Apr 06,2019
http://www.navatelangana.com/article/net-vyaasam/789099
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే కర్తవ్యం ఎన్నికల సంస్కరణలు
పదిహేడవ
లోక్సభ ఎన్నికల తతంగాన్ని గమనిస్తుంటే రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పెట్టే
ప్రత్యక్ష పరోక్ష ఖర్చును మూల్యాంకనం చేయటం, ఎన్నికల్లో ధన ప్రభావాన్ని
తగ్గించటానికి ఎన్నికల వ్యయ సంస్కరణలు తక్షణ అవసరంగా కనిపిస్తున్నాయి.
దేశంలో అధికారం కోసం పోటీ పడుతున్న పాలక పార్టీలు గానీ, ప్రధాని పదవికి
బరిలో దిగుతున్న నేతలు కానీ ఈ విషయాన్ని ప్రస్తావించక పోవటం ఆశ్చర్యం.
ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు, నాల్గో స్తంభంగా చెప్పుకుంటున్న పత్రికా
రంగం ఈ విషయాన్ని చర్చకే తీసుకురాకపోవటం మరింత విడ్డూరంగా ఉంది. గత దశాబ్ద
కాలంగా ఎన్నికల్లో ధన ప్రభావం గురించి చర్చ జరుగుతున్నది. రాజకీయ పార్టీలకు
కార్పొరేట్ కంపెనీలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని విడదీయకపోతే
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం పదికాలాల పాటు వర్ధిల్లటం అసాధ్యం.
రాజకీయ పార్టీలకు, గుత్త పెట్టుబడిదారులకు మధ్య ఉన్న బాదరాయణ సంబంధం బహిరంగ రహస్యమే. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో పారిశ్రామిక వర్గం తమ ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీలకు ఇతోధికంగా అండదండలు అందిస్తాయి. అధికారంలోకి వచ్చిన పార్టీ ఆయా పారిశ్రామిక వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించటం కూడా చూస్తుంటాం. అందుకే ప్రభుత్వం దోపిడీ వర్గాల తరపున పని చేసే సాధనం అంటారు. ప్రపంచీకరణ సంస్కరణలు తెరమీదకు రాకముందు ఈ సంబంధం లోగుట్టుగా ఉండేది. ప్రపంచీకరణ విధానాలు రాచమర్యాదలు పొందుతున్న ఈ కాలంలో పాలక పార్టీలకు, పాలక వర్గాల ప్రతినిధులైన గుత్తపెట్టుబడిదారీ సంస్థలకు, వాటికి మిత్రులుగా ఉన్న విదేశీ బహుళజాతి కంపెనీలకు మధ్య ఉన్న సంబంధం బాహాటంగానే వెల్లడవుతోంది. దీని పర్యవసానంగానే గతంలో ప్రజా సేవకు జీవితాలు అంకితమైన త్యాగధనుల స్థానంలో వేల కోట్ల ఆదాయం కలిగిన కార్పొరేట్ వర్గం పార్లమెంట్లో అడుగుపెడ్తోంది. ఈ పరిస్థితిలో ఎంతో కొంత మార్పు సాధించాలన్నా, ప్రజాస్వామ్యం నిజమైన ప్రాతినిధ్య స్వభావాన్ని కోల్పోకుండా ఉండాలన్నా తక్షణమే ఎన్నికల్లో ధన బలాన్ని నియంత్రించాలి. ఈ చర్చకు దారితీసిన తక్షణ సందర్భాన్ని గమనిద్దాం.
విదేశాల్లో ఉన్న నల్లధనానికి ముక్కుకు కళ్లెం వేసి లాక్కొచ్చి దేశంలో ఖాతాదారులందరికీ పంచుతామన్నది బీజేపీ ప్రభుత్వ వాగ్దానం. ఈ నల్లధనాన్ని బయటికి తేవటానికే 2016 నవంబర్లో ఓ సాయంత్రం ప్రధాని మోడీ నోట్లరద్దు ప్రకటించారు. ఈ నిర్ణయంతో అప్పటి వరకు వెయ్యి, ఐదువందల నోట్ల రూపంలో నిల్వ ఉన్న నల్లధనం ఏరులై పారుతుందనీ, ఈ నోట్లు రద్దు చేస్తే ఈ నల్లధనం అంతా మటు మాయమవుతుందనీ, స్వచ్ఛమైన పారదర్శకమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోవచ్చనీ చెప్పారు. ప్రధాని అంతటివాడు చెపుతుంటే నిజమో కామోసు అని ప్రజలు కూడా నమ్మారు. కానీ ఏమి జరిగిందో దేశానికి తెలుసు. కోట్లాదిమంది రోజు వారీ వేతనాలపై ఆధారపడిన కార్మికులను, రైతాంగాన్ని రెండేండ్ల పాటు కోలుకోకుండా కుంగదీసింది ఈ నిర్ణయం. అయినా ప్రజలకు క్షమాపణ చెప్పేందుకు కూడా సిద్ధం కానంత తలబిరుసుతో వ్యవహరిస్తున్నారు మోడీ, బీజేపీ నాయకులు. ఇదలా ఉంచితే నల్లధనాన్ని నియంత్రించేందుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నామన్న మూడ్నెల్లల్లోనే నల్లధనంతో రాజకీయ పార్టీలు తమ ఖజానా నింపుకోవటానికి కావల్సిన చట్టాన్ని పార్లమెంట్లో ఉన్న సంఖ్యాబలంతో ఆమోదించింది బీజేపీ ప్రభుత్వం. అదే ఎన్నికల బాండ్లకు సంబంధించిన చట్టం. ఈ చట్టం కేవలం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సంబంధించింది. అయినా ద్రవ్య బిల్లు రూపంలో ఆమోదించుకుంది మోడీ ప్రభుత్వం.
ఎన్నికల బాండ్లు పేరుతో కార్పొరేట్ కంపెనీలు రాజకీయ పార్టీలను తమ ఏజెంట్లుగా మార్చుకునే ప్రమాదం ఉందని, ఇది ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుందనీ న్యాయనిపుణులు, ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారులు నెత్తీ నోరూ బాదుకున్నా బీజేపీ ప్రభుత్వం వినిపించుకోలేదు. 2018లో మార్చి నుంచి నవంబరు మధ్యలో 1056.73 కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్లు జారీ అయితే 2019 ఎన్నికల సంవత్సరంలో జనవరి నుంచి మార్చి వరకు 1700 కోట్ల రూపాయల విలువైన ఎన్నికల బాండ్లు కొనుగోళ్లు జరిగాయి. అంటే ఎన్నికల సంవత్సరంలో బాండ్ల రూపంలో రాజకీయ పార్టీలకు అందిన చందాలు 62శాతం పెరిగాయి. ఈ అమ్మకాలు ప్రధానంగా ముంబయి (495.6 కోట్లు) కొల్కతా (370.70 కోట్లు), హైదరాబాద్ (290.50 కోట్లు), ఢిల్లీ (205.92 కోట్లు), భువనేశ్వర్ (194 కోట్లు)లల్లో జరిగాయి. అంటే ఈ మూడ్నెల్లలో అమ్ముడుపోయిన ఎన్నికల బాండ్లలో 91.5శాతం ఈ నగరాల్లోనే అమ్ముడయ్యాయి. ఈ నిధుల్లో 95శాతం ఒక్క బీజేపీకి మాత్రమే జమ పడ్డాయి. అంటే ఈ ఎన్నికల్లో అధికారికంగా బీజేపీ సుమారు 2618 కోట్ల మిగులు నిధులతో ఎన్నికల బరిలోకి దిగింది. మిగిలిన పార్టీలకు దక్కింది కేవలం రూ.138 కోట్లు మాత్రమే.
కేంద్ర ప్రభుత్వం 2017లో ఆమోదించిన చట్టం ప్రకారం గత సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఒక్కశాతం ఓట్లు తెచ్చుకున్న రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలు ఈ బాండ్ల పథకం కింద లబ్ది పొందటానికి అర్హులు. బాండ్ మార్కెట్లోకి వచ్చాక 15రోజుల్లోపు పార్టీ ఖాతాలో జమ చేసుకోవాలి. ఇందులో మరో ప్రమాదకరమైన క్లాజు కూడా ఉంది. భారతదేశంలో పని చేస్తున్న విదేశీ బహుళజాతి కంపెనీలు కూడా పూర్తిగా దేశీయ కంపెనీలుగా పరిగణించబడతాయని 2017లో ఆమోదించిన చట్టం చెప్తోంది. అంటే ఇంతవరకు విదేశీ కంపెనీల నుంచి రాజకీయ చందాలు తీసుకోరాదన్న షరతు ఇక మీద వర్తించదు. ఈ కంపెనీలన్నీ దేశీయ కంపెనీల కేటగిరీలోకి వచ్చి చేరిన తర్వాత ఈ కంపెనీలు కూడా ఎంత మొత్తమైనా చెప్పా పెట్టకుండా ఏ పార్టీకైనా నిధులు ఇవ్వవచ్చు. అంటే భారతీయులు తమ ప్రతినిధులను ఎన్నుకునే క్రమాన్ని తారుమారు చేయాలంటే విదేశీ కంపెనీలు ఎంతమొత్తమైనా పెట్టుబడి పెట్టవచ్చు. తమ ప్రయోజనాలు కాపాడు కునేందుకు సహకరించే పార్టీలను, ఆ పార్టీలకు చెందిన అభ్యర్థులను ఎన్నుకోవచ్చు. తద్వారా భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటానికి కావల్సిన పునాదులు వేసింది బీజేపీ.
అంతేకాదు. సోషల్ మీడియా ద్వారా జరిగే ఖర్చును అభ్యర్థి, లేదా రాజకీయ పార్టీ ఎన్నికల వ్యయంలో భాగంగా భావించకపోవటం విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి అవకాశమిస్తోంది. ఉదాహరణకు అసోషియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ అనే కంపెనీ దాదాపు మూడేండ్ల నుంచీ మోడీకి అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పని చేస్తోంది. నమో, భారత్ కీ మన్ కీ బాత్, మైభీ చౌకీదార్ హూ వంటి ఫేస్బుక్ పేజీలతో రోజూ కోట్లాదిమందికి మోడీ అనుకూల ప్రచారాన్ని చేరవేస్తున్న కంపెనీల మీద అయ్యే ఖర్చును ఎన్నికల ఖర్చుగా పరిగణించే వ్యవస్థ అందుబాటులో లేదు. దాంతో అటువంటి కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఎన్నికల ప్రచారాన్ని సాగించటానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు దొడ్డిదారిన ఎన్నికలు ధనబలంతో ప్రభావితం చేసేందుకు కావల్సిన ఏర్పాట్లు చేసుకున్నాయి. ఈ ప్రచారం ద్వారా లబ్ది కూడా అభ్యర్థుల ఎన్నికల వ్యయంలో దీనికయ్యే నెలసరి ఖర్చును కూడా కలిపితే తప్ప ఇలాంటి తప్పుడు మార్గాల్లో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే అవకాశాలకు అడ్డుకట్ట వేయలేం. అందుకే తక్షణమే ఎన్నికల వ్యయం నిర్వచనాన్ని మరింత విస్తృత పర్చాలి. పార్టీలు సోషల్ మీడియాపై పెట్టే ఖర్చును, దానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ ఉద్యోగుల వేతనాలను కూడా ఎన్నికల వ్యయంగా పరిగణించేలా నిర్వచనాన్ని మార్చాలి. అప్పుడే ఎన్నికల ప్రచారం, ధన ప్రభావం గాడి తప్పకుండా ఉంటాయి.
అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో 71శాతం మంది ఓటర్లు పార్టీని చూసి ఓటు చేస్తున్నారు అని నిర్ధారణయింది. దీన్ని మరింత పకడ్బందీగా అమలు చేయటానికి వీలైన మార్గం దామాషా ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఓటర్లు బరిలో ఉన్న రాజకీయ పార్టీలను ఎన్నుకుంటారు. ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల నిష్పత్తికి అనుగుణంగా సదరు పార్టీ తమ అభ్యర్థులను ఎంపిక చేసి చట్టసభలకు పంపుతుంది. తద్వారా పార్టీ ఫిరాయింపులు కూడా నియంత్రించవచ్చు. దిగువసభల్లోనూ, అనేక కార్మిక సంఘాల ఎన్నికల్లోనూ ఈ దామాషా పద్ధతిన ఓట్లు లెక్కించే అవకాశం ఉన్నప్పుడు లోక్సభలో అటువంటి వ్యవస్థను అమలు చేయటం కూడా తేలికే. దామాషా ఎన్నికలు, ఎన్నికల వ్యయ సంస్కరణలు చేపట్టకపోతే రానున్న కాలంలో ప్రజలు తమకు నచ్చిన పార్టీలు, అభ్యర్థులను చట్టసభలకు పంపే ప్రజాస్వామ్యం కాస్తా కంపెనీలు తమ అవసరాలు తీర్చగల పార్టీలను, అభ్యర్థులను చట్టసభలకు పంపే కార్పొరేట్ స్వామ్యంగా మారిపోతుంది.
- చైతన్య

No comments:
Post a Comment