ఈ వారం బిజినెస్ వాచ్ పాఠకుల చేతుల్లోకి వచ్చేటప్పటికి పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ 2011-2012 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం బడ్జెట్ జాతీయంగానూ అంతర్జాతీయంగానూ విలక్షణ పరిస్థితుల్లో ముందుకొస్తోంది. అక్టోబరు 27న బిజినెస్ వాచ్‌లో రాసిన వ్యాసంలో భారత ఆర్థిక వ్యవస్థ మాంద్యోల్బణం దిశగా నడవనుందన్న సందేహం వ్యక్తం చేసిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. తాజా పరిణామాలు ఆ సందేహాన్ని రుజువు చేసేవిగా ఉన్నాయి. దాంతో జాతీయ ఆర్థిక వ్యవస్థను మాంద్యోల్బణం నుండి కాపాడేందుకు బడ్జెట్ ఏమి చేయబోతోందన్న ప్రశ్న ముందకొస్తోంది. ఆర్థిక వ్యవస్థలో ఏకకాలంలో అదుపులేని ద్రవ్యోల్బణం, కరెంట్ ఖాతా లోటు, నిరుద్యోగం పెరుగుదల, పారిశ్రామిక వృద్ధి రేటు పతనం వంటి ధోరణులు వ్యక్తమైతే ఈ పరిస్థితిని మాంద్యోల్బణం అని స్థూలంగా చెప్పుకోవచ్చు. బడ్జెట్‌కు ముందున్న ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు పరిశీలిస్తే ఈ ధోరణులు గణనీయంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ద్రవ్యోల్బణం గురించి పెద్దగా చర్చించనవసరంలేదు. ఒకవైపున ప్రధాని మొదలు, ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా, ప్రధాని ఆర్థిక సలహా మండలి అధ్యక్షులు రంగరాజన్ వంటి వారందరూ మార్చి నెలాఖరుకు ద్రవ్యోల్బణం సాధారణ స్థాయికి చేరుకొంటుందని అంచనా వేస్తున్నా వాస్తవం దీనికి భిన్నంగా ఉంది.
ద్రవ్యోల్బణంలో పారిశ్రామికోత్పత్తులు, వ్యవసాయోత్పత్తులు, సేవారంగం వివిధ పాళ్లలో మిళితం అయి ఉంటాయి. వీటిలో మార్చి నెలాఖరు నాటికి పంటల కాలం పూర్తయి పుష్కలంగా ఆహారోత్పత్తులు ఇళ్లకు చేరే అవకాశం ఉంది. అంతేకాదు ఈ ఏడాది ఆహారోత్పత్తుల రంగంలో వృద్ధి రేటు గణనీయంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. దీంతో ద్రవ్యోల్బణంలో ఒక కోణం ఆహారోత్పత్తుల ధరలు దారికి వస్తాయన్నది ప్రభుత్వ ఆర్థిక వేత్తల అంచనా. నిజానికి గత రెండు సంవత్సరాలుగా ఇటువంటి అంచనాలే వేస్తున్నా ఈ అంచనాలు వాస్తవిక రూపం దాల్చటం లేదు. తాజాగా పారిస్‌లో జరిగిన జి 20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ భారత ఆర్థిక మంత్రి ద్రవ్యోల్బణానికి ఫ్యూచర్స్ ట్రేడింగ్, స్పెక్యులేటివ్ ట్రేడింగ్ కారణమన్న విమర్శతో గొంతు కలిపారు. కానీ పార్లమెంట్ మొదలైన రెండో రోజు రాజ్యసభలో జరిగిన చర్చలో మాత్రం పేదలు కడుపునిండా తినటానికి అనుకూల పరిస్థితులు ఉండటం వల్లనే ఆహారోత్పత్తులకు గిరాకీ పెరిగి ధరలు అందనంత ఎత్తుకు పోతున్నాయని వితండవాదం మొదలు పెట్టారు. పైగా అంతర్జాతీయ పరిస్థితులతో భారత ఆర్థిక వ్యవస్థ ముడివేసుకుని ఉన్నందున అంతర్జాతీయ పరిణామాల నుండి జాతీయ ఆర్థిక పరిణామాలను వేరు చేసి చూడలేమని వాదించారు. అటువంటప్పుడు మార్చి నాటికి ద్రవ్యోల్బణం దారికొస్తుందన్న అంచనా అంతర్జాతీయ పరిస్థితులపై అంచనా ఆధారంగా చెప్తోందా లేదా అన్నది పరిశిలీంచాల్సి ఉంది.
ద్రవ్యోల్బణంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న అంశం చమురు ధరలు. 2009-2010 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం దిగుమతి చేసుకున్న చమురు సగటు బ్యారెల్ ధర 69.76 డాలర్లుగా ఉంది. 2010-2011 ఆర్థిక సంవత్సరంలో ఈ సగటుధర 82.07 డాలర్లకు పెరిగింది. జనవరిలో ఇది మరింతగా పెరిగి 93 డాలర్లకు నేడు ఫిబ్రవరి చివరి వారంలో 99.85 డాలర్ల సగటు ధరకు చేరింది. ఈ వ్యాసం రాసే సమయానికి లిబియాలో ప్రజాందోళన తారాస్థాయికి చేరుకోవటం, పశ్చిమాసియాలో నియంతృత్వ ప్రభుత్వాలు ప్రజాగ్రహానికి గురవటంతో ఆయా దేశాల నుండి అంతర్జాతీయ మార్కెట్‌లోకి విడుదల కావాల్సిన చమురు నిల్వలు విడుదల కావటం లేదు. ప్రత్యేకించి ఈజిప్టులో పాలకులు గద్దె దిగిన వారం రోజుల్లోనే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు బారెల్ 100 డాలర్లకు చేరుకొంది. 2011-2012 ఆర్థిక సంవత్సరంలో ఈ ధర 120-125 డాలర్లకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే రెండేళ్ల కాలంలో భారతదేశం దిగుమతి చేసుకునే చమురు ధర 69 డాలర్ల నుండి రెట్టింపు పెరిగినట్లు అవుతుంది. ఈ మేరకు చమురు ఉత్పత్తుల దిగుమతి ఖరీదు పెరుగుతుంది. దాంతో అనివార్యంగా ఎగుమతి-దిగుమతుల మధ్య ఉన్న వ్యత్యాసం మరింత పెరిగిపోతుంది. ఈ వ్యత్యాసాన్నే కరెంట్ ఖాతా లోటు అంటారు. కరెంట్ ఖాతా లోటు అంతిమంగా బడ్జెట్‌లోటును ప్రభావితం చేయనుంది.
ఈ పరిస్థితుల నుండి బయటపడేందుకు ఉన్న ఏకైక మార్గం ప్రభుత్వం తన ఆదాయాలు పెంచుకోవటం. ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవటానికి మళ్లీ రెండు మార్గాలు ఉంటాయి. పన్నుల వ్యవస్థను సంస్కరించటం ఒక మార్గం అయితే ఖజానా ఖాళీకాకుండా ఉండేందుకు సంక్షేమ చర్యలపై కోత విధించడం మరో మార్గం. గత రెండు దశాబ్దాల నుండీ ప్రభుత్వాలు రెండో మార్గాన్ని అనుసరిస్తూ రావటంతో పరిస్థితి నేటి దుస్థితికి చేరింది. చివరకు భారతదేశంలో సామాజిక అభివృద్ధి బంగ్లాదేశ్ సామాజిక అభివృద్ధి కంటే దారుణంగా ఉంది. ఆర్థికాభివృద్ధి కేవలం ఆర్థికరంగం కోసమే కాదని, సామాజిక అభివృద్ధి సాధించేందుకు ఒక సాధనం మాత్రమే అన్న సమగ్ర దృక్ఫథం భారతదేశంలో పాలకులకు లోపించటం పట్ల నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఈ మధ్య కాలంలో తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం ఈ విమర్శలకు ధీటుగా వ్యవహరిస్తుందా లేక అదే కోవలో కొట్టుకుపోతుందా అన్నది నేటి బడ్జెట్‌లో సంపన్న వర్గాలకు ప్రభుత్వం ఇచ్చే రాయితీల వల్ల ఎంత ఆదాయం నష్టపోయిందన్న వివరాలు వెల్లడైతేగానీ చెప్పలేము. 2008-09 బడ్జెట్లో రూ.4,14,099కోట్ల మేర పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయాన్ని వదులుకోగా, 2009-10 బడ్జెట్లో రూ.5,02,299కోట్లు మేర ఆదాయం వదులుకుంది. అంటే సంపన్నులకు రూ.9,16,398కోట్లు రాయితీని ఇచ్చిందన్నమాట. ఇది ప్రభుత్వ ఆదాయంలో 79.54శాతం. ఇదే కాకుండా సంపన్నవర్గాల నుంచి వ్యక్తిగత ఆదాయాపు పన్ను ఖాతా కింద వసూలు చేయాల్సిన మరో రెండు లక్షల పాతిక వేల కోట్ల రూపాయలను కూడా వదులుకుంది. దీంతో సంపన్నవర్గాలకిచ్చిన రాయితీ మొత్తం రూ.11,41,398కోట్లకు చేరింది.
ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెడుతోంది. కేవలం సబ్సిడీల వల్లే, లేదంటే ప్రజా సంక్షేమ పథకాల వల్లే ప్రభుత్వ లోటు పెరుగుతోందనే కుతర్కానికి పూనుకుంటోంది. ఉదాహరణకు దేశంలో ఉన్న 657 మంది మెగా సంపన్నుల వద్ద పోగుపడిన సంపద విలువ 16 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ సంపదపై 1 శాతం సంపద పన్ను, (ఆదాయ పన్ను కాదు) వేస్తే రూ.1,60,000 కోట్ల రూపా యలు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. అంటే ఇది 2జి స్పెక్ట్రం కుంభ కోణంలో ప్రభుత్వం నష్టపోయిన ఆదాయంతో సమానం. అంతేకాక యుపిఎ-1 హయాంలో వామపక్షాల ఒత్తిడి మేరకు అమల్లోకి తెచ్చిన లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను అమలు చేస్తే మరో పదివేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవటం, తీసుకోకపోవటం వెనుక ప్రభుత్వానికి ప్రజల మీద ఏ మాత్రం ప్రేమ ఉంది, సంపన్న వర్గాల మీద ఏ మాత్రం ప్రేమ ఉందన్న విషయాలు తేటతెల్లమవుతాయి.ఆర్థిక వ్యవస్థ ముందున్న మరో సవాలు పారిశ్రామికాభివృద్ధి. ప్రభుత్వం గత పదేళ్లుగా కీలకమైన పారిశ్రామిక రంగంలో ప్రయివేటు భాగస్వామ్యానికి పెద్ద పీట వేసింది. ఈ మేరకు ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో ఒక విధానం - ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం- కూడా రూపొందించింది. ప్రత్యేకించి గత సంవత్సరంలో వివిధ రంగాల్లో భారీఎత్తున అవకాశాలు కల్పించింది. ఈ అవకాశాలు వినియోగించుకునే వారికి వివిధ రూపాల్లో పెట్టుబడులు సమకూర్చుకోవటానికే కాక పన్ను రాయితీలు కూడా వేల కోట్లలో కల్పించింది. ఈ విధాన నిర్ణయాలకు సమర్థింపుగా ప్రభుత్వం ముందుకుతెచ్చిన వాదన, వివిధ అభివృద్ధికార్యక్రమాలకు అవసరమైన నిధులు ప్రభుత్వం వద్ద లేవు అన్నవాదన. ఇన్ని అవకాశాలు ఇచ్చినా ప్రైవేటురంగంలో పెట్టుబడులు గత సంవత్సరంతో పోల్చి చూస్తే ఈ సంవత్సరం 25.6 శాతం పడిపోయాయి. దీని ప్రభావం పారిశ్రామికాభివృద్ధి నత్తనడకపై కనిపిస్తోంది. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల వల్ల 2009-2010 ఆర్థిక సంవత్సరం కంటే 2010-2011 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 31 శాతం తగ్గిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి వచ్చిన నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేవలం 24 బిలియన్ డాలర్లు మాత్రమే. అంటే భారతదేశ పారిశ్రామిక రంగం ఇటు దేశీయ ప్రైవేటుపెట్టుబడులు లేక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాక, ప్రభుత్వం పెట్టుబడులు పెట్టక దివాళాదిశగా నడుస్తోంది. ఈ పరిణామాలన్నీ మదింపు వేసి చూస్తే రానున్న కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో పడనున్నట్లు స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. మరి ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదించే బడ్జెట్ ఈ కష్టాల ఊబి నుండి ఆర్థిక వ్యవస్థను బయటకు లాగుతుందా లేక మరింత లోతైన ఊబిలోకి నెడుతుందా అన్నది పరిశీలించేందుకు బడ్జెట్ ఒక ముఖ్యమైన సందర్భంగా నిలవనుంది.
Monday, February 28, 2011
Saturday, February 26, 2011
తిరోగమన పథంలో మమత రైలు
కొండూరి వీరయ్య
Published in Prajasakti Daily, February 26th 2011 A Comment on Railway Budget
మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఎక్కిన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం మత్తు రైల్వే శాఖకూ ఎక్కింది. ఈ విధానం కింద 52 ప్రాజెక్టులు గత సంవత్సరం ప్రారంభించారు. వీటి ప్రగతి గురించి ఒక్కమాట కూడా బడ్జెట్ ప్రసంగంలో లేదు. కేవలం ఇవన్నీ ఈ సంవత్సరం పూర్తవుతాయి, సమగ్ర పరిశీలన దశలో ఉన్నాయి అన్న మాటలు తప్ప వీటి గురించి మరిన్ని వివరాలు కనిపించవు.
రైల్వే బడ్జెట్ చరిత్రలో ఫిబ్రవరి 25,2011 చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే ఈవిధంగా నిలిచిపోవటానికి కారణం ఏదో సాధించినందువల్ల కాదు. ఏమీ సాధించలేకపోవటం వల్లనే. సాధారణంగా బడ్జెట్ అంటే గత సంవత్సరం పని తీరును పరిశీలించుకుని అసంపూర్ణంగా మిగిలిన లక్ష్యాలను, అందుకు కారణాలను మదింపు చేసుకోవటం, ఆ వెలుగులో వర్తమాన కర్తవ్యభారం స్వీకరించటం. మమతా బెనర్జీ ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్‌లో ఈ మూడింటిలో ఏదీ జరగలేదు. ఒకసారి మంత్రిగారి ఉపన్యాసం విన్న వారికి, చదివిన వారికి ఎవరికైనా ఈ బడ్జెట్ 2011-2012 సంవత్సరానికే లేక రానున్న దశాబ్ద కాలానికా, అర్థదశాబ్దానికా అన్న సందేహం కలుగుతుంది. ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్ల సర్వే మొదలు, లైను డబ్లింగ్ వరకూ, స్టేషన్ నిర్మాణాల మొదలు, సంబంధిత పరిశ్రమల నిర్మాణాల వరకూ 12వ పంచవర్ష ప్రణాళికలో చేపడతామని బడ్జెట్ ప్రసంగం చెప్తోంది. ఇంకా మనం 11వ పంచవర్ష ప్రణాళిక ముగింపు దశకు చేరుకోలేదు. ఇక 12వ ప్రణాళికా కాలంలో చేపట్టం అంటే సదరు ప్రాజెక్టులు కాగితాలకే పరిమితం కావటం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత ఆర్థిక వ్యవస్థ కంటే రైల్వేల ప్రగతి వేగవంతంగా ఉందని చెప్పిన మంత్రి దానికనుగుణంగా మిగిలిన పనులు చేపట్టకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
నిపుణుల అంచనా ప్రకారం ఆర్థిక వ్యవస్థ 9 శాతం వృద్ధి రేటుతో ముందుకెళ్తుంటే రవాణా రంగం ప్రత్యేకించి రైల్వే 11 శాతం వృద్ధిరేటు సాధించాలి. అప్పుడే విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చటానికి సాధ్యమవుతుంది. దీనికి భిన్నంగా గత రెండేళ్లుగా భారత రైల్వే విస్తరణ రైల్వేబోర్డు మాజీ సభ్యుల అంచనాల మేరకు కేవలం 5 శాతానికి పడిపోయింది. రైల్వేల ఆర్థికశక్తి సామర్ధ్యాలకు, మనుగడకు ఆపరేషన్ రేషియో కీలకం. వంద రూపాయాల ఆదాయం సాధించటానికి ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందో దాన్ని ఆపరేషన్ నిష్పత్తిగా నిర్ధారిస్తారు. నాలుగేళ్ల క్రితం వరకూ 76 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి గత రెండు సంవత్సరాల్లో 95 శాతానికి పెరిగింది. వాస్తవిక అంచనాలు, నిధుల లభ్యత, ద్రవ్యోల్బణం వంటివి పరిగణలోకి తీసుకుంటే ఈ నిష్పత్తి 115చేరుతుంది. అంటే వంద రూపాయలు సంపాదించటానికి భారత రైల్వే 115 రూపాయలు ఖర్చుపెడుతోంది. దక్షిణ మధ్య రైల్వేలో వందరూపాయల సంపాదనకు 146 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే మొత్తంగా భారత రైల్వే సగటున 15 శాతం లోటులో నడుస్తోంది. బహుశా భారతరైల్వే చరిత్రలో ఇంత అథమ స్థాయిలో ఎన్నడూ లేని పరిస్థితిని నేడు రైల్వేలు చవిచూస్తున్నాయి.
మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఎక్కిన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం మత్తు రైల్వే శాఖకూ ఎక్కింది. ఈ విధానం కింద 52 ప్రాజెక్టులు గత సంవత్సరం ప్రారంభించారు. వీటి ప్రగతి గురించి ఒక్కమాట కూడా బడ్జెట్ ప్రసంగంలో లేదు. కేవలం ఇవన్నీ ఈ సంవత్సరం పూర్తవుతాయి, సమగ్ర పరిశీలన దశలో ఉన్నాయి అన్న మాటలు తప్ప వీటి గురించి మరిన్ని వివరాలు కనిపించవు. రైల్వేల విస్తరణకు మూల నిధి ఖాతా, అభివృద్ధి నిధి ఖాతాలు కీలకం. ఈ రెండు ఖాతాల్లో నిధులు నామమాత్రపు దశకు చేరుకోవటంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పథకాలకు కేటాయించాల్సిన మేర కూడా రైల్వే శాఖ వద్ద నిధులు లేవు. దాంతో ఈ పథకం కింద వచ్చిన ప్రతిపాదనలన్నింటినీ మూటకట్టి అటకెక్కించారు. మరో ముఖ్యమైన విషయం మిగులు నిధుల పద్దు. ఈ పద్దు నుండే తక్షణ వ్యయం సమకూర్చబడుతుంది. 2007-2008లో 25000 కోట్ల రూపాయలు ఉంటే 2010-2011 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులు 1328 కోట్లకు కుదించుకుపోయాయి. నూతన పథకాలు, ప్రాజెక్టులు చేపట్టకపోవటానికి ఇదీ మూల కారణం. ఈ విషయాన్ని దాచిఉంచటానికి రైల్వే శాఖ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. విస్తరణ విషయంలోనూ బడ్జెట్ సంతృప్తికరంగా లేదు. గత సంవత్సరం బడ్జెట్‌లో సంవత్సరానికి వెయ్యి కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం పూర్తిచేస్తామని లక్ష్యంగా పెట్టుకొంది. 2009లో ప్రకటించిన విజన్ 2020 పత్రం ప్రకారం 2020 నాటికి దేశంలో అదనంగా మరో 2,5000 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాలు నిర్మాణం జరగాలి. అంటే మరో ఎనిమిదేళ్లలో ఈ నిర్మాణాలు పూర్తి కావాలి. అయితే దీనికి సంబంధించి శక్తి సామర్ధ్యాలు, శ్రామికులు, నిధులు, స్థల సేకరణ, ప్రణాళికల తయారీ గురించి పల్లెత్తు మాట లేకుండానే బడ్జెట్ ప్రసంగం ముగిసింది. పైగా ఈ సంవత్సరానికి మరో 800 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం కొత్తగా చేపడతామని డాబుసరిప్రకటనకు మాత్రం బడ్జెట్‌లో చోటు దక్కింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద ఈపాటికేవచ్చిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోగా మరో ఏడు రంగాల్లో ఇటువంటి ప్రాజెక్టులు చేపట్టాలని బడ్జెట్ ప్రతిపాదిస్తోంది. మరో 190 రైల్వే లైన్లకు సంబంధించి సర్వే పూర్తి చేయటానికి 12వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని లక్ష్యంగా నిర్ధారించుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను సర్వే కూడా ఏకంగా పన్నెండవ ప్రణాళికా కాలానికి గెంటివేయబడింది. అంటే కేవలం సర్వేకే మరో ఐదేళ్లు పడితే, 2017 నాటికి పూర్తి అయ్యేట్లయితే కేవలం మిగిలిన మూడు సంవత్సరాల్లో నిర్మాణం ఎలా పూర్తవుతుందన్నది ఎవరికీ అంతుబట్టని బ్రహ్మ రహస్యంగానే మిగిలిపోయింది.
రౖల్వేల విస్తరణకు కీలకమైన ఇంజనీరింగ్, కోచ్, వ్యాగన్ పరిశ్రమల నిర్మాణానికి ప్రభుత్వం ఎంచుకున్న కేంద్రాలు పరిశీలిస్తే రైల్వే శాఖ మానసిక స్థితి గురించి సందేహాలు రాకపోవు. జమ్ము కాశ్మీర్‌లో రైలు బ్రిడ్జిలు, మణిపూర్‌లో డీజిల్ ఇంజన్లు తయారు చేసి దేశమంతటా పంపిణీ చేస్తామన్న మంత్రి ప్రకటన వెనక భారతదేశ భౌగోళిక పరిస్థితులు, దానికున్న పరిమితులు గురించిన అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాఖండ్ కొన్ని సరిహద్దు ప్రాంతాలకు రోడ్డు నిర్మాణానికి కావల్సిన యంత్ర సామాగ్రిని తరలించాలంటే కనీసం ఆర్నెల్ల వ్యవధి అవసరం. అటువంటిది జమ్ము కాశ్మీర్‌లో తయారు చేసిన రైలు బ్రిడ్జి సామగ్రి దేశంలో మిగిలిన ప్రాంతాలకు చేరవేయటానికి ఎంత సమయం పడుతుంది ? అసలు జమ్ము కాశ్మీర్ నుండి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు మధ్య ఉన్న రైల్వే నెట్‌వర్క్ ఎంత? అందులో వ్యాగన్‌లు తరలించగలిగిన నెట్‌వర్క్ ఎంత అన్నది పరిశీలిస్తే ఈ ప్రతిపాదనల హేతుబద్దతను ప్రశ్నించకుండా ఉండలేము. అదేవిధంగా మణిపూర్‌లో నిర్మించిన డీజిలు ఇంజన్లను కనీసం ఈశాన్యభారతంలోని ఏడు రాష్ట్రాలకు చేరవేయటానికే ఏళ్ల గడువు పడుతుంది. అటువంటిది మిగిలిన దేశానికి చేరవేయటానికి ఉన్న సాధనాల గురించి కూడా పరిశీలించకుండా ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారు చేసిందీ ప్రభుత్వం. ఏతావాతా చెప్పాలంటే ఈ బడ్జెట్ అత్యంత అశ్రద్ధతో, అసమంజస ప్రతిపాదనలతో, వచ్చే సంవత్సరాల కోసం రూపొందించిన బడ్జెట్ తప్ప కనీసం రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ కాదు అన్నది స్పష్టంగా రూఢి అవుతోంది.

Tuesday, February 22, 2011
బడ్జెట్ దిశ ఎటు వైపు?
Business Watch, Prajasakti, February 21st 2011
యుపిఎ ప్రభుత్వం వరుసగా ఏడవ బడ్జెట్‌ను వచ్చే వారం పార్లమెంట్ ముందుంచబోతోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పలువురు విశ్లేషకులు ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాల ముఖ్య సారాంశం ద్రవ్య నియంత్రణను మళ్లీ తెరమీదకు తేవటంగా కనిపిస్తోంది. ఈ ఏడు బడ్జెట్లలో మూడు బడ్జెట్‌లు పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం నీడన రూపొందాయి. దాంతో ప్రభుత్వం పెద్దగా సంస్కరణల విషయంలో సాహసం చేయలేకపోయింది. దానికి తోడు కుదేలైన ఆర్థిక వ్యవస్థలో వృద్ధి రేటు కొనసాగించాలంటే ప్రభుత్వం పెద్దఎత్తున ఖర్చు పెట్టటం, ఖర్చు పెట్టగలిగిన స్తోమత ఉన్న వారికి రాయితీలు ఇవ్వటం వంటి చర్యలు అనివార్యంగా చేపట్టాల్సి వచ్చింది. గత మూడేళ్ల కాలంలో సంక్షోభం తీవ్రత వెనక పట్టుపట్టినా పూర్తిగా తొలగిపోయిందన్న దాఖలాలు కనిపించటం లేదు. ఈ పరిస్థితుల్లో గత మూడేళ్ల కాలంలో బడ్జెట్ లోటు పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో ద్రవ్యోల్బణం, ప్రత్యేకించి ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం అదుపు లేకుండా పెరుగుతోంది. ఈ పెరుగుదల ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాధారణ ప్రజల దైనందిన జీవితాన్ని మరింత దుర్భరం చేస్తోంది. దేశంలో కరెంట్ అక్కౌంట్ లోటు విపరీతంగా పెరుగుతోంది.ఈ లోటు స్థూలంగా బడ్జెట్ లోటును పెంచేస్తోంది. దీంతో సంస్కరణ వాదులు ఈ బడ్జెట్ లోటును నియంత్రించాలంటే మూడేళ్లుగా అమలు జరుగుతున్న ఉద్దీపన పథకాలను విరమించాలని, ప్రభుత్వ వ్యయంపై కోత విధించాలని ప్రతిపాదిస్తున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ముందున్న కొన్ని ప్రాధాన్యతల గురించి పరిశీలిద్దాం.
ప్రభుత్వ ఆర్థిక వేత్తల అంచనా ప్రకారమే ఈ కాలంలో అంతర్జాతీయ వాణిజ్యం మందగించింది. అంతర్జాతీయవాణిజ్యంతో పాటే మన దేశం నుండి వెళ్లే ఎగుమతులు కూడా మందగించాయి. ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు ఉపయోగించుకుని దేశంలోని గుత్తపెట్టుబడిదారులు, వివిధ తరగతులకు చెందిన పారిశ్రామిక వేత్తలు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన యంత్రసామాగ్రిని కొనుగోలు చేశారు. దాంతో ఎగుమతులు తగ్గినా, దిగుమతులు మాత్రం పెరిగాయి. రిజర్వు బ్యాంకు ఈ కాలంలో అనుసరించిన ద్రవ్య విధానం ఈ దిగుమతులకు అవసరమైన నిధుల లభ్యతను సులభతరం చేసింది. తక్కువ వడ్డీతో అందుబాటులో ఉన్న పెద్దమొత్తాలు వినియోగించుకుని పారిశ్రామిక సంస్థలు తమ భవిష్యత్తు విస్తరణకు అవసరమైన వస్తు సామాగ్రిని సమకూర్చుకున్నాయి. దీంతో కరెంట్ అక్కౌంట్ ఖాతా లోటు గణనీయంగా పెరిగింది. ఈ విషయాలు మరుగునపెట్టి ప్రభుత్వం అనుసరించే సంక్షేమ వ్యయం వల్లనే బడ్జెట్ లోటు 5 శాతానికి మించి పోతోందని, ద్రవ్యజవాబుదారీ,బడ్జెట్ నియంత్రణ చట్టాన్ని తు.చ.తప్పకుండా అమలు చేయటం ద్వారానే ద్రవ్య వ్యవస్థలో సమతౌల్యం కాపాడవచ్చన్న వాదన ముందుకొస్తోంది. ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని గమనించాలి. సంపన్న వర్గాలకు ఇచ్చే రాయితీలు ద్రవ్య విధాన రూపంలో ఉన్నాయి. అంటే రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించటం, మార్కెట్‌లో పుష్కలంగా నిధులు అందుబాటులోకి తేవటం వంటి రూపాల్లో ఈ రాయితీలను చూడవచ్చు. మరోవైపున ప్రభుత్వం నేరుగా సంపన్న వర్గాలకు ఇచ్చే రాయితీలు పన్ను రాయితీలు.విదేశీ మారకద్రవ్య నిల్వలు పెంచుకోవాలన్న మిషతో ఎగమతి సుంకాల రాయితీలు, దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునే లక్ష్యం పేరుతో దిగుమతి సుంకాల రాయితీలతో పాటు వివిధ రకాల పన్ను రాయితీలు ఉద్దీపన పథకాల్లో అంతర్బాగÛంగా అమలు జరిగాయి. దీనికి భిన్నంగా పేదలకు ఇచ్చే రాయితీలు మాత్రం డబ్బుల మూట రూపంలో కనిపిస్తాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఎరువుల సబ్సిడీ, విద్యారంగంలో వ్యయం, మధ్యాహ్నభోజన పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటి రూపాల్లో ఈ వ్యయం కనిపిస్తోంది. ద్రవ్య జవాబుదారీ చట్టం రెండో తరహా వ్యయాన్ని మాత్రమే నియంత్రిస్తోంది తప్ప మొదటి తరహా వ్యయాన్ని కాదు. అంటే రానున్న బడ్జెట్‌లో ద్రవ్యనియంత్రణ చట్టం అమలు చేయటం అంటే పేదలకు ఇచ్చే రాయితీలపై వేటు వేసి ధనికులకు ఇచ్చే రాయితీలు కొనసాగించటం జరుగుతుంది.
బడ్జెట్ ముందున్న మరో ముఖ్యమైన కర్తవ్యం మౌలికసదుపాయాల రంగంలో వ్యయాన్ని పెంచటం. దీనికిగాను 11వ పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిని అధికారికంగా ఆమోదించారు. ఈ పథకం కింద అమలు జరిగే పనులకు కూడా ఉద్దీపన పథకం రాయితీలు వర్తిస్తున్నాయి. అయితే ఈ పథకం కేవలం జాతీయ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన మౌలిక సదుపాయాలకు పరిమితం కాకుండా గ్రామీణాభివృద్ధి మొదలు, పర్యాటకరంగం అభివృద్ధి వరకూ అన్ని రంగాలకూ వరింపచేస్తున్నారు. ఈ విధమైన మూసపోత విధానం వల్ల కొన్ని ప్రాంతాలు, రాష్ట్రాలు మాత్రమే లబ్దిపొందుతున్నాయి. ఉదాహరణకు దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో పనులు చేపట్టేందుకు చూపించే ఉత్సాహాన్ని ప్రైవేటు కంపెనీలు జమ్ము కాశ్మీర్ లేదా ఈశాన్యభారత రాష్ట్రాల్లో చేపట్టటానికి చూపించటం లేదు. దాంతో ఆయా రాష్ట్రాల్లో కీలకమైన అభివృద్ధి కార్యక్రమాలు వెనకపట్టు పడుతున్నాయి. ఉదాహరణకు మిజోరం, త్రిపుర,మేఘాలయ, అస్సాం వంటి రాష్ట్రాల్లో భౌగోళిక పరిమితుల కారణంగా ఇతర రాష్ట్రాల్లో వచ్చినంత లాభాలు ఈ రాష్ట్రాల్లో చేపేట్టే మౌలికసదుపాయాల నిర్మాణానికి రావు. ఇంకా విడమర్చి చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లో ఒక గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నెలకొల్పటానికి అవసరమైన సామాగ్రిని కేవలం నెలల వ్యవధిలో తరలించవచ్చు. కానీ త్రిపుర వంటి రాష్ట్రంలో ఈ ఉత్పత్తి సామాగ్రిని తరలించటానికి సంవత్సరాల తరబడి సమయం పడుతుంది. ఇంతకాలం కేవలం యంత్రసామాగ్రి తరలించటానికి వెచ్చిస్తే కాంట్రాక్టర్లకు వచ్చే లాభాలు తగ్గిపోతాయి. దాంతో ఎవ్వరూ ముందుకు రావటం లేదు.
అటువంటప్పుడు ఈ ప్రాంతాలు మొత్తంగా జాతీయ అభివృద్ధి స్రవంతి నుండి పూర్తిగా వెనకబడిపోతున్నాయి. ఇటువంటి కీలకమైన విధానం గురించి పునరాలోచించాల్సిన సమయం ఇది. మౌలికసదుపాయాల రంగంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానాన్ని తొలిసారిగా అమలు జరిపిన బ్రిటన్ ప్రభుత్వమే ఈ విధానాల నుండి వెనక్కు మళ్లుతోంది. దేశంలో ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ మెట్రో నిర్మాణంలో కన్నాట్ ప్లేస్ నుండి విమానాశ్రయం వరకూ ఉన్న రూటు నిర్మాణాన్ని ప్రైవేటు భాగస్వామికి అప్పగించారు. ఇప్పటి వరకూ ఈ నిర్మాణం పూర్తికాలేదు. హైదరాబాద్, బెంగుళూరు మెట్రోల నిర్మాణం కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. ఈ పరిస్తితుల్లో ప్రణాళిక సంఘం మద్దతుతో అమలు జరుగుతున్న ఈ విధానాన్ని సమీక్షించటానికి బడ్జెట్ వేదికగా మారితే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి కాక ఉన్నత విద్యారంగం, సేవారంగం వంటి వాటిలో ప్రభుత్వరంగ వ్యయం పెంచాలన్న డిమాండ్ ఉండనే ఉంది. జాతీయ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావటానికి కేవలం భౌతికపరమైన మౌలికవసతులు కల్పిస్తే చాలదు. వాటిని వినియోగించుకోవటానికి అవసరమైన సామాజిక మౌలికసదుపాయాలు కల్పించాలి. అటువంటిది జరగాలంటే ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అసమానతలను అదుపుచేయాలి. ఈ దిశగా ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఏ చర్యలుచేపట్టనున్నది వేచి చూడాలి.

Tuesday, February 8, 2011
MALEGAM REPORT - Paving Way for Consolidation of MFI Monopolies
K Veeraiah
Published in People's Democracy,
THE much awaited report of the Malegam panel on micro-finance institutions (MFIs), appointed by the Reserve Bank of India (RBI), has shattered the hope of all those who thought micro-finance was a vehicle of financial inclusion. The panel has come out with 26 recommendations, spanning from capping the interest rate to capping the margins, limiting the borrowings, and leaving the mechanism for regulating the industry for open debate. When one sees a recommendation about capping the interest rates, whose high rates are the root cause of the current problems faced by the MFI industry, at 24 per cent, one feels whether the panel could not come out with more a stringent recommendation.
TWO MAJOR DRAWBACKS
However, a completely different picture unveils before us when we dissect the implications of the panel’s recommendations. For one thing, the panel has not even considered the types of MFIs, their mode of functioning and how they emerged as a grassroots credit movement. As a consequence, panel recommendations pertain merely to how to deal with the for-profit corporate entities in the sector.
The first criticism of the Malegam report is that it refused to consider the MFI sector as a whole. In its stead, it confined itself to focusing on the problems of corporate MFIs. On the face of it, it looks like a recognition of the lacunae in the RBI’s regulatory set-up with regard to the non-banking financial companies (NBFCs). While reflecting on the Microfinance Regulation Bill which was introduced during the UPA’s first tenure, a long pending demand from the Left and other progressive sections was that the NBFCs must also be brought under the purview of the bill. As we know, though the duty of regulating the NBFCs rested with the RBI, it has not been able to discharge the same due to its priorities. The demand for creating a single category of the NBFC-MFIs is meant to allow for regulating of these institutions, whose unchecked proliferation would only help the dominant players to garner a large chunk of the profits whose quantum is diminishing with the mushrooming of the MFIs. A new category of the NBFC-MFIs would enable the RBI to extend its regulatory cover to these entities, which would be a good sign.
Another important recommendation of the Malegam is about raising the bar on the minimum net worth of an institution from Rs 2 crore to Rs 15 crore. This is higher even than the amount that is required to start a private bank. This would keep a majority of the MFIs, which are already functioning unregulated, out of the purview of the RBI’s regulation. This has also a serious implication: it would pave the way for the entry of big boys into the sector which was devised basically for catering the unorganised, under-banked category of people. If only those can get into the sector who can afford to invest Rs 15 crore, it means that only large corporations and firms having the capacity to mobilise money through equity from the market will be able to call the shots. This would also lead to drastic changes in the ownership pattern by opening the floodgates for acquisitions, as the panel’s recommendations would make an infusion of capital or equity urgently necessary for an institution to sustain the tag of an MFI. In the hitherto existing set-up, all those with an ability to set aside Rs 2 crore as net worth, could start an MFI in a local area, and this made possible the setting up of decentralised lending mechanisms that could cater to the requirements of the unorganised, scattered set of people. Raising the bar on the net worth to Rs 15 crore also means that meeting the local needs with local entrepreneurial skills would become impossible.
CONTRADICTORY RECOMMENDATIONS
The recommendation to raise the bar on the net worth and the panel’s recommendation about the need for competition in the field are in fact contradictory to each other. The reason is simple: raising the entry bar in regard to the net worth would automatically result in elimination of competition.
At another point, while harping on the need for making the sector more competitive, the panel’s opinion gives one the impression that it is not for allowing completion between different models of MFIs. In its stead, the panel confines itself to recommending competition only among the for-profit MFIs.
Secondly, the panel has assumed and argued that increased bank lending to the microfinance sector should result in a reduction in the lending interest rates. But if this assumption had been true, the recent proliferation of the MFIs as well as the enormous lending by the banks to these institutions would have resulted in a reduction in the interest rates. As we all knew, what has happened in reality is in sharp contradiction to this assumption.
Further, it is surprising that while indulging in an elaborate reasoning on capping the interest rates --- which it suggested should be done at 24 per cent --- the panel has overlooked the opinion of the Planning Commission’s subcommittee on the micro-finance sector. The said subcommittee “felt that the best way to bring down the rate of interest is to expand the micro-finance operations of the RRBs (regional rural banks) in a big way..…The advantage with the RRBs is that they are able to mobilise low cost funds and would therefore be in a position to charge reasonable rate of interest.”
The panel’s recommendation about capping the interest rates at 24 per cent may also lead to imposition of hidden costs, as has happened in the case of credit cards and other financial innovations, unless the regulator creates the scope for regulated competition which would include semi-government agencies like the RRBs and cooperatives. Also, the capping of margins would lead to a restructuring of the personnel. For example, Lok Capital Foundation informs us that to protect their margins they are going to extend their field staff coverage from 300 borrowers as at present to 900 borrowers. The MFIs will obviously find some other methods as well to ensure that their margins remain intact.
AGRICULTURE OUT OF PRIORITY
The panel, which harped in detail on ensuring the priority sector tag to the MFI lending, has, however, refused to go into the issue of reducing the cost of borrowing for non-NBFC MFIs. On their part, the MFIs do seek a continuation of the priority sector tag for themselves, are surprisingly keeping the agricultural sector --- which is a priority sector --- out of the purview of their lending. But the panel has not offered any comments on this phenomenon.
In line with the public concern about multiple lending, the panel has recommended that not more than two MFIs should lend money to a single borrower and also that a borrower cannot be a member of more than one self-help group (SHG) or joint lending group (JLG). If implemented strictly, it would lead to a trimming of the overgrown customer base. To ease the burden on the borrower, the panel also recommended relaxation in the tenure of repayment which can give some relief to the borrower.
In sum, all but a few recommendations of the Malegan panel are such that, if accepted, they would ensure neither legitimate protection to the borrowers nor an orderly growth of the industry. In the end, the whole sector would end up with corporatisation and consolidation of the monopolistic, for-profit MFIs instead of diversifying the lending set-up with a boost to the non-profit institutions.

పశ్చిమాయాలో ప్రజాస్వామ్య కుసుమాలు
# సబ్‌ప్రైమ్ సంక్షోభంతో తలకిందులైన ఆర్థిక వ్యవస్థలు
కొత్త సంవత్సరం పశ్చిమాసియా దేశాల్లో ప్రజలకు కొత్త ఆశలు కలిగించింది. సంవత్సరారంభంతో మొదలైన ప్రజాస్వామిక ఉద్యమాలు నేడు దేశాధినేతల తలరాతలు మార్చే శక్తులుగా ఆవిర్భవించాయి. ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రజ్వరిల్లుతున్నా, పర్యావరణ పరిరక్షణోద్యమాలతో కొత్తగాలులు వీస్తున్నా, వివిధ దేశాల్లో రాజకీయ సామాజిక ఆర్థికసమస్యలపై ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నా పశ్చిమాసియా ప్రజానీకం మాత్రం నిస్తేజంగా చూస్తుండటం విస్మయపర్చే అంశమే. చమురు బావి నుండి చమురు ఉవ్వెత్తున ఉబికి వచ్చినట్లు పశ్చిమాసియా ప్రజానీకం అటువంటి నిస్తేజం నుండి, నిద్రాణావస్థ నుండి ఒక్కసారిగా మేల్కొంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఆధునిక రాచరికం తరహా పాలనలో మగ్గిన ప్రజలు నేడు జూలు విదుల్చుతున్నారు. తమకు ప్రజాస్వామ్యం కావాలని నినదిస్తున్నారు. రాజకీయాల్లో వారం రోజుల వ్యవధి చాలా ఎక్కువ అన్న నానుడి ఉంది. ఈ నానుడిని నిజం చేస్తున్నాయి పశ్చిమాసియా దేశాల పరిణామాలు.
పశ్చిమాసియా దేశాల్లో తొత్తు ప్రభుత్వాలను గద్దె నెక్కించి వాటిని కాపాడటానికి అవసరమైన వ్యవస్థలు, సంస్థలను ఏర్పాటు చేయటంలో దిట్ట అయిన అమెరికా సైతం తాజా పరిణామాలను అంచనా వేయలేకపోయింది. ప్రపంచ దేశాల్లో చీమ చిటుక్కుమన్నా పట్టేసే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏకంగా దేశ దేశాలే తిరుగుబాటుకు దిగుతుంటే గుర్తించలేకపోయింది. ఈ తిరుగుబాటుకు కారణాలు, లక్ష్యాలను అంచనా వేయలేకపోతోంది. ఇక తాజాగా ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభానికి, తాజా రాజకీయ పెను ఉద్యమాలకు మధ్య సంబంధాన్ని గుర్తించటంలో పాలకవర్గాల వైఫల్యం గురించి చెప్పుకోనవసరం లేదు. ఈ వ్యాసంలో తాజా ప్రపంచ సంక్షోభానికి, పశ్చిమాసియాలో దేశాధినేతల తలరాతలు మారుస్తున్న ఉద్యమాలకు మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలిద్దాం. గత నాలుగు దశాబ్దాలుగా సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు అవసరమైన వనరులు, ప్రత్యేకించి ఇంధన వనరులు సరఫరా చేసింది పశ్చిమాసియా. సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థల పునఃనిర్మాణానికి అవసరమైన సరఫరాలు గ్యారంటీ చేసుకునేందుకు అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాద దేశాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయి. నాలుగు దశాబ్దాల పాటు ఎన్నికలు జరుగుతున్నా ఒకే రాచకరిక కుటుంబాలు వరుసగా ఎన్నికవుతున్నాయంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ఏమాత్రం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నాలుగు దశాబ్దాల పాటు పశ్చిమాసియా దేశాలు క్రమం తప్పకుండా అమెరికాకు మంచి మిత్రులుగా వ్యవహరించాయి. ప్రపంచీకృత ఆర్థికవ్యవస్థకు అవరసరమైన ఇంధన రంగంలో ప్రభుత్వ నియంత్రణలు పాటిస్తూనే మరోవైపున సామాజిక రంగాల్లో ప్రైవేటీకరణ విధానాలు విచ్చలవిడిగా అమలు చేశాయి ప్రభుత్వాలు. దాంతో దిగువ పట్టికలో చూపిన విధంగా వివిధ దేశాల్లో నిరుద్యోగం ఊహించనంత స్థాయికి చేరింది.
ప్రజలకు తమ ఆగ్రహావేశాలు వ్యక్తం చేయటానికి అవసరమైన ప్రజాతంత్ర సాధనాలు, మార్గాలు పరిమితంగా ఉండటం, పాలకవర్గాలకు సామ్రాజ్యవాదుల ప్రత్యక్ష అండదండలు ఉండటంతో ప్రజలు గత్యంతరం లేక నిమిత్తమాత్రులయ్యారు. ప్రజల నుండి తమ విధానాలు, వాటి పర్యవసానంగా జరుగుతున్న సంపద కేంద్రీకరణ క్రమాలకు విఘాతం కలగకుండా ఉండటానికి ప్రపంచీకరణ విధానాలు అనుమతించినమేరకు సంక్షేమ చర్యలు అమలు జరిగాయి. పశ్చిమాసియాలో సంక్షేమ చర్యలు ప్రధానంగా నీటి సరఫరా రంగానికి, ఆహారోత్పత్తుల రంగానికి పరిమితం అయ్యాయి. ఈ దేశాల ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల రీత్యా ఆహారోత్పత్తులు పరిమితం. దాంతో ఆయా దేశాలు తమ దేశీయ ఆహార అవసరాలు తీర్చుకోవటానికి సైతం విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సి వచ్చేది. 1950,1960 దశకాల్లో ఈజిప్టు వంటి దేశాలు అప్పట్లో భారతదేశం తరహాలోనే దిగుమతులకు ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు అవలంబించినా 70 దశకం వచ్చే సరికి పరిస్థితులు మారిపోయాయి. యాంకిప్పుర్ యుద్ధం తర్వాత ఈ ప్రాంతంలో ప్రజాతంత్ర ఉద్యమాలకు తలమానికంగా ఉన్న ఈజిప్టు క్రమంగా సామ్రాజ్యవాద శిబిరంలో జూనియర్ భాగస్వామిగా మారింది. దాంతో ఈ దేశం అనుసరించిన ఆర్థిక విధానాల రూపు రేఖలే మారిపోjయాయి.
పశ్చిమాసియా దేశాల్లో సమృద్ధిగా లభించే ఏకైక ముడిసరుకు చమురు. చమురు లేనిదే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లేదు. దాంతో ఒకప్పుడు సార్వభౌమత్వ దేశాల ఆధీనంలో ఉన్న ఈ చమురు వనరులపై హక్కులు అధికారాలు నేడు ప్రపంచీకరణకు చోదకశక్తులుగా ఉన్న అంతర్జాతీయ సంపన్నవర్గాల చేతుల్లోకి మారిపోయాయి. తొలుత ఈ మార్పు వల్ల పశ్చిమాసియా దేశాలకు ఆదాయ వనరులు పెరిగాయి. దాంతో మారిన ఆర్థిక విధానం వల్ల దేశంపై పడుతున్న అదనపు భారాలను తట్టుకుని నిలవగలిగాయి. కాలక్రమంలో అంతర్జాతీయ సంపన్నవర్గంలో భాగస్వాములుగా మారిన ఈ దేశాల పాలకవర్గాలు దేశ అవసరాలను ఎడారుల్లో వదిలిపెట్టాయి. దానికితోడు ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో మమేకం కావటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో వచ్చే మార్పులకు ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతున్నాయి. 1997 ఆసియా దేశాల ఆర్థిక సంక్షోభం తర్వాత పశ్చిమాసియా, ఆఫ్రికాదేశాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షించే కేంద్రాలుగా మారాయి. దాంతోపాటే సార్వభౌమ నిధులు, ఇతర ద్రవ్యసంకర రూపాలు తెరమీదకు వచ్చాయి. మార్కెట్‌లో స్పెక్యులేషన్ పెరిగిపోయింది.
తాజాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం, తదనరం నేడు దేశాలు ఎదుర్కొంటున్న ఆహార సంక్షోభంతో ప్రజలపై ఎనలేని భారాలు పడ్డాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ఈజిప్టు, ఇతర పశ్చిమాసియాదేశాలకు వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోయాయి. సంక్షోభం నేపథ్యంలో చమురు ఉత్పత్తుల విలువ పతనం కావటంతో ఆయా దేశాలకు వచ్చేఆదాయం కూడా పతనం అయ్యింది. అదే సమయంలో సంక్షోభం సైడ్ ఎఫెక్ట్‌గా దాదాపు మూడేళ్లపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో గిరాకీపడిపోయింది. తదనుగుణంగా ఉత్పాదకరంగం మందగించింది. ఉత్పాదకరంగానికి కీలకమైన ముడిసరుకులు సరఫరా చేసే ఆ దేశాల ఉత్పత్తులకు కూడా డిమాండ్ తగ్గింది. దాంతో పశ్చిమాసియాదేశాల ఆర్థిక వ్యవస్థలు అన్ని వైపుల నుండి చక్రబంధనంలో చిక్కుకుపోయాయి. ఒక్క ఈజిప్టులోనే సంక్షోభం కారణంగా స్థూల జాతీయోత్పత్తి 7 శాతం పతనం అయ్యింది. ఆహారోత్పత్తుల ధరలు, ఇంధన సబ్సిడీల భారం పెరిగిపోయాయి. పశ్చిమాసియాలో మిగిలిన దేశాలు సైతం సగానికిపైగా ఆహారోత్పత్తులు విదేశాల నుండి దిగుమతి చేసుకునేవే. ప్రతికూల పర్యావరణ పరిస్థితులు, స్పెక్యులేటివ్ వ్యాపారం ద్వారా పెరుగుతున్న ఆహారోత్పత్తుల ధరలు ఈ ఆర్థిక వ్యవస్థలపై భారంగా మారాయి. ఉదాహరణకు అల్జీరియాలో ఆహార వస్తువుల ధరలు గత సంవత్సర కాలంలో 30 శాతం పెరిగాయి. ఈజిప్టు ఆహార దిగుమతులకు అదనంగా 30 బిలియన్ డాలర్లు వెచ్చించాల్సి వచ్చింది. ఇదేసమయంలో ప్రపంచీకరణ వల్ల ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ద్వితీయశ్రేణి ఆర్థిక వ్యవస్థలుగా మారాయి. దానికితోడు పశ్చిమాసియా దేశాల్లో జనాభా పెరుగుదల 2.3 శాతంగా ఉంది. దాంతో ప్రైవేటీకరణ, జనాభా రేటు పెరుగుదల ఫలితంగా పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచ బ్యాంకు అంచనా మేరకే 2035 నాటికి పశ్చిమాసియా దేశాలు 51 మిలియన్ల అదనపు ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంది.
గత నాలుగు దశాబ్దాల్లో హరితవిప్లవం ద్వారా వ్యవసాయ రంగంలో యాంత్రిక శక్తి వినియోగం పెరిగింది. దాంతో పెట్టుబడులు పెరిగాయి. చమురు వినియోగం పెరిగింది. నేడుచమురు ధరల్లో వచ్చే గాలివాటు మార్పులువల్ల పశ్చిమాసియా దేశాల్లో వ్యవసాయం పూర్తిగా నష్టదాయకంగా మారింది. దాంతో ఆహారోత్పత్తుల కొరత మరింత పెరింగింది. హరితవిప్లవం ఫలాలు తగ్గుముఖం పట్టనారంభించాయి. పర్యావరణంలో వచ్చే మార్పులతో తాగునీటి సమస్య ఈ దేశాల్లో కీలకమైన సమస్యగా అవతరించింది. ఉదాహరణకు పశ్చిమాసియాలో ఉండే మృతసముద్రంలో నీటిమట్టం బాగా పడిపోయింది. పర్యావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం 20 శాతం తగ్గిపోయింది. ఈ పర్యవసానాలన్నీ వెరసి పశ్చిమాసియాదేశాల్లో జీవన సరిస్తితులు సామాజిక సంక్షోభం దిశగా మారుతున్నాయి. నేడు ఆయాదేశాల్లో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఉద్యమాలు నిర్దిష్ట రూపం తీసుకుంటున్న సామాజిక సంక్షోభానికి వ్యక్తీకరణలే.
కొండూరి వీరయ్య
Friday, February 4, 2011
బెంగాల్‌ను అస్థిరత నుండి సుస్థిరతకు నడిపిన లెఫ్ట్ ఫ్రంట్
Published in Marxistu Feb 2011
బెంగాల్‌లో దీర్ఘకాలంగా నిద్రాణంగా ఉన్న విఛ్చిన్నకర శక్తులకు నేడు తృణమూల్ కాంగ్రెస్ ఒక వేదికగా మారింది. దాంతో ఇప్పటి వరకూ బెంగాల్‌లో కనిపించని అస్థిత్వ వాదాలు, తిరోగమన వాదాలు నేడు మనకు కనిపిస్తున్నాయి. ఈ శక్తులు బెంగాల్ గత మూడున్నర దశాబ్దాలుగా సాధించిన రాజకీయ సుస్థిరతనూ, ప్రజాతంత్ర చైతన్యాన్నీ, ఆర్థిక ఫలాలనూ ధ్వంసం చేయబూనుకుంటున్నాయి. వీటికి జాతీయస్థాయిలోని ప్రగతినిరోధక శక్తులు చేదోడువాదోడుగా నిలుస్తున్నాయి.
నేడు పశ్చిమబెంగాల్ రాజకీయ పరిణా మాలు కేవలం వామపక్ష శ్రేయోభిలాషుల దృష్టినే కాదు. మొత్తం ప్రపంచ దృష్టినాకర్షి స్తున్నాయి. వరుసగా ఏడు సార్లు అసెంబ్లీ ఎన్ని కల్లో విజయ దుందుభి మోగించిన వామపక్ష సంఘటన ఎనిమిదోసారి కమ్యూనిస్టు పతాకాన్ని ఎగరవేస్తుందా లేదా అని వామపక్ష అభిమానులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఈ కాలంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పలు ఆర్థిక రాజకీయ పరిణామాలు నేపథ్యంలో వామపక్ష వ్యతిరేకులు విషప్రచారానికి ఒడిగడుతున్నారు. బెంగాల్‌లో వామపక్ష ప్రభుత్వం సాధించి విజయాలను చిన్నవి చేసి చూపే ప్రయత్నాలు ప్రారంభ మయ్యాయి. దానికి తోడు నేడు దేశంలోనూ, బెంగాల్‌లోనూ మూడొంతుల మంది ఓటర్లు 70 దశకం తర్వాత పుట్టిన వారు కావటంతో అంతకు పూర్వపు రాజీకయ సామాజిక పరిస్థి తులు ఏ పరిస్థితుల్లో బెంగాల్ ప్రజలు వామపక్ష సంఘటనకు పట్టం కట్టారు, దానికి ముందు రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా నష్టపో యింది అన్న విషయాలు గురించి తెలుసుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో 60-70 దశకాల నాటి దేశ రాజకీయ పరిస్థితిని స్థూలంగా, బెంగాల్ రాజకీయ చిత్రాన్ని వివ రంగా పాఠకులముందుంచే ప్రయత్నమే ఈ వ్యాసం.
నేపథ్యం
స్వాతంత్య్రానంతర తొలి రెండు దశాబ్దా లు నెహ్రూ ప్రత్యక్ష పర్యవేక్షణలో అమలు జరిగిన అభివృద్ధి వ్యూహానికి గల పరిమితులు అనతికాలంలోనే వెల్లడయ్యాయి. రాజ్యాంగం అందరికీ అందించిన హక్కులు, అవకాశాలను ప్రజలు సంపూర్ణంగా అనుభవించే పరిస్థితి లేకపోయింది. ప్రజా సమీకరణే ప్రధాన వ్యూహంగా స్వాతంత్య్రోద్యమంలో పని చేసిన కాంగ్రెస్, అధికారానికి వచ్చిన తర్వాత హక్కుల సాధనకు ప్రజాసమీకరణకు బదులు అధికార యంత్రాంగంపై ఆధారపడే స్థితికి మారింది. దాంతో దానిపై భ్రమలు తొలగిపోడానికి ప్రజ లకు అట్టే కాలం పట్టలేదు. తొలి దశాబ్దంన్నర కాలంలో ప్రభుత్వం అమలు జరిగిన పలు విధానాలు, అభివృద్ధి వ్యూహాల పర్యవసానంగా పాలక సంకీర్ణంలోని వర్గ పొందికలో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి.
నెహ్రూ రూపొందించినఅభివృద్ధి వ్యూహం ప్రధానంగా ప్రభుత్వ పెట్టుబడి, దాన్ని వినియో గించేందుకు తెరమీదకు వచ్చిన ప్రణాళిక వ్యవస్థలపై ఆధారపడి ఉంది. స్వాతంత్య్రా నంతరం తక్షణమే రూపొందించిన ఈ అభివృద్ధి నమూనాలో, అభివృద్ధి ఫలాల్లో అందరికీ భాగ స్వామ్యం ఉండాలన్న లక్ష్యం ఎంతో కొంత ఉండేది. తొలుత నెహ్రూ తన అభివృద్ధి నమూనా చుట్టూ కాంగ్రెస్‌లోని భిన్న వర్గాలను సమీకరించ గలిగారు. ఈ అభివృద్ధి వ్యూహం మేరకు వేగ వంతమైన పారిశ్రామిక విధానానికి సమాంత రంగా గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ సంస్కరణలూ అమలు జరగాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించిన ధనిక రైతాంగం, దానికి నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నేతృత్వం ఈ వ్యవసాయ సంస్కరణలకు మోకాలడ్డింది. దాంతో 60 దశకం తర్వాత దేశవ్యాప్తంగా వ్యవసాయ సంస్కరణలకూ, దానికి పర్యాయపదంగా నిలిచిన భూసంస్కరణల చట్టాలకూ కాంగ్రెస్ నాయకత్వం తూట్లు పొడిచింది. ఈ సమయం లోనే నెహ్రూ అస్తమించారు. కాంగ్రెస్ నాయ కత్వం క్రమంగా తిరోగామి వాదుల చేతుల్లోకి మారింది. దాంతో పాటే అప్పటి వరకూ అమల్లో ఉన్న కేంద్ర రాష్ట్ర సంబంధాల్లోనూ, కాంగ్రెస్‌లోనే జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మధ్య ఉండే సంబంధాల్లోనూ సమతౌల్యత దెబ్బతిన్నది. నెహ్రూ హయాంలో ప్రధాన దృష్టి జాతీయ రాజకీయాలపై ఉండటంతో రాష్ట్ర స్థాయి నాయకత్వానికి రాష్ట్ర స్థాయి అవసరాల నేపథ్యంలో రాజకీయ విధి విధానాలు రూపొందించటంలో అవసరమై నంత స్వేఛ్చ, స్వతంత్రత ఉండేవి. నెహ్రూ తర్వాత పార్టీ పగ్గాలు, ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ఇందిరా గాంధీ హయాంలో ఈ స్వేచ్చ కరువైంది. జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయి లోనూ కాంగ్రెస్ నాయకత్వం అస్థిత్వాన్ని కోల్పోయి ఇందిరా గాంధీ భజన బృందంగా మారింది. జాతీయ రాజకీయాల్లో విధాన పరమైన చర్చల స్థానంలో వ్యక్తి కేంద్రంగా చర్చలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌లో అంతర్గత సుస్థిరతే దేశానికి సుస్థిరత అన్న నినాదం ముందు కొచ్చింది. ఈ మార్పు ఒక్క పార్టీ నిర్మాణానికే పరిమితం కాలేదు. దేశం అనుసరించాల్సిన ఆర్థికాభివృద్ధి విధానం పెద్దఎత్తున ఒడిదుడు కులకు లోనైంది. అధికారంపై పట్టు కాపాడు కునేందుకు సామాజిక న్యాయం ప్రాతిపదికన అప్పటి వరకూ అనుసరిస్తూ వచ్చిన విధానాల స్థానంలో ఎకామడేటివ్ విధానాలు తెరమీదకు వచ్చాయి. పారిశ్రామికాభివృద్ధిలో రెండో పంచవర్ష ప్రణాళిక చూపించిన మార్గంనుండి ప్రభుత్వం వైదొలగింది. వ్యవసాయ సంస్కర ణల్లో భూసంస్కరణలకు పెద్ద పీట వేయటం ద్వారా గ్రామీణ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తగ్గించటం, పారిశ్రామికాభివృద్ధికి అవసరమైన రిజర్వు వనరులు సృష్టించటానికి బదులు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా వ్యవసాయ ' ఉత్పాదకత' పెంచటం ప్రభుత్వ లక్ష్యంగా మారింది. సమగ్రాభివృధ్ధి లక్ష్యంగా కాక నిర్దిష్ట ఓటుబ్యాంకులను సంఘటితం చేసుకోవటం ఆర్థిక విధానాల లక్ష్యంగా మారింది. ఈ ఓటుబ్యాంకు ఆధారంగా అధికా రానికి వచ్చిన కాంగ్రెస్ ఇందిరాగాంధీ నేతృ త్వంలో ప్రజాస్వామ్యం ఖూనీకి పాల్పడింది. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగం కనీస హామీ ఇచ్చిన ప్రజాస్వామ్యభారతాన్ని పరిరక్షించుకునేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ ఉద్యమం అవసర మైంది.
స్వాతంత్య్రానంతరం
బెంగాల్ రాజకీయ చిత్రం
దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పుల లాగానే బెంగాల్‌లో కూడా వ్యవసాయరంగంలో వర్గాల ఏర్పాటు, సంఘ టితం కావటం భూసంస్కరణలతో పూర్తి అయ్యి ంది. మిగిలిన రాష్ట్రాల మాదిరిగా ఆధిపత్య కులం గానీ, ఆధిపత్య కులాల చేతుల్లో భూ కేంద్రీకరణ గానీ బెంగాల్‌లో లేవు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా వైవిధ్యభరితమైన భూ సంబం ధాలు, వర్గ సంకీర్ణాలు తెరమీదకు వచ్చాయి. ఆధిపత్య కులం కేంద్రంగా సామాజిక సమీకర ణాలు లేకపోవటంతో రాజకీయ పార్టీలు వర్గం ప్రాతిపదికన ప్రజలను సమీకరించటానికి మార్గం సుగమమం అయ్యింది. స్వాతంత్య్రపోరాట కాలంలో కూడా విప్లవ భావాలకు బలమైన పునాదులు కలిగిన బెంగాల్ స్వాతంత్య్రా నంత రం ఆ ప్రత్యేకతను నిలుపుకొంది. బలమైన వామపక్ష ఉద్యమానికి కేంద్రంగా మారింది. స్వాతంత్య్రానంతరం దేశ విభజన నేపథ్యంలో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన మౌలిక వనరులు, విశాలమైన భూభాగం నాటి తూర్పు పాకిస్తాన్ వశం కావటం, దేశ విభజన నేపథ్యంలో బెంగాల్‌కు నిర్వాసితుల ముప్పు ఎదురవటానికి కారణం కాంగ్రెస్ అనుసరించిన విధానాలే అన్న అభిప్రాయంతో బెంగాల్‌లోని విద్యాధికులు కాంగ్రెస్‌కు దూరమయ్యారు. జమీందారీ రద్దు వంటి చర్యలతో రైతాంగం లబ్ది పొందినా పైన పేర్కొన్న చారిత్రక కారణాల వల్ల బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ వేళ్లూనుకునేందుకు పరిమిత అవకాశాలే వచ్చాయి. మిగిలిన రాష్ట్రాల్లో లాగా స్వాతంత్య్రానికి ముందు బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలోనూ ప్రభుత్వంలో చలామణి కాలేదు. ఇన్ని పరిమితులు ఉన్నప్పటికీ స్వాతం త్య్రానంతరం తొలి దశాబ్దంన్నర కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న సానుకూల పవనాల నేపథ్యం లో బెంగాల్‌లో సైతం కాంగ్రెస్ పార్టీ అధికా రానికి రాగలిగింది.
1960ల నాటి నుండీ రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. ఇందిరా గాంధీ నేతృత్వంలో ఈ పతనం సంపూర్ణమైంది. అధికారాన్నీ, పార్టీపై పెత్తనాన్నీ కాపాడు కోవటానికి ఇందిరా గాంధీ ప్రజాస్వామిక పద్ధతులను గాక నిరంకుశ, ప్రజాస్వామ్య విరుద్ధ పద్ధతులు అవలంబించటంతో అప్పుడే ఆవిర్భ విస్తున్న మేధావి వర్గం కాంగ్రెస్‌కు దూరమైంది. నిర్మాణ పరంగా చూసుకుంటే బిసి రారు, అతుల్యఘోష్ వంటి వారు బెంగాల్ పిసిసికి నాయకత్వం వహించినపుడు వారి స్వతంత్ర పని విధానానికి నెహ్రూ ఇచ్చినంత అవకాశం ఇందిరా గాంధీ ఇవ్వలేదు. దానికి తోడు బలమైన స్థానిక నాయకత్వానికి వ్యతిరేకంగా మరో గ్రూపును తయారు చేయటం, దాన్ని ప్రోత్సహించటం ద్వారా రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వం ముఠాకుమ్ములాటల్లో మునిగి తేలేలా చేయటం, అదను చూసుకుని నమ్మిన బంట్లను పార్టీ అధ్యక్షులు చేయటం అన్న ఇందిరా గాంధీ విధానం రాష్ట్ర కాంగ్రెస్‌లో మరింత కుమ్ములాటలకు దారి తీసింది. వెరసి రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ వైఫల్యంతో 1967 నాటికి రాజకీయ శూన్యం ఏర్పడింది. జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన చీలికతో అప్పుడే తెరమీదకు వచ్చిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పూర్తిస్థాయిలో ఈ శూన్యాన్ని పూరించేందుకు సిద్ధమయ్యే పరిస్థితి లేకపో యింది. రాష్ట్ర రాజకీయ రంగంలో సిపిఐ(ఎం) తిరుగులేని శక్తిగా అవతరించటానికి, కాంగ్రెస్ వైఫల్యంతో ఏర్పడిన శూన్యాన్ని పూరించి రాజకీయ అస్థిరత స్థానంలో సుస్థిరత సాధించ టానికి రాష్ట్రానికి దాదాపు దశాబ్దకాలంపైగా సమయం పట్టింది. ఈ దశాబ్దకాలంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రజాదరణ కోల్పోవటం, కాంగ్రెస్‌లో చీలికలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేశాయి.
దశాబ్దకాలపు అస్థిరత
1960 దశకం నాటికి కాంగ్రెస్ దేశవ్యా ప్తంగా ప్రతికూల పవనాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నెహ్రూ ప్రారంభించిన అభివృద్ధి విధానాల నుండి వైదొలగటం, ఆర్థిక సంక్షోభం, ఆహార సంక్షోభం, కాంగ్రెస్ సంస్థాగత కారణాలు, చైనా-భారత్ యుద్ధం ఈ ప్రతికూల పవనాల వేగాన్ని పెంచాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తుల వైపు నడవటం ప్రారంభమైంది. తమిళనాడులో డిఎంకె, కేరళలో సిపిఐ(ఎం) ఈ దిశగా దేశానికి దారి చూపాయి. పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్ పతనం మిగిలిన చోట్ల కంటే మరింత వేగంగా జరిగింది. బెంగాల్ కాంగ్రెస్‌లో తొలితరం నేతలు అంతరించిన తర్వాత వారి స్థానాన్ని పూరించే స్థాయికి ఏ నేతా ఎదగలేదు. బిసి రారు, అతుల్య ఘోష్ వంటి నేతలు పార్టీకి రాష్ట్ర వ్యాప్తి యంత్రాంగాన్ని రూపొందించటంలో కీలక పాత్ర పోషించారు. 1962లో బిసి రారు మరణం తర్వాత బెంగాల్ కాంగ్రెస్‌లో ముఠా కుమ్ములాటలు పెచ్చరిల్లాయి. జాతీయ స్థాయిలో 1967లో కాంగ్రెస్ ఓటమి చవిచూస్తే బెంగాల్ లో అంతకు ఐదేళ్ల పూర్వమే కాంగ్రెస్ చీలిపోయి బలహీనపడింది. ఓటమి పాలయ్యింది. తద్వా రా రాజకీయ అస్థిరతకు లోనైంది బెంగాల్.
1968-1971 మధ్య కాలంలో రాష్ట్రంలో ఏర్పడిన రెండు సంకీర్ణ ప్రభుత్వాలూ ప్రధానంగా వర్గ సంకీర్ణాలు. ఒకవైపున బూర్జువా, భూస్వామ్య వర్గానికి ప్రాతినిధ్యం వహించే పార్టీలూ మరోవైపున ఈ శక్తులను వ్యతిరేకించే వామపక్ష పార్టీలు సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వాములు కావటంతో వాటి మధ్య సమన్వ యం కొరవడటం, వర్గ సామరస్యం లోపించటం సహజమైంది. అయితే ఈ సమన్వయ లోపానికి వర్గ దృక్ఫధంతో కూడిన విధానాలు అనుసరిం చాలని వామపక్షాలు నిర్ణయించటం కారణం. ఈ విధానాలతో వామపక్షాలు ప్రజలకు మరింత దగ్గరయ్యాయి. 71 ఎన్నికలకు ముందు వామపక్షాలు మూడింట ఒకవంతు ఓట్లు సాధిం చేవని పైన చెప్పుకొన్నాము. అప్పట్లో వామ పక్షాల ప్రజాకర్షణ శక్తికి ఏర్పడ్డ పరిమితులను ఈ రెండు సంకీర్ణ ప్రభుత్వ ప్రయోగాల ద్వారా వదిలించుకో గలిగాయి. రాష్ట్రంలో వర్గ సమీక రణాలు మారి, శ్రమజీవులందరూ ఒక పక్షం గానూ, దోపిడీ దారులందరూ మరో పక్షంగానూ చీలిపోయిన వాతావరణం నెలకొంది. సంకీర్ణం లోని భాగస్వాములు తమ బలాన్ని పెంచుకు నేందుకు ఒకరిని మించి ఒకరు ఎత్తులు వేసుకు న్నారు. ప్రజా ప్రయోజనం, శ్రామికవర్గ ప్రయో జనం, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ, రాజ్యాంగం హామీ ఇచ్చిన కనీసహక్కులు ప్రజ లకు అందుబాటులోకి తేవటమే లక్ష్యంగా ఎంచుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) అందుకనుగుణంగా ప్రజాసమీకరణ, తద్వారా వర్గ శక్తుల పొందికలో మార్పు సాధనే లక్ష్యంగా ఈ కాలంలో పోరాటాలు చేేసింది. ఈ కాలంలో జరిగిన పారిశ్రామిక ఆందోళనల్లోనే జ్యోతిబసు లయన్ ఆఫ్ ది సమ్మర్ (మండువేస విలో గర్జించే సింహంగా) పేరుపొందాడు. ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా పార్టీ అక్కడ ప్రత్యక్షమయ్యే స్థితికి పార్టీ సభ్యులు, శ్రేయోభి లాషుల పునాది విస్తరించింది. ఈ కాలంలోనే సిపిఐ(ఎం) భారతదేశంలో విప్లవానికి కార్మిక, కర్షక మైత్రి పునాది అన్న పార్టీ కార్యక్రమ సారాంశాన్ని ఆచరణలో పెట్టింది.
ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉన్న సిపిఐ(ఎం) ప్రధాన ప్రతిపక్షంగా ఎది గింది. ప్రజలముందు రాజకీయ ఆర్థిక ప్రత్యా మ్యాయాన్ని ఉంచింది. 77కు ముందు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వామపక్ష పార్టీలు మూడింట ఒకవంతు ఓట్లు సంపాదించుకుని కీలకమైన శక్తిగా ఉన్నాయి. ప్రజాందోళనల ద్వారా వామ పక్షాలు, ప్రత్యేకించి సిపిఐ(ఎం) ప్రజలకు మరింత దగ్గరైంది. ఈ కాలంలో రాష్ట్రంలో అస్థిరతతో పాటు అణచివేత కూడా కాంగ్రెస్ చేతిలో కీలక సాధనంగా మారింది. స్వేఛ్చా పిపాసులైన బెంగాల్ ప్రజలు ఈ అణచివేతను తీవ్రంగా వ్యతిరేకించారు. తొలిసారి రాష్ట్రంలో 1967లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) వివిధ వర్గాల ప్రజలకు చేరువయ్యేందుకు వీలుగా హౌం శాఖతో పాటు వ్యవసాయ శాఖ, కార్మికశాఖ వంటి మంత్రిత్వ శాఖలు చేపట్టింది. ఈ కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి శాంతి భద్రతల సమస్యను రెండు రకాలుగా విభజి చింది. ఒకటి వర్గపోరాటాలు, రెండోది వ్యక్తిగత విషయాలు, చట్టాల ఉల్లంఘన, దోపిడీలు, అరాచకత్వానికి సంబంధించిన శాంతిభద్రతల సమస్య. జ్యోతిబసు నేతృత్వంలోని హౌంశాఖ శాంతిభద్రతల సమస్యలపై తీవ్రంగా స్పందిం చేది. కాని వర్గపోరాటాల విషయంలో జోక్యం చేక్యానికి పరిమితులు విధించింది. తద్వారా రాజ్యాంగ యంత్రం వర్గ పోరాటాల విషయంలో తాటస్థ్యం ప్రదర్శించేలా చేయగలిగింది సిపిఐ(ఎం) నేతృత్వంలోని ప్రజాతంత్ర ఉద్య మం. బహుశా ప్రపంచంలోనే ఇది వామపక్షా లకు కొత్త అనుభవం. జాతీయ స్థాయిలో రాజ్యాంగ యంత్రం వర్గ ఉద్యమాల పట్ల అణచివేత వైఖరి అనుసరిస్తూ ఉండగా ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రం రాజ్యాంగ యంత్రం వర్గ పోరాటాల పట్ల తటస్థ ధోరణి అనుసరించేలా చేయగలగటం ఆ ప్రాంత వామపక్ష ఉద్యమం సాధించిన ప్రత్యేక విజయంగా చెప్పుకోవాలి.
బెంగాల్‌లో వర్గ పోరాటాలను రాజ్యాంగ యంత్రం జోక్యం పరిధి నుండి మినహాయిం చంటం ద్వారా పాలనా వ్యవస్థలో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేయటానికి ప్రజా ఉద్యమాలను సిపిఐ(ఎం) సాధనంగా మల్చుకొంది. ఈ విధమైన ఎత్తుగడ ప్రజలకు తక్షణ ప్రయోజ నాలూ, ఉద్యమానికి ఫలితాలూ చూపించటంతో మరింత మంది ప్రజానీకం ఉద్యమంలోకి ప్రవేశించేలా ప్రోత్సహిచింది. అదేసమయంలో ప్రజా ఉద్యమం స్థానికంగా పాలనా యంత్రాం గం పాత్ర కూడా పోషిస్తూ ముందుకు సాగింది. వర్ధమాన దేశంలో నిర్దిష్ట ప్రాంతంలో రాజ్యాంగ యంత్రాన్ని బలహీనం చేసి ప్రజా ఉద్యమం ఆ స్థానం ఆక్రమించుకోవటం అన్నది బెంగాల్ ప్రయోగంలోనే సాధ్యమైంది. దానికి ముందు తెలంగాణా సాయుధ పోరాట కాలంలో పరిమిత ప్రాంతంలో ఈ ప్రయోగాన్ని అమలు చేసింది కమ్యూనిస్టు పార్టీ.
ఈలోగా 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధం, బంగ్లాదేశ్ ఆవిర్భావంతో జాతీయస్థా యిలో వెల్లువెత్తిన ప్రజాదరణతో కాంగ్రెస్ ఇందిరా గాంధీ నేతృత్వంలో తిరిగి అధికారానికి వచ్చింది. బ్యాంకుల జాతీయీకరణ, రాజభర ణాల రద్దు వంటి చ్యలతో పాటు 71లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధం, దాని నేపథ్యం, సిద్ధించిన విజయం కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అస్థిరతను ఒక కొలిక్కి తెచ్చింది. ఇందిరా గాంధీ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని నేతగా మారారు. నెహ్రూ మరణం తర్వాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు ఆ విధమైన ఆదరణ లభ్యం కావటం ఇదే మొదటి సారి కావటంతో ఇందిరా గాంధీ కోటరీకి కన్ను మిన్నూ గానని పరిస్థితి ఏర్పడింది. 71లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రత్యేకించి బెంగాల్‌లో ప్రజాస్వామిక విలువలకు పాతర వేశారు. చివరకు ఎన్నికల్లో పాలకపార్టీ అనుసరించిన అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా జ్యోతిబసు సైతం ఎంఎల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీర్ఘకాలంగా బెంగాల్‌లో వామపక్షాల ఎదుగుదలను అడ్డుకో వాలని కాంగ్రెస్ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావటం, జాతీయ స్థాయిలో పెరిగిన ప్రజాదరణ దన్నుతో వచ్చిన అధికారాన్ని సక్రమంగా ప్రజోపయోగ చర్యలకు వినియో గించటానికి బదులు బంధుపీతికి, అధికార దుర్వినియోగానికి, రాజకీయ నిరంకుశత్వానికి, ప్రతిపక్షాల ఏరివేతకు కాంగ్రెస్ ఉపయోగించు కొంది. ఈ దుర్బుద్ధి మరింత విస్తరించి చివరకు దేశాన్ని అత్యవసర పరిస్థితి వైపు నెట్టింది. ఈ కాలంలో సుస్థిరమైన సంకీర్ణం ఏర్పడేందుకు అవకాశం లేకపోయింది. పాలనా యంత్రాంగం రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన సామాజిక ఆర్థిక అంశాలపై దృష్టి కేంద్రీకరించే సామర్ధ్యాన్ని కోల్పోయింది.
వర్గపోరాటాలు
రాజకీయ అస్థిరతతో, పాలనా యంత్రాం గం వైఫల్యంతో కకావికలైన బెంగాల్‌లో వర్గపోరాటాలు పుంజుకున్నాయి. సంకీర్ణ ప్రభు త్వాల నేతృత్వంలో అమలు జరిగిన భూ సంస్కరణల ఫలాలు పరిరక్షించుకునే క్రమంలో రాష్ట్రంలో ప్రతి గ్రామం వర్గపోరాట వేదికగా మారింది. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాలను రద్దు చేసిన ప్రతిసారీ కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టింది. రాష్ట్రంలో జరుగుతున్న పోరాటం అప్పటి వరకు సాధించిన విజయాలను సంఘటితంచేసుకోవ టానికే అన్న విషయాన్ని అర్థం చేసుకోలేని పార్టీలోని కొన్ని శక్తులు నక్సల్‌బరీ ప్రాంతంలో పార్టీని ధిక్కరించి సాయుధ చర్యలకు పాల్పడటం తో నక్సలైట్ ఉద్యమం ఆవిర్భవించింది. రాష్ట్రం లో అస్థిరతను మరింత పెంచి పోషించటంలో నక్సలైట్ ఉద్యమం తనవంతు పాత్ర పోషిం చింది. పైగా ఈ ఉద్యమం ప్రారంభం అయిన కొద్దికాలానికే సిపిఐ(ఎం)ను తన ప్రధాన శతృవుగా ఎంచుకొంది. నేడు ఒరిస్సా, బీహార్, జార్ఖండ్ సరిహద్దు ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని మావోయిస్టులు బెంగాల్‌లో కార్యక్రమా లు నెరపినట్లే నాడు నక్సలైట్లు భౌగోళిక వెసులు బాటును ఆసరాగా తీసుకున్నారు. దేశవ్యాపి తంగా అత్యవసర పరిస్థితి కింద ప్రజల హక్కు లు నలిగిపోతుంటే నక్సలైట్లు బెంగాల్‌లో కాంగ్రెస్‌తో కలిసి వామపక్షాలు ప్రత్యేకించి సిపిఐ(ఎం) కార్యకర్తలను ఊచకోత కోయటం ప్రారంభించింది. ఈ పరిణామమే ఆధునిక బెంగాల్‌లో అర్థఫాసిస్టు పాలనగా రికార్డుల కక్కింది. ఈ కాలంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బెంగాల్‌ను దారిలోకి తెచ్చుకునేం దుకు అనేక చర్యలు చేపట్టింది. అందులో రెండు ముఖ్యమైన పరిపాలనాపరమైన మార్పులు న్నాయి. ఒకటి ప్రభుత్వం అనుసరించే అణచి వేత విధానం రాజ్యాంగపరిమితులకు బయట ఉంటుందని ప్రకటించటం. ఇందులో భాగంగా పోలీసులు ఏ పరిస్థితుల్లో కాల్పులకు పాల్పడినా దానిపై న్యాయవిచారణ ఉండదని ప్రకటించ టంతో ఉద్యమాలపై పోలీసులు విరుచుకుపడ టానికి తెర తీసినట్లైంది. రెండోంది గూఢచారి విభాగానికి నక్సలైట్ సమస్య పరిష్కార బాధ్యతలు అప్పగించటం. కేంద్రం నక్సలైట్ అన్న పదానికి ఇచ్చిన నిర్వచనం చాలా విస్తృత మైనది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ స్రవంతిలో పని చేస్తున్న వామపక్షాలు, సిపిఎం కార్యకర్తలకు కూడా వర్తించే విధంగా మార్చి వీరందరినీ ఏరివేసే బాధ్యత గూఢచర్య విభాగానికి అప్ప గించారు. ఈ విధంగా పోలీసులకు అదుపు లేని అణచివేత అధికారాలు ఇవ్వటం, నేరస్తులు, రాజకీయ నేరస్తుల మధ్య గీతను చెరిపేయటం ద్వారా అర్థఫాసిస్టు పాలనకు తెరతీసింది ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభు త్వం. ఈ కర్తవ్యాన్ని తన భుజస్కంధాలపై వేసు కున్న వ్యక్తి సిద్ధార్థ శంకర్ రే.
ఈ కాలంలో జరిగిన మారణహౌమం గురించి తెల్సుకునేందుకు మచ్చుకు రెండు ఉదాహరణలు ప్రస్తావించుకుంటే సరిపోతుంది. 1972లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దఎత్తున రిగ్గింగు, అక్రమాలకు పాల్పడి విజ యం సాధించిందని అప్పట్లో టైమ్స్ ఆఫ్ ఇండియా కలకత్తా విలేకరిగా ఉన్న సజల్ బసు విపులంగా రాశారు. ఎన్నికలకు ముందు, తర్వాత కిరాయి గూండాలతో మారణహౌమం సృష్టించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులను హతమార్చిన తీరునుకూడా టైమ్స్‌ఆఫ్ ఇండియా సవివరంగా చిత్రీకరిం చింది. సజల్ బసు మాటల్లో అరవయ్యో దశకం చివర్లో రాష్ట్రం చవిచూసిన హింస కంటే ఈ కాలంలో చవిచూసిన హింస మోతాదులోనూ, భీభత్సంలోనూ అధికంగా ఉందని అభిప్రాయ పడింది. శంకర్ ఘోష్ అనే రచయిత చేపట్టిన అధ్యయనంలో ఈ కాలంలో ఒక్క భీర్‌భూం జిల్లాలోనే కనీసం రోజుకు మూడునాలుగు రాజకీయ హత్యలుజరిగాయని నిర్ధారించారు. 1971 జూన్‌లో రాష్ట్రపతి పాలన విధించిన కొద్ది నెలల్లోనే కాశీపూర్-బారానగర్ ప్రాంతం లో నక్సలైట్లన్న నెపంతో 150మంది యువకులను పోలీసులు ఊచకోత కోశారు. ఘోష్ అప్పట్లో హిందూస్థాన్ స్టాండర్డ్ పత్రిక ప్రతినిధిగా ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. పట్టపగలే ఈ ప్రాంతంలో శవాలు, చేతులు, కాళ్లు తెగిన మొండాలు చెల్లా చెదరుగా పడి ఉన్నాయని రాశారు. ఈ శవాలను, మొండేలను పోగుచేసి పట్టపగలే అందరూ చూస్తుండగా రిక్షాల్లో తీసుకెళ్లి హుగ్లీ నదిలో విసిరేశారని తెలిపాడు. ఘోష్ మాటల్లోనే, ''ఈ కాలంలో రాష్ట్రంలో భయో త్పాతం తారాస్థాయికి చేరింది. రాత్రుళ్లు యువకులైన వారెవ్వరూ ఇళ్లల్లో ఉండే పరిస్థితి లేకపోయింది. పోలీసు లాకప్‌కు వెళ్లని నడివయస్కులు లేరంటే ఆశ్చర్యం లేదు.'' ఇదీ, ఇందిరాగాంధీ కనుసన్నల్లో బెంగాల్‌లో ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేసిన తీరు. ఈ రకమైన హత్యా కాండతో పాటు 60 దశకం చివర్లో సిపిఐ (ఎం) ఆధర్యంలో జరిగిన భూసంస్కరణలను కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్రపతిపాలన తిరగ దోడటం ప్రారంభించింది. దాంతో పాటు బెంగాల్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత నేప థ్యంలో పెద్దఎత్తున పెట్టుబడులు వలస పోయా యి. పారిశ్రామిక రంగం కుదేలైంది. ఈ కాలంలో మొత్తంగా ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగమే పక్షవాతం సోకిన మాదిరిగా మారిపోయింది.
బెంగాల్‌లో సుస్థిరత సాధించిన వామపక్ష ప్రభుత్వం
ఈ నిర్భంధాన్ని వ్యతిరేకించి ప్రజాతంత్ర ఉద్యమానికి ఊపిరిలూదింది సిపిఐ(ఎం). కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజాస్వామిక వ్యవస్థ ఖూనీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ప్రజాతంత్ర శక్తులను సమీకరించి ప్రజాస్వామ్య పరిరక్షణా ఉద్యమాన్ని నిర్మించింది భారత కమ్యూనిస్టుపార్టీ మార్క్సిస్టు. ఈ ఉద్యమాన్ని బెంగాల్ ప్రజలు ఆదరించారు. సమర్థించారు. మద్దతిచ్చారు. ఉద్యమంలో ప్రత్యక్ష భాగస్వాములయ్యారు. ప్రత్యేకించి 1971-77 మధ్యకాలంలో భూమిహక్కు కోల్పోయిన పేద, మధ్యతరగతి రైతులందరూ ప్రజాస్వామిక పరిరక్షణపోరాటానికి బాసటగా నిలిచారు. దీనికి తోడు 1971 పూర్వం ఐక్య సంఘటన ప్రభుత్వాల్లో వచ్చిన అనుభవాల ఆధారంగా సిపిఎం తన నిర్మాణాన్ని పటిష్టం చేసుకొంది. ఏ వర్గాల్లో పార్టీ విస్తరణ బల హీనంగా ఉందో ఆయా వర్గాలను పార్టీ పరిధి లోకి తెచ్చుకోవటానికి ప్రత్యేక కృషి జరి గింది. ఈ కాలంలో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ నిర్మాణాన్ని పటిష్టపర్చు కునేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు జరిగాయి. తద్వారా యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో పాల్గొనటం ద్వారా తాను చేపట్టిన ప్రజానుకూల విధానాల ద్వారా ప్రభావితులైన వర్గాలను నిర్మాణంలో సంఘటితం చేసుకోవటానికి పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అప్రదిష్ట పాలుగావటం, దేశవ్యాప్తంగా జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో సిపిఐ(ఎం) నిర్వహించిన పాత్ర పార్టీ విశిష్టత పెరగటానికి దోహదం చేసింది. వెరసి 1977 ఎన్నికల్లో 35.8 శాతం ఓట్లతో సిపిఐ(ఎం) రాష్ట్ర రాజకీ యాల్లో ఏకైక బలమైన శక్తిగా అవతరించింది. మిగిలిన వామపక్షా లకువచ్చిన ఓట్లు శాతాన్ని పరిగణనలోకి తీసుకొంటే పోలైన ఓట్లలో 50 శాతం పైగా ఓట్లు సాధించేశక్తి సంపాదించింది వామపక్ష సంఘటన. స్వతంత్ర భారతదేశంలో మెజారిటీ ఓట్లతో ప్రభుత్వం ఏర్పడటం ఇదే ప్రథమం. నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన ప్రభు త్వాలకు కూడా సీట్లు ఎక్కువ వస్తేవచ్చాయి గానీ ఓట్లు 40 శాతానికి మించి దక్కలేదు. ఈ రకంగా బెంగాల్ వామపక్ష సంఘటన ప్రభు త్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో విలక్షణ మైన రికార్డు సృష్టించింది. తద్వారా రాష్ట్రంలో మూడు దశాబ్దాల పాటు కనిపించని రాజకీయ సుస్థి రతకు వామపక్ష సంఘటన పాలన తెరతీ సింది. ప్రజాస్వామిక రాజ్యాంగం పరిధిలో ప్రత్యా మ్నాయ ప్రభుత్వాలు మనుడగ సాగించ వచ్చని ఈ ప్రయోగం రుజువు చేసింది.
77 ఎన్నికల తర్వాత పరిపాలనా వ్యవస్థ ను పట్టాల మీదకు తేవటం, రాజకీయహింసను కట్టడి చేయటం వామపక్ష ప్రభుత్వ తక్షణ ప్రాధా న్య తలుగా మారాయి. రాజకీయ సుస్థిరత, బూర్జువా ఆర్థిక వ్యవస్థ పరిధిలో ఆర్థికాభివృద్ధి, భూసంస్క రణల అమలు వామపక్ష సంఘటన ప్రభుత్వ పాలనా కర్తవ్యాలుగా మారాయి. మిగిలిన రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేసే వాగ్దానాల అమలు స్థాయి కంటే బెంగాల్‌లో వామపక్ష సంఘటన ప్రభుత్వం చేసిన వాగ్దానాల అమలు స్థాయి ఎక్కువగా ఉండటాన్ని అప్పట్లో రాజకీయ పరిశీలకులందరూ గుర్తించారు. శక్తివంతమైన పార్టీ యంత్రాంగం ఉండటంతో ప్రభుత్వ విధా నాల ఫలాల విషయంలో న్యాయబద్ధమైన లబ్ది దారుల ఎంపిక సాధ్యం అయ్యింది.
దీర్ఘకాలం అధికారంలో ఉండటంతో ఆర్థికంగా వెనకబడిన వర్గాల్లో ప్రభుత్వం పట్ల, పార్టీ పట్ల ఆశాభావం సహజంగానే ఎక్కువగా ఉంది. వీరి ఆకాంక్షలను చేరుకునేలా వ్యవహ రించే బాధ్యత ప్రభుత్వంపైనా, పార్టీపైనా పడింది. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక వనరులు బలహీనపడటంతో రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో వలె అత్యధిక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తి సామర్ధ్యాలు బలహీన పడ్డాయి. ప్రత్యేకించి దీర్ఘకాలంగా పెట్టుబడుల వలసను చవిచూసిన బెంగాల్‌లో ఈ సమస్య మరింత పెద్దదిగా కనిపించటం సహజం. ఉన్న పరిమితుల్లోనే వామపక్ష సంఘటన సాధిం చిన విజయాలు, అందిచిన సేవలను ప్రజలు విశ్వసించారు. ఆహ్వానించారు. ప్రముఖ రాజకీయశాస్త్ర నిపుణుడు అతుల్ కోహ్లి మాటల్లో ''మిగిలిన రాష్ట్రాల్లో పార్టీలు, ప్రభుత్వాలతో పోల్చి చూసినపుడు బెంగాల్‌లో సిపిఎం పార్టీ ప్రభుత్వం చేసే వాగ్దానాలు చిన్నవైనా సాధించిన విజయాలు పెద్దవి. ప్రత్యేకించి సామాజికంగా బలహీనవర్గాలకు వామపక్ష సంఘటన ప్రభుత్వం అందిచిన సేవలు ఏరాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ అందించలేదు. అందులో ముఖ్యమైనది భూమి పై హక్కు కల్పించటం. ఇది గ్రామీణ ప్రజల ఆదాయవనరులు పెంచింది. తద్వారా పార్టీ, ప్రభుత్వం, ప్రజల మధ్య విడదీయరాని సాన్ని హిత్యం ఏర్పడింది.'' అని వ్యాఖ్యానించటం గమనించాల్సిన విషయం.
ప్రజాతంత్ర వ్యవస్థలను మరింత వేళ్లూను కునేలా చేయటంలో బెంగాల్ దేశానికే ఆదర్శం గా నిలిచింది. మొదటిసారిగా మూడంచెల పంచాయితీరాజ్ వ్యవస్థను అమలు చేయటంతో పాటు పంచాయితీలకు అధికారాలు, ఆర్థిక వనరులు కూడా బదలాయించి ప్రజాతంత్ర ప్రజాస్వామిక వ్యవస్థను ఉనికిలోకి తెచ్చింది. ప్రభుత్వ ఫలాలు నేరుగా ప్రజలకు చేరేలా చేయటంలో సశక్తులైన ఈ పంచాయితీరాజ్ వ్యవస్థలు ముఖ్యమైన సాధనంగా పని చేశాయి. అదేసమయంలో గ్రామీణ ప్రాంతాల్లో సైతం రాజకీయ చైతన్యాన్ని, హక్కుల గురించి ప్రశ్నించ గలిగే ప్రజాతంత్ర చైతన్యాన్ని అందిచటంలో వామపక్ష సంఘటన అమలు జరిపిన పంచా యితీరాజ్ సంస్కరణలు కీలక పాత్ర పోషించా యి. అతుల్‌కోహ్లి మాటల్లోనే '' ఈ రకమైన పంచాయితీరాజ్ సంస్కరణల వల్ల కేంద్ర ప్రభు త్వం అమలు జరుపుతున్న అనేక సంక్షేమ పథ కాలు - ఉదాహరణకు పనికి ఆహార పథకం వంటివి -మిగిలిన రాష్ట్రాల్లో కంటే బెంగాల్‌లోనే సమర్థవంతంగా అమలు జరిగింది.''
సుస్థిరతకు సవాళ్లు
ఈ పరిస్థితుల్లో దేశాన్ని ఉప్పెనలా చుట్టు ముట్టిన ఆర్థికసంస్కరణల భావజాలం ఇటువంటి ప్రత్యామ్నాయ అభివృద్ధి విధానాలను అవలం బించే ప్రభుత్వాలకు మరింత కష్టకాలం తెచ్చి పెట్టాయి. దశాబ్దంన్నర కాలంగా అమలు జరు పుతూ వచ్చిన సంపద పున:పంపిణీ విధానాలను కొనసాగించటం క్లిష్టంగా మారింది. సంస్కరణ లతో దేశవ్యాప్తంగా ప్రభుత్వయంత్రాంగానికి ఉన్న పరిమిత ప్రజాతంత్ర స్వభావాన్ని కోల్పో సాగింది.
దీనికి తోడు బెంగాల్ రాజకీయాల్లో లంపెన్ వర్గం క్రియాశీల పాత్ర పోషించటానికి మరో ముఖ్య కారణం ఉంది. అది కాంగ్రెస్ వైఫల్యం. ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ వైఫల్యం అత్యవసర పరిస్థితి కాలంలో ప్రారంభమై 90దశకం చివరి నాటికి తారాస్థాయికిచేరింది. తొలుత రాష్ట్రాల్లో ఈ వైఫల్యం వ్యక్తీకృతమైంది. క్రమంగా రాజీవ్ గాంధీ అనంతర కాలంలో ఈ వైఫల్యం అఖిల భారత స్థాయికి విస్తరిం చింది. ఈ స్థానాన్ని పూరించేందుకు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల శక్తులు తలెత్తాయి. మహారాష్ట్రలో మతోన్మాద శివసేన రాజకీయ రంగంలో ప్రధాన శక్తిగా అవతరించగా దక్షిణా ది రాష్ట్రాల్లో ప్రాంతీయబూర్జువా వర్గాలకు ప్రాతినిధ్యం వహించేపార్టీలు బలం పుంజకు న్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అస్థిత్వరాజకీయాలు కాంగ్రెస్ వైఫల్యంతో ప్రేరణ పెచ్చరిల్లాయి. ఈ కోవకు చెందిందే బెంగాల్‌లో తృణమూల్ విజృంభణ. రాష్ట్రంలోని లంపెన్ వర్గానికి ఒక వేదిక కావల్సిన తరుణంలో తెరమీదకువచ్చింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. దీర్ఘకాలంగా నిద్రాణంగా ఉన్న విఛ్చిన్నకర శక్తులకు తృణమూల్ వేదికగా మారింది. దాంతో ఇప్పటి వరకూ బెంగాల్‌లో కనిపించని అస్థిత్వ వాదాలు, తిరోగమన వాదాలు నేడుమనకు కనిపిస్తున్నాయి. ఈశక్తులు బెంగాల్ గత మూడున్నర దశాబ్దా లుగా సాధించిన రాజకీయ సుస్థిరతను, ప్రజా తంత్ర చైతన్యాన్ని, ఆర్థిక ఫలాలను ధ్వంసం చేయబూనుకుంటున్నాయి. వీటికి జాతీయస్థాయి లోని ప్రగతినిరోధక శక్తులు చేదోడువాదోడుగా నిలుస్తున్నాయి. ప్రజాతంత్ర ప్రయోగానికి, ప్రజా స్వామ్య పటిష్టీకరణకు నిదర్శనంగా నిలిచిన బెంగాల్‌లోని వామపక్ష సంఘటన పాలన నేడు ఈ సవాళ్లను అధిగమించి తన మహాప్రస్థానాన్ని ముందుకు నడిపించటానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాతంత్ర శక్తులు తమవంతు మద్దతు అందిం చాల్సిన సమయం ఆసన్నమైంది.

Subscribe to:
Posts (Atom)