల మందికి తగ్గకుండా సందేశాలు చేరవేయాలన్నది బీజేపీ వ్యూహం. ఈ యంత్రాంగానికి అయ్యే ఖర్చు అటు అభ్యర్థి ఎన్నికల ఖర్చులో కనపడదు. ఇటు పార్టీల ఖర్చులో కనడపదు. దీన్నిబట్టి ఫేక్‌న్యూస్ ద్వారా బీజేపీ ప్రచారం ఏ స్థాయిలో ఉండబోతోందో ఓ అంచనాకు రావచ్చు. దాంతో పాటే దీని ప్రమాదం గురించి కూడా.
ఇది కేవలం వాట్సప్ మాధ్యమంగా బీజేపీ సృష్టించగలిగిన విస్పోటక తప్పుడు ప్రచారం. డిశంబరులో జరిగిన ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లల్లో కనీసం కోటిమందికి ప్రధాని పేరుతో రూపొందించిన నమో సాఫ్ట్వేర్ అప్లికేషన్ సహా జియో ఫోన్లు రాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు అందచేశాయి. పదే పదే పోస్ట్ అవుతున్న వార్తలను దానంతట అదే ఎంపిక చేసుకుని ఫోన్ వినియోగదారుల స్క్రీన్‌మీద కనిపించేలా చేయటం నమో సాఫ్ట్వేర్ అప్లికేషన్లో ప్రత్యేకత. కోటిమందికి చేతుల్లో ఉచిత ఫోన్లు, ఉచిత వైఫైతో పాటు పనిలేకుండా కూర్చోబెడితే జరిగే విధ్వంసం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇటువంటి ఫేక్ న్యూస్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఆయా బహుళజాతి కంపెనీలు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయకపోతే 2019 లోక్‌సభ ఎన్నికలు స్వేచ్ఛాయుతమైన ప్రశాంత వాతావరణంలో జరిగే అవకాశం లేదు.
- ధీర

No comments:
Post a Comment