Apr 04,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/788542

వికాసం నుంచి విద్వేషానికి బీజేపీ వ్యూహం
లోక్‌సభ
ఎన్నికల క్రమం మొదలైంది. ఏయే సమస్యల ఆధారంగా ఓట్లు అడగనున్నాయన్న విషయంలో
ప్రధాన పార్టీల వ్యూహరచన దాదాపు పూర్తయ్యింది. రిపబ్లిక్ టెలివిజన్
ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాన్ని
లాంఛనంగా ప్రారంభించారు. ప్రధాన ప్రతిపక్షానికి ప్రాతినిధ్యం వహిస్తున్న
రాహుల్ గాంధీ గత మూడు నెల్ల నుంచీ ఎన్నికల ప్రచారం మూసలోనే ఉన్నారు. గత
నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఓ విషయం స్పష్టంగా
కనిపిస్తుంది. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కంకణం
కట్టుకుంటే పాలక బీజేపీ ప్రచార వ్యూహం ప్రజా సమస్యలకు ఏ మాత్రం
తావిచ్చేదిగా లేదు. ఈ దిశగా జరుగు తున్న తాజా పరిణామాలను గమనించాలి.
2014 ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ, దాని నేత మోడీని ఆకాశానికెత్తుతూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 2014 ఎన్నికల్లో నిరుద్యోగం, అవినీతి, దివాళా తీసిన ఆర్థిక వ్యవస్థ, కొరవడిన మహిళా భద్రత, వ్యవసాయక సంక్షోభం వంటి విషయాలు ఎన్నికల్లో బీజేపీ ప్రచారాస్త్రాలుగా మారాయి. ఇవన్నీ యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలు. వీటితో పాటు తాము అధికారానికి వస్తే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని మూటకట్టి దేశానికి తేవటం, ప్రజల బ్యాంకు ఖాతాల్లో 15లక్షలు జమ చేయటం వంటి వరాల గురించి కూడా వాగ్దానాలు చేసింది బీజేపీ. కాంగ్రెస్ ముక్త భారతం, ప్రతిపక్ష విముక్త భారతం రాజకీయ లక్ష్యాలుగా ప్రకటించింది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి అధికారం ఇవ్వమని బీజేపీ ప్రజల వద్దకు వస్తోంది. బీజేపీ 2014లో తనకు తాను నిర్దేశించుకున్న పై ఎజెండాను ఎంతవరకు సాధించింది, వాగ్దానాలు ఏ మేరకు అమలు చేసింది, లక్ష్యాల సాధనలో ఎంత దూరం ప్రయాణించింది సమీక్షించేందుకు ఈ ఎన్నికలు ఓ సందర్భం. కానీ బీజేపీ ప్రచార శైలి వీటిల్లో ఏ ఒక్క అంశాన్నీ తడమటం లేదు. గత ఐదేండ్లేలో ప్రభుత్వం ముందుకు తెచ్చిన ఏ ఒక్క విషయం నమ్మశక్యంగా లేదు. గతంలో కనీసం రైతాంగ ఆత్మహత్యల సంఖ్య జాతీయ నేర రికార్డుల బ్యూరో లెక్కల్లోనైనా కనిపించేవి. వ్యవసాయరంగ సంక్షోభాన్ని అంచనా వేయటానికి ఈ వివరాలు ఓ ప్రాతిపదికగా ఉండేవి. దాంతో అసలు వ్యవసాయ రంగంలో ప్రభుత్వ వైఫల్యాలు చర్చకే రాకుండా ఉండాలంటే ప్రభుత్వ గణాంకాల్లో ఇటువంటి వివరాలు లేకుండా చేస్తే పరిష్కారం దొరికినట్టే అన్న అవగాహనతో ప్రభుత్వం పని చేస్తోంది. వెనకటికి ఎవరో గురుత్వాకర్షణ శక్తి కారణం గానే జనం సుడిగుండాల్లో చిక్కుకుని చనిపోతున్నారని భావించి దేశంలో చెరువులు, బావులు, కుంటలు అన్నీ పూడ్చివేయించాడట. ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ మోడీ ప్రభుత్వం వైఖరి ఇలానే ఉంది.
ఫలితమే నిన్న మొన్నటి వరకు శాంతిభద్రతల సమస్యగా ఉన్న ఉగ్రవాదం, తీవ్రవాదం నేడు ఓట్లు పిండే కామధేనువుగా మారింది. గత ఐదేండ్లల్లో భారతదేశంలో ఉగ్రవాద దాడి ఎక్కడా జరగలేదన్నది మోడీ ఢంకా బజాయించి చేస్తున్న ప్రచారాల్లో ఒకటి. నిజానికి యూపీఏ-2 పాలనా కాలంలో కూడా ఉగ్రవాద దాడులు జరగలేదు. యూపీఏ-1 హయాంలో అటు ముస్లిం తీవ్రవాదం, ఇటు హిందూత్వ తీవ్రవాద ఘాతుకాలు చోటు చేసుకున్నాయి. బీజేపీ ప్రచారం ఇక్కడితో ఆగలేదు. జమ్ముకాశ్మీర్‌లో జరుగుతున్న ఉగ్రవాద చర్యలను అడ్డు పెట్టుకుని దేశవ్యాప్తంగా హిందువులు పెద్దఎత్తున అభద్రతా భావంతో బతుకులీడుస్తున్నారని, బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారనీ వార్దాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. అదే వార్దాలో 2014 ఎన్నికల్లో భాగంగా జరిగిన బహిరంగసభలో 32నిముషాలు మాట్లాడిన మోడీ 18నిముషాలు రైతాంగ సమస్యలు గురించి ప్రస్తావిస్తే 2019లో జరిగిన సభలో 25నిముషాలు సీమాంతర ఉగ్రవాదం గురించి, ప్రతిపక్ష పార్టీల దేశభక్తి రాహిత్యం గురించీ మాట్లాడారు. 2014 నాటికీ 2019 నాటికీ తేడా ఒక్కటే. నాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే నేడు బీజేపీ శివసేన కూటమి అధికారంలో ఉంది. దాంతో ఈ ఐదేండ్ల కాలంలో మహారాష్ట్రలో ఆత్మహత్య చేసుకున్న సుమారు 20వేల మంది రైతాంగం ప్రధాని దృష్టిలో అప్రాధాన్యతా అంశంగా మారింది.
రిపబ్లిక్ టీవీ ఇచ్చిన ఇంటర్వూలో సైతం జాతీయ భద్రత పెను ప్రమాదంలో పడిందనీ, ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవాలంటే తనలాంటి చాకచక్యం కలిగిన నేతను ప్రధానిగా ఎన్నుకోవాలని కోరుతున్నారు. తనకు ముందు పరిపాలన చేసిన వారంతా వెధవాయిలు. తానొక్కడినే దక్షత కలిగిన బుద్ధిమంతుడిని అని జబ్బలు చర్చుకునే ప్రయత్నం. సరిహద్దులకు అవతల ఉన్న శతృవులుతో పాటు సరిహద్దుకు లోపల ఉన్న శతృవులు - హేతువాదులు, కమ్యూనిస్టులు, ఉదారవాదులు, పత్రికారంగం. వీటన్నింటిని ఓడించటమంటే దేశంలో ప్రతిపక్షాన్ని అధికారానికి రాకుండా చేయటమే. తిరిగి మరోసారి బీజేపీని ఎన్నుకోవటమే గత్యంతరం లేని స్థితి అన్న వాతావరణాన్ని కల్పించటంలో మోడీ బీజేపీ సకల అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తుంది. ఇక్కడ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రస్తావించటం వెనక మూడు లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది పాకిస్థాన్‌కు సీమాంతర ఉగ్రవాదానికి ఉన్న అనుబంధాన్ని ఎత్తి చూపటం. రెండోది భారతదేశంలో ఉన్న ముస్లింలకు పాకిస్థాన్ పట్ల ఉన్న సానుకూల అభిప్రాయాలను గుర్తు చేయటం. మూడోది ఈ దేశంలో ఉన్న ముస్లింలందరూ జాతి భద్రతకు ప్రమాదకారులే అన్న ఆరెస్సెస్ నిర్ధారణను దేశ ప్రజలపై రుద్దడం. ఈ విధమైన వైఖరితో జాతీయ భద్రత నినాదం మాటున దేశవ్యాప్తంగా అభద్రతా భావాన్ని పెంచి పోషిస్తున్నారు. ఇది రానున్న కాలంలో మరింత ప్రమాదకర స్థాయికి చేరుకోనుంది.
ఈ ప్రచార శైలితో బీజేపీ ఓ విషయాన్ని దేశం ముందుంచ దల్చుకున్నది. బీజేపీ ఓడిపోతే దేశం ఉగ్రవాదులతో నిండిపోతుందని భయావహ వాతావరణం నెలకొంటుందన్న అపోహలు పెంచిపోషిస్తున్నారు ప్రధాని మోడీ. దాంతోపాటు మోడీని వ్యతిరేకించే వారు, బీజేపీని వ్యతిరేకించే వారంతా పాకిస్థాన్ శ్రేయోభిలాషులే అన్న వాతావరణం కల్పించేందుకు సాగిస్తున్న ప్రయత్నం నిజానికి దేశ ప్రజల మధ్య రాజకీయ ధార్మిక వైషమ్యాలను పెంచి పోషించేదిగా ఉంది. ఈ తరహా ఉపన్యాసం చూస్తే 9/11 తర్వాత జార్జి బుష్ జూనియర్ ఉపన్యాసం గుర్తురాక మానదు. అల్‌ఖైదా దాడుల నేపథ్యంలో జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో బుష్ ప్రపంచంలో అమెరికాను సమర్థించని వారంతా తాలిబాన్లను సమర్థిస్తున్నట్టేనని నిర్ధారించారు. ఈ వాదనను మరింత పొడిగిస్తూ మోడీ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో విజయాల గురించి వర్ణించాలని కోరితే సైన్యాన్ని నిలదీయటంతోనో అవమానించటంతోనో పోలుస్తున్నారు. ఈ తరహా రాజకీయాలు నిరంకుశ పాలనకు పునాదులు వేస్తాయి. నిరంకుశ పాలన ఫాసిజంగా రూపాంతరం చెందటానికి ఎంతో కాలం పట్టదు.
వ్యవసాయ సంక్షోభం, ఉపాధి నష్టం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దివాళా వంటి సాధారణ విషయాలు చర్చించేటప్పుడు సాలిడారిటీ ఏర్పడుతుంది. సంఘటితమవుతుంది. సరికొత్త ఐక్యతకు పునాదులు పడతాయి. నూతన ప్రచార వ్యూహం. ప్రచారంలో చర్చకు పెట్టే అంశాలు రెండు ప్రయోజనాలు సాధిస్తాయి. ఒకటి నేరుగా తమ ప్రజాపునాదిని కార్యోన్ముఖులను చేయటం. తమ ప్రజాపునాదికి బయట ఉన్న వారి అస్త్రశస్త్రాలు నిర్వీర్యం చేయటం. ఉగ్రవాదం, పాకిస్థాన్, అవినీతీ చర్చకు వచ్చినప్పుడు సంఘీభావ పొరలు చెదిరిపోతాయి. ఐక్యత బీటలు వారుతుంది. ఈ విధంగా పాలకుల విధానాల ద్వారా నష్టపోతున్న ప్రజల మధ్య అనైక్యత సృష్టించటంలో పాలక పార్టీ జయప్రదం అయితే పాలకవర్గ ప్రయోజనాలు సులక్షణంగా కాపాడటమే. అందుకే ఓటర్ల నిజమైన ప్రయోజనాలు కాపాడాలనుకునే పార్టీలు దైనందిన ఆర్థిక సామాజిక సమస్యలను చర్చకు పెట్టాలి. ప్రత్యామ్నాయ రాజకీయ వాతావరణానికి పునాదులు వేయాలి. ప్రత్యామ్నాయ ఎజెండాను ప్రజల ముందు పెట్టకుండా ప్రత్యామ్నాయ శక్తుల రాజకీయ ప్రాధాన్యతను అవసరాన్ని ప్రజలు గుర్తించటం సాధ్యం కాదు. అందువల్లనే భారతదేశంలో నాల్గోవంతుగా ఉన్న ముస్లిం జనాభాను శతృవులుగా చూపించే ప్రచారానికి ఊతమివ్వకుండా ప్రజలెదుర్కొంటున్న ఆర్థిక సామాజిక సమస్యలను ఎన్నికల ప్రచారంలో ప్రధాన సమస్యలుగా మార్చటమొక్కటే ప్రజాతంత్ర ఐక్యతను పరిరక్షించే మార్గం.
- ప్రశాంత్

No comments:
Post a Comment