http://www.navatelangana.com/article/net-vyaasam/781693
Mar 21,2019
ఖరీదవుతున్న ప్రజా ప్రాతినిధ్యం
ప్రజల
ముందు కొత్త కొత్త లక్ష్యాలు ఆకర్షణీయంగా, ఆచరణ సాధ్యమైనవిగా చూపించటంలో
బీజేపీని మించిన పార్టీ దేశంలో లేదు. నోట్ల రద్దు సమయంలో మోడీ ఉపన్యాసం
గుర్తు తెచ్చుకుందాం. యాభై రోజులు భారాలు భరిస్తే 2017 కొత్త సంవత్సరంలో
భారతదేశాన్ని కొత్త లోకాలకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ప్రధాని మోడీ.
అలాంటిదే ప్రమాణ స్వీకారం సందర్భంగా 2014లో చేసిన వాగ్దానం. యాభై నెలలు
ఓపిక పడితే (ఐదేండ్లు మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఉంటే) గతంలో
కాంగ్రెస్ చేసిన తప్పులన్నింటినీ సరిదిద్ది దేశాన్ని అగ్రరాజ్యాల సరసన
నిలబెడతాన్నారు. మిగిలిన విషయాల్లో ఏమో కానీ ఎన్నికల ఖర్చు విషయంలో
భారతదేశం అమెరికాను మించిపో తోంది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ
పార్టీలు పెట్టిన ఖర్చు కంటే 2019 లోక్సభ ఎన్నికల్లో అదనంగా ఐదువేల కోట్ల
రూపాయలు ఖర్చు కానున్నాయని అంచనా.
భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. అంటే ప్రజలు తమకు నచ్చిన పార్టీని, నచ్చిన అభ్యర్థిని చట్టసభల్లో తమకు ప్రాతినిధ్యం వహించమని ఎన్నుకుంటారు. దేశంలో తొలి ఎన్నికల నాటి నుంచీ దాదాపు 90వ దశకం వరకు ఇదే జరిగింది. ఆ సమయంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల కష్టసుఖాలకు దగ్గరగా ఉండేవారు. ప్రజలకు ప్రజా ప్రతినిధికి మధ్య ఉండే సంబంధాలు కుటుంబ సంబంధాలుగా ఉండేవి. గుంటూరులో ఎన్జీ రంగా అన్ని సార్లు గెలిచినా బెంగాల్లో సోమనాథ్ చటర్జీ ఒకే నియోజకవర్గం నుంచి 10సార్లకు మించి ఎన్నికైనా కారణం ప్రజలకు ప్రతినిధులకు మధ్య ఉండే సంబంధాలు అంత గాఢంగా ఉండటమే. అందువల్లనే 90వ దశకం వరకు జరిగిన ఎన్నికల్లో డబ్బు పెద్దగా పాత్ర పోషించేది కాదు. మొదటి మూడు లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఖర్చు సుమారు 10కోట్ల చొప్పున జరిగింది. ఇలా చెపుతున్నంత మాత్రాన పార్టీ యంత్రాంగం, ఎన్నికల మంత్రాంగం పాత్రను, ఆయా సమయాల్లో ముందుకొచ్చే భౌతిక పరిస్థితుల పాత్ర తక్కువ చేయటం కాదు.
1990 దశకంలో దేశంలో రెండు ప్రధాన పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదటిది ఆర్థిక సంస్కరణలు. రెండోది ప్రాతినిధ్య రాజకీయాల్లో వచ్చిన మార్పులు. మొదటి అంశం గురించి జరిగినంత లోతైన అధ్యయనాలు రెండో అంశంలో జరగలేదు. గత మూడు దశాబ్దాల్లో ఎన్నికల్లో డబ్బు పాత్ర పెరగటానికి ఆర్థిక సంస్కరణల ద్వారా సమాజంలో వచ్చిన సంస్థాగత మార్పులకు మధ్య సంబంధం ఉంది. ఈ సంస్కరణల ద్వారా లబ్ది పొంది కోట్లు గడించిన ఓ తరగతి ఉనికిలోకి వచ్చింది. ఈ తరగతి తన ప్రయోజనాలు కాపాడుకోవాలంటే ఇవే సంస్కరణలు కొనసాగాలన్న వాస్తవాన్ని అర్థం చేసుకుంది. అందుకే సాంప్రదాయక రాజకీయాల స్థానంలో ధన రాజకీయాలు, సాంప్రదాయ రాజకీయ నాయకుల స్థానంలో నయా సంపన్న వర్గానికి ప్రాతినిధ్యం వహించే రాజకీయ నాయకులు తెరమీదకు వచ్చారు. గత మూడు దశాబ్దాలుగా చట్టసభలకు ఎన్నికైన వారి ఆర్థిక స్థితిగతుల్లో వచ్చిన మార్పులే దీనికి ఉదాహరణ. నాల్గో లోక్సభ నుంచి ఎనిమిదో లోక్సభ వరకు ఒక్కో ఎన్నికల్లో అయిన ఖర్చు సుమారు 100 కోట్లు. రాజీవ్ గాంధీ ఎన్నికైన తొలిసారి మొత్తం అన్ని పార్టీల ఎన్నికల ఖర్చు తొలిసారి 500 కోట్లకు చేరింది. 2004లో జరిగిన ఎన్నికల్లో సుమారు వెయ్యి కోట్ల రూపాయల ఖర్చు అయినట్టు అధికారిక అంచనాలున్నాయి. ఈ ప్రజా ప్రాతినిధ్యంలో వచ్చిన ఈ మార్పులు 2014 ఎన్నికలతో కొత్త మలుపు తిరిగాయి. ఈ ఎన్నికల్లో దాదాపు మూడున్నర వేల కోట్లుకు ఎన్నికల ఖర్చు పెరిగింది. 2019 ఎన్నికలు ఆ కొత్త దారిలో మరింత వేగంగా ప్రయాణం సాగిస్తున్నాయి. ఫలితమే భారతదేశంలో ఎన్నికల్లో అయ్యే ఖర్చు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు కన్నా ఎక్కువగావటం. బూర్జువా రాజకీయ పార్టీలు కార్పొరేట్ వర్గాల చేతుల్లోకి ఎలా చిక్కుకున్నాయో అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ తన నివేదికలో చక్కగా వర్ణించింది. 2017, 2018లోనే కంపెనీలు రాజకీయ పార్టీలకు ఇచ్చే చందాలు దాదాపు ఐదు వందల కోట్లకు పెరిగాయని ఈ సంస్థ అంచనా వేసింది. ఇందులో 400కోట్లు బీజేపీ ఖాతాలో జమ అయితే, కాంగ్రెస్ ఖాతాలో కేవలం 19కోట్లు మాత్రమే జమ అయ్యాయి. ఈ వివరాలన్నీ ఎడిఆర్ సంస్థ ఎన్నికల సంఘం నుంచి సేకరించి విశ్లేషించిన వివరాలే.
బ్లూమ్బర్గ్ క్వింట్ పరిశోధన వివరాల ప్రకారం ఎన్నికలకు వెళ్లబోయే ముందు బీజేపీ ఖజానాలో రూ.1030 కోట్లు ఉన్నాయి. కాంగ్రెస్ ఖజానాలో రూ.200కోట్లు ఉన్నాయి. బీఎస్పీ ఖజానాలో రూ.51.7 కోట్లు. ఇందులో భారతి ఎంటర్ప్రైజెస్ (ఎయిర్ టెల్ యజమానులు) ఒక్కటే రూ.154 కోట్లు జమ చేసింది. ఇంత పెద్దమొత్తంలో విరాళాలు రావటానికి ఏకైక కారణం రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను బీజేపీ సరళించటమే. ఇప్పటికి ఏ రాజకీయ పార్టీకి ఏ కంపెనీన్ని నిధులు ఇచ్చిందో తెలుసుకునే అవకాశం ఉండేది. కానీ బీజేపీ ఆమోదించిన బాండ్ల పద్ధతిలో ఈ విషయాలు బహిరంగంగా తెలుసుకోవటానికి అవకాశం లేదు. గతంలో రాజకీయ పార్టీల పద్దు కింద ఇచ్చిన చందాలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉండేది. ఏ కంపెనీ అయినా తన లాభాల్లో ఏడున్నర శాతానికి మించి రాజకీయ పార్టీలకు చందాలు ఇవ్వటానికి అవకాశం లేదు. బీజేపీ ప్రభుత్వ ఆమోదించిన సంస్కరణలు ఈ పరిమితిని రద్దు చేశాయి. అంటే ఏ కంపెనీ ఎంత మొత్తమైనా ఏ పార్టీకైనా చందాగా ఇచ్చేయొచ్చు.
2017 ద్రవ్య బిల్లులో ఎన్నికల బాండ్ల పద్ధతిని ప్రవేశపెట్టింది బీజేపీ ప్రభుత్వం. అంటే రాజకీయ పార్టీలు వెయ్యి, పది వేలు, లక్ష, పది లక్షలు, కోటి రూపాయల చొప్పున బాండ్లు జారీ చేయవచ్చు. ఆ బాండ్లను వ్యక్తులు గానీ, కంపెనీలు గానీ కొనుగోలు చేయవచ్చు. అలా అమ్ముడైన బాండ్లను పార్టీలు సొమ్ము చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ కేవలం భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాల ద్వారానే జరగాలి అన్న షరతు ఉంది. అయితే బాండ్ల కొనుగోలుదార్ల గురించిన వివరాలు బ్యాంకులుగానీ కంపెనీలు గానీ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. ఈ పద్ధతి పార్టీలకు ఉన్న ప్రజా ప్రాతినిధ్య స్వభావాన్ని పూర్తిగా తెరమరుగు చేస్తోంది. కొత్త పద్ధతిలో రాజకీయ పార్టీలు కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తే రాజకీయాలు చేయగలవు లేదంటే ప్రజా ప్రాతినిధ్య రాజకీయాలు చేయటం ఆర్థికంగా భారంతో కూడుకున్న పని అని నిర్ధారణ అవుతుంది.
2014 ఎన్నికల్లో గెలుపొందిన 342మంది అభ్యర్థులకు జాతీయ పార్టీలు 7559.82 లక్షల ఖర్చు భరించాయి. అంటే సగటున ఒక్కో అభ్యర్ధికి జాతీయ పార్టీలు పాతిక లక్షల వరకు ఖర్చును భరించాయి. అప్పట్లో బీజేపీ వద్ద అంత సొమ్ము లేదు. మరి ఇప్పుడు వెయ్యి కోట్లకు పైగా సిద్ధంగా ఉన్న రొక్కం బీజేపీ చేతుల్లో మూలుగుతోంది. పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం వంద సీట్లు మిత్ర పక్షాలకు వదిలినా బీజేపీ400 సీట్లకు పోటీ చేస్తుంది అనుకుందాం. ఆ లెక్కన బీజేపీ ఒక్కో అభ్యర్ధికి రూ.2కోట్లకు వరకు ఖర్చు భరించగలదు. ఇందులో మోడీ, అమిత్షా పర్యటనల ఖర్చు, ఇతర కేంద్ర కార్యాలయం ఖర్చు తీసేసినా ఒక్కో అభ్యర్థికి కోటి రూపాయల వరకు భరించే అవకాశం ఉంది. కానీ 2019 ఎన్నికల్లో ఒక్కో అభ్యర్ధి 70లక్షల కంటే మించి ఖర్చు పెట్టకూడదు అని ఎన్నికల ప్రవర్తన నియమావళి చెప్తోంది.
ఈ వివరాలు పరిశీలిస్తే మూడు ముఖ్యమైన నిర్ధారణలకు రావచ్చు. రాజకీయ పార్టీలకు చందాలు ఇచ్చే పద్ధతుల్లో వచ్చిన మార్పుల వల్ల ప్రధానంగా లబ్ది పొందింది బీజేపీ. అందుకే ఈ పద్ధతిపై ఎన్నికల సంఘం మొదలు సుప్రీం కోర్టు వరకు అందరూ అభ్యంతరం చెప్పినా సవరించటానికి పూనుకోలేదు. ఇప్పుడున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళితో నిజమైన ప్రజా సమస్యల ఆధారంగా పని చేసే వామపక్షాలు ఎన్నికల్లో పొటీ చేయటం, గెలిచి ప్రజలకు ప్రాతినిధ్యం వహించటం అత్యంత భారతమైన పనిగా మారుతోంది. ఒకవైపున ఆర్థిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిలో మార్పులు తేకపోతే ధనం పాత్రను నిలువరించలేకపోతే రాజకీయ పార్టీలు ప్రజలకు ప్రాతినిధ్యం వహించటం కంటే కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలుగా మారతాయి. భారతీయ ప్రజాస్వామ్యం ప్రాతినిధ్య స్వభావాన్ని కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తోంది.
- చైతన్య

No comments:
Post a Comment