Monday, November 2, 2009

స్టాక్‌ మార్కెట్ల పద్మవ్యూహం

* జాతీయ అంతర్జాతీయ గుత్త పెట్టుబడిదారులు, ద్రవ్య పెట్టుబడిదారులు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన విధానాలు అమలు చేయించుకోవటంలో స్టాక్‌ మార్కెట్‌ ఉత్తానపతనాలను ఒక వ్యూహాత్మక సాధనంగా మార్చుకుంటున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోబొతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను స్టాక్‌మార్కెట్‌ పరిధిలోకి (ఇప్పటికి రానివాటిని కూడా) తీసుకురావటానికి, ఇప్పటికే లిస్ట్‌ అయిన వాటి షేర్లు ఎక్కువగా అమ్మకానికి పెట్టటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది.

బి. గంగారావు, కె. వీరయ్య్త మార్క్సిస్టు oct Mon, 5 Oct 2009,

అమెరికా ద్రవ్య సంక్షోభంతో 10 వేల పాయిట్లకు కుప్పకూలిన సన్సెక్స్‌ : 2008

ట్రేడింగ్‌వేగం అందుకోలేక తాత్కాలికంగా బిఎస్‌ఇ మూత : మే 17, 2009

బడ్జెట్‌ రుచించని స్టాక్‌మార్కెట్‌ : 866 పాయింట్ల పతనం : 2009 జూలై

ఉపసంహరణపై హామీతో పుంజుకున్న స్టాక్‌ మార్కెట్‌ : 2009 జూలై

స్టాక్‌మార్కెట్‌ కదలికల గురించి పత్రికలు రాయని రోజు లేదు. ప్రత్యేకించి ఎన్నికలు ముగి సిన తర్వాత స్టాక్‌ మార్కెట్‌ పడిపోయినా, లేచినా ఒక్క కుదుపుతోనే జరుగుతోంది. ప్రభుత్వం, ఆర్ధికవేత్తలు, విధాన నిర్ధేశకులు అందరూ స్టాక్‌మార్కెట్‌ను ప్రసన్నం చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. ఇవన్నీ గమనిస్తే భారత ఆర్ధిక వ్యవస్థను ఆమాటకొస్తే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను స్టాక్‌ మార్కెట్టే నడిపిస్తోందా అన్న సందేహం రాకమానదు. పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థలో స్టాక్‌మార్కెట్‌ విడదీయరాని అంశంగా మారిం ది.

జాతీయ ఆర్ధిక వ్యవస్థనూ, ప్రభుత్వ విధాన నిర్ణయాలనూ ప్రభావితం చేసే కీలక సాధనంగా మారింది. మొన్న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌ అనంతరం జరిగిన చర్చలు ఇందుకు మంచి నిదర్శనం. బడ్జెట్‌లో వివిధరంగాలకు కేటాయిం చిన కేటాయింపుల విషయం కన్నా స్టాక్‌ మార్కెట్‌ను బడ్జెట్‌ నిరాశపరిచిందన్న విషయం పై గగ్గోలు పెరిగింది. ప్రభుత్వం స్టాక్‌ మార్కెట్లే సర్వస్వంగా, వాటి లాభాలే ధ్యేయం అడుగు లేస్తోంది.

స్టాక్‌మార్కెట్‌ ఆవిర్భావం

ఆధునిక పెట్టుబడిదారీ విధానం ఆవిర్భా వంతోనే స్టాక్‌ మార్కెట్ల ఆరంభం జరిగింది. 16వ శతాబ్ధంలోనే ఈస్టిండియా కంపెనీ తన వాణిజ్య కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రజల నుండి నిధులు సమీకరించింది. ప్లాసీ యుద్ధం తర్వాత ఇంగ్లీషు ఈస్టిండియా కంపెనీ షేరు ధర బాగా పెరిగినట్లు వలసవాదంపై పరిశో ధనలు సాగించిన ఆర్ధిక శాస్త్రవేత్తలు గుర్తిం చారు. 16, 17శతాబ్ధాలు యూరోపియన్‌ దేశాలు నిరంతర యుద్ధాల్లో మునిగి తేలుతూ ఆర్ధికంగా ఛిన్నాభిన్నమైన కాలం. ఈకాలంలోనే భూస్వామ్య వ్యవస్థ నుండి విముక్తి పొందిన పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందేందుకు, శాస్త్రవిజ్ఞానం ముందుకు తెచ్చిన ఆవిష్కరణలను వ్యక్తిగత వినియోగం స్థాయి నుండి పారిశ్రామిక వినియోగం స్థాయికి విస్తరించేందుకు అవసర మైన భారీ పెట్టుబడులు, ఆర్ధిక వనరులు సేకరించుకునే మార్గంగా స్టాక్‌ మార్కెట్‌, లిమిటెడ్‌ కంపెనీల భావనలు రూపుదిద్దుకున్నాయి.

భారతదేశంలో 1875లో మొదటిసారి బొంబాయి స్టాక్‌ ఎక్ఛేంజిని ప్రారంభించారు. నేటికీ ప్రపంచంలోని పురాతన ఎక్ఛేంజ్‌ల్లో బిఎస్‌ఇ ఒకటి. స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశం లో 7 ఎక్ఛేంజలు ఉన్నాయి. కానీ బిఎస్‌ఇ కి మాత్రం ప్రభుత్వం 1965లో మాత్రమే గుర్తింపు ఇచ్చింది. 1990 వరకు ఈ వ్యవహారాలను కేంద్రప్రభుత్వం ఆధీనంలోని కంట్రోలర్‌ ఆఫ్‌ కాపిటల్‌ ఇష్యూల్‌ (సిసిఐ-పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాల నియంత్రణాధికారి) పర్యవేక్షించేవాడు. స్వాతంత్య్రానంతరం ఉనికి లోకి వచ్చిన తొలితరం ప్రైవేటు కంపెనీల నేడు న్న స్థాయిలో నిలదొక్కుకోవటానికి కేంద్ర ప్రభుత్వాలు అనుసరించిన విధానాలు ఒక కారణం కాగా, సదరు కంపెనీల విస్తరణకు, పోటీలో నిలదొక్కుకోవటానికి అవసరమైన నిధుల సేకరణలో భారతీయ స్టాక్‌ మార్కెట్‌ ముఖ్యమైన పాత్రపోషించింది. ధీరుభాయి అంబానీ బట్టల దుకాణం నుండి బట్టల తయారీ మిల్లులు నిర్మించే స్థాయికి చేరటం వెనక పెట్టుబడి అంతా స్టాక్‌మార్కెట్‌ నుండి సేకరించిన పెట్టబడేనంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 1995 నాటికి దేశంలో స్టాక్‌ ఎక్ఛేంజిల సంఖ్య 23 కి పెరి గింది.

అందులో ప్రస్తుతం 19 మాత్రమే క్రియా శీలకంగా ఉన్నాయి. ఇవికాక అన్ని ప్రాంతాల్లో అనధికార ఎక్చేంజిలు పనిచేస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలను సెన్సెక్స్‌ సూచికతో కొలు స్తారు. ఈ సూచిక మొత్తం రిజిష్టర్‌ అయిన (లిస్ట్‌డ్‌) కంపెనీల్లో కేవలం 30 కంపెనీల షేర్ల విలువలో వచ్చే మార్పొలను మాత్రమే సూచిస్తుంది. మొత్తం లావాదేవీల్లో 80శాతం టాప్‌ 10 కంపెనీల షేర్లవే. టర్నోవరులో 98 శాతం మొత్తం 100 కంపెనీలషేర్లదే. మొత్తం మార్కెట్‌ లావాదేవీలను ఈ సూచిక ప్రతిఫ లించదు. అందువల్లనే సెన్సెక్స్‌ పడిపోయినా కొన్ని కంపెనీల షేరు విలువ పెరుగుతూనే ఉంటుంది.

స్టాక్‌మార్కెట్లో రెండు తరహాల వ్యాపారం జరుగుతుంది. మొదటిది ఐపిఒ (ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) రూపంలో జరుగుతుంది. అంటే ఫలానా వ్యక్తి, వ్యక్తులు ఒక కంపెనీ నమోదు చేయించుకుని దాని విస్తరణ గురించిన పథ కాలను ప్రజలముందుంచటం ద్వారా సదరు కంపెనీలో వాటాలు కొనుగోలు చేయటం ద్వారా నిధుల సమీకరణ చేయటం. ఉదాహరణకు రెండేళ్ల క్రితం రిలయన్స్‌ పవర్‌ (అదే కంపెనీనేడు అదాని పవర్‌-అనిల్‌ ధీరూబారు అంబాని పవర్‌ కంపెనీగా చెలామణి అవుతోంది) కంపెనీ ప్రారంభించి షేర్లు ద్వారా వేలకోట్లు సమీకరించింది. ఈ క్రమాన్ని ప్రాథమిక మార్కెట్‌ అంటారు. 1991 తర్వాత ప్రాథమిక మార్కెట్లో నిధుల సేకరణ తేలికైపోయింది. దాంతో 1991-1998 వరకు ఇటువంటి ప్రకటనలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. మధ్యతరగతి ఉద్యోగులు అనేకమంది షేర్లు కొన్నారు. కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారం గడిచిన పదిహేను సంవత్సరాల్లో ప్రాధమిక మార్కెట్లో నిధులు సేకరించిన మెజారిటీ కంపెనీలు బోర్డులు తిప్పే శాయి.

ఆర్ధిక వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణలు తగ్గుతున్న కొద్దీ స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు ఊపందుకొంటూ వచ్చాయి. స్టాక్‌మార్కెట్లో నమోదు అయిన కంపెనీల షేర్లను ఒక షేరు హోల్డరు మరోషేరు హోల్డరుకు అమ్ముకొంటాడు. దీన్ని సెకండరీ మార్కెట్‌ అంటారు.

స్పెక్యులేషన్‌ అడ్డాగా స్టాక్‌ మార్కెట్‌

గత సంవత్సరం ప్రాథమిక మార్కెట్‌ ద్వారా 124 ఇష్యూలు విడుదలయ్యాయి. రు. 87,029 కోట్ల పెట్టుబడి సమీకరించబడింది. వీటిలో కేవలం 61 కంపెనీల ఇష్యూలే రు. 84,418 కోట్లు స్వంతం చేసుకున్నాయి. రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్‌, ఇతర ద్రవ్య సంస్థలు రూ. 30,955 కోట్లు కైవసం చేసుకోగా, సిమెంట్‌, నిర్మాణరంగం రూ. 18,905 కోట్ల ను, విద్యుత్‌ కంపెనీలు రూ. 13,709 కోట్లను కైవసం చేసుకున్నాయి. గత దశాబ్ద కాలంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లో సెకండరీ మార్కెట్‌ రాజ్యమేలుతోంది. ఈ మార్కెట్‌ వల్ల కలిగే మరో నష్టమేమిటంటే ఇందులో సేకరించబడే నిధులు అదనపు ఉత్పాదక సామర్ధ్యాన్ని వ్యవస్థకు జోడించటం లేదు. ఉన్న కంపెనీల మధ్యనే గుత్తాధిపత్యం (ఓనర్షిప్‌ కన్సాలిడేషన్‌)కు సెకం డరీ మార్కెట్‌ వీలు కల్పిస్తోంది. ఈ రకమైన గుణాత్మక మార్పు ఉండబట్టే 1991 తర్వాత స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు ఊపందుకున్నాయి.

1993 లో సగటున రోజుకు రూ. 238 కోట్ల టర్నోవరు జరిగితే 2008 లో సగటు రోజువారీ టర్నోవరు రూ. 9,275 కోట్లకు చేరింది. ఇందు లో యాజమాన్యం చేతులుమారుతున్న షేర్ల పరిమాణం మాత్రం తక్కువే. రోజు మొత్తం లావాదేవీలు జరిగిన స్క్రీప్‌ సగటు విలువ 1995లో 8,022 రూపాయలు ఉంటే 2008 నాటికి ఈ విలువ రూ. 29,777 కు పెరిగింది. 2001-2002 లో మొత్తం 5,04,149 లక్షల షేర్లు లావాదేవీలు జరగ్గా, చేతులు మారినవి (డెలివరీ అయినవి) 1,22,917 లక్షల షేర్లు మాత్రమే. అంటే మొత్తం జరిగిన ట్రేడింగులో నాల్గోవంతు కంటే తక్కువ నిజమైన ట్రేడింగ్‌. మిగిలింది సెక్యులేటివ్‌ ట్రేడింగ్‌. 2007-08లో 24,67,606 లక్షల షేర్లు లావాదేవీలు జరగ్గా చేతులు మారింది 7,28,372 లక్షలు మాత్రమే. అంటే మొత్తం ట్రేడింగ్లో 29శాతం. సెక్యులేషన్‌ ఎంత ఎక్కువగా ఉంటే సంపద మార్పిడి అంత తక్కువగా ఉంటుంది.

సెక్యులేషన్‌ తీవ్రతను తెలిపే మరో సూచిక సెన్సెక్‌ బిఎస్‌ఇ. 2003 మార్చి 3 నుండి 2004 జూలై 22 మధ్య కాలంలో ఇది 3,727 పాయింట్ల నుండి 5, 054 పాయింట్లకు పెరిగింది. 2004 నవరబరు 17 నాటికి 6,017 పాయింట్లకు, 2005 జూన్‌ నాటికి 7,677 పాయింట్లకు, 2005 డిసెంబర్‌ 30కి అది 9,323 పాయింట్లకు పెరిగింది. 2006 తరువాత స్టాక్‌మార్కెట్‌ మరింత ఊపందుకుంది. 2007 జనవరికి 14,091 పాయిట్లుకు ఆ తరువాత 2008 జనవరి నాటికి అమాంతంగా 20,873 పాయింట్లకు ఎగబా కింది.

సరళీకరణతో పెరిగిన అనిశ్చితి తీవ్రత

సరళీకరణ విధానాలు, ప్రపంచీకరణ జాతీయ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో పలు నూతన మలుపులు తెచ్చాయి. అందులో భాగం గా స్టాక్‌ మార్కెట్లలో కూడా పెద్ద ఎత్తున మార్పు లు వచ్చాయి. 1970 దశకం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ద్రవ్య పెట్టుబడిదారీ విధానం పట్టు పెరిగింది. పెట్టుబడి చలనంపై ఆంక్షలు తొలగిపోవటంతో ద్రవ్యపెట్టుబడి చలనంపై కూడా నియంత్రణలు తగ్గిపోయాయి. దానికి తోడు స్టాక్‌మార్కెట్‌ సెంటిమెంటును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవటం ప్రారంభించటంతో ద్రవ్యపెట్టుబడి పరిస్థితి మరీ ఆడింది ఆటగా పాడింది పాటగా మారింది. అంతేకాదు సంస్కరణల వెన్నంటి వచ్చిన మరో కీలక పరిణామం ఆర్థిక వ్యవస్థలను ద్రవ్యీ కరించటం. (ఫైనాన్షియలైజేషన్‌ ఆఫ్‌ ఎకాన మీస్‌). దీనికి స్టాక్‌ మార్కెట్లు కీలక సాధనాలుగా మారాయి.

స్టాక్‌మార్కెట్లు జాతీయ ఆర్ధిక వ్యవస్థలను అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థలతో సమీకృతం చేసే సాధనాలుగా కూడా మారాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు, విదేశీ మ్యుచు వల్‌ ఫండ్లు దేశంలోకి రావడంతో పాటు మన దేశానికి చెందిన కంపెనీల షేర్లు విదేశీ స్టాక్‌ మార్కెట్లలో నమోదుకావటం, విదేశీ కంపెనీల షేర్లు మన దేశ స్టాక్‌ మార్కెట్లలో నమోదు కావటం వంటి మార్గాల ద్వారా అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను సమీకృతం చేస్తొంది. సంస్కరణల పర్యవసా నంగా మరో పరిణామం కూడా చోటు చేసు కొంది. సంస్కరణలకు ముందు స్టాక్‌ మార్కెట్ల ద్వారా జరిగే వనరుల సమీకరణ కేవలం దేశం సరిహద్దులకు లోబడి ఉండేది. కానీ సంస్కరణల తర్వాత మన దేశంలోని కంపెనీలు ఎఫ్‌ ఐఐల (విదేశీ సంస్థాగత మదుపు) రూపంలో విదేశీ పెట్టుబడులను కూడా స్టాక్‌మార్కెట్‌ ద్వారా సేకరించుకోవటానికి మార్గం సుగమం అయ్యిం ది.

అందువల్లనే స్టాక్‌ మార్కెట్‌ ఎపుడు తల కిందులైనా విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఎంత మొత్తంలో వెనక్కు వెళ్లాయి అన్న విషయాన్ని సెబి ప్రకటిస్తూ వస్తోంది. మరో కీలకమైన పర్యవసానం ఏమటంటే గతంలో స్టాక్‌మార్కెట్లు దేశీయ ఆర్ధిక వ్యవస్థలో కనిపించే లక్షణాలతో ప్రభావితం అయ్యేవి. నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులతో పాటు విదేశీ ఆర్థిక వ్యవస్థల ప్రభావాలూ చొచ్చుకొని వస్తు న్నాయి. దాంతో స్టాక్‌ మార్కెట్ల అనిశ్చితి తీవ్రత నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఉదాహరణకు 2008 సబ్‌ ప్రైమ్‌ సంక్షోభం భారతీయ స్టాక్‌ మార్కెట్లను ఎలా ప్రభావితం చేసిందో పరిశీ లిస్తే పైన పేర్కొన్న విషయాలు అర్ధం చేసుకో వటం తేలికవుతుంది.

2008 లో సబ్‌ప్రైమ్‌ సంక్షోభం నేపథ్యంలో అమెరికా ఆర్థిక ద్రవ్యసంస్థలు కుప్పకూలటంతో బోంబాయి స్టాక్‌ ఎక్ఛేంజ్‌ తీవ్రంగా ప్రతిస్పందిం చింది. సెన్సెక్స్‌ ఒక్కసారిగా 10వేల పాయింట్ల మేర పతనమైంది. నాటి నుండి సెన్సెక్స్‌ పూర్వపు స్థాయికి చేరుకోలేదు. ప్రస్తుతం 14-15 వేల పాయింట్ల వద్ద కొట్టుమిట్టాడుతోంది. అదే విధంగా 2007 మధ్యలో ప్రపంచం ఆహార సంక్షోభానికి చేరువలో ఉందన్న వార్తలు వచ్చి నపుడు, బారెల్‌ చమురు ధర 200 డాలర్లు దాటనుందని వార్తలు వచ్చినపుడు కూడా స్టాక్‌మార్కెట్‌ తీవ్రంగా స్పందించింది. ప్రపంచ ఆర్థిక పరిణామాలే కాదు జాతీయ అంతర్జా తీయ రాజకీయ పరిణామాలకు కూడా స్టాక్‌ మార్కెట్‌ తీవ్రంగానే స్పందిస్తోంది. ఉదాహ రణకు 2002లో నైజీరియాలో చమురు నిల్వలు వెలికి తీస్తున్న షెల్‌ కంపెనీ ఇంజినీర్లను స్థానిక ప్రజలు ఆపహరించారన్న వార్త తెలియగానే న్యూయార్క్‌ కమోడిటీస్‌ ఎక్ఛేంజ్‌లో షెల్‌ కంపెనీ షేరు ధర పతనం అయ్యింది.

భారత దేశంలో ఒరిస్సా ప్రభుత్వంతో రియాకు చెందిన పోస్కో కంపెనీ ఒప్పందం చేసుకొన్న తర్వాత సియోల్‌స్టాక్‌ ఎక్ఛేంజ్‌లో పోస్కో స్టీల్‌ కంపెనీ షేరు విలువ పెరిగింది. అదే ఒరిస్సాలో 2007 లో పోస్కో కంపెనీ భూసేకరణలో విఫలం అయ్యిందన్న వార్తలు వెలువడగానే దాని షేరు విలువ పడిపోయింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థల మధ్య పరస్పర ఆధారం ఎంత ఎక్కువగా ఉందో ఈ సంఘటనలు తెలియ జేస్తాయి.

భారతదేశంలో 2004 ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి వామపక్షాల మద్దతు అనివార్యం కావటంతో 2004 మే 20న స్టాక్‌ మార్కెట్‌ కుప్పకూలింది. 2009 లో మే 17 ఎన్నికల ఫలితాలు వెలు వడిన మరునాడు ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 2110 పాయింట్లు పెరిగింది. ఈ వేగాన్ని తట్టుకోలేక స్టాక్‌మార్కెట్లుకు మధ్యాహ్నానికి శెలవు ప్రక టించారు. 1997లో ఆగేయ ఆసియా దేశాలు సంక్షోభంలో కూరుకుపోవటంతో మన దేశంలో స్టాక్‌ మార్కెట్‌ ప్రతికూలంగా స్పందించింది.

విదేశీ సంస్థాగత మదుపు సంస్థ (ఎఫ్‌.ఐ.ఐ.)ల ఆధిపత్యం

భారత స్టాక్‌ ఎక్ఛేంజ్‌లో ఆమాటకొస్తే వర్ధమాన దేశాల స్టాక్‌ మార్కెట్లలో 1997 తర్వాత విదేశీ సంస్థాగత మదుపు సంస్థల ఆధి పత్యం బాగా పెరిగింది. 1990 ముందు ఈ సంస్థలకు మన స్టాక్‌ మార్కెట్‌లో ప్రవేశానికి వీలు లేదు.ఆగేయ ఆసియా దేశాల సంక్షోభానికి ప్రధాన బాధ్యత వీరిదేనన్న విషయం నేడు అందరూ అంగీకరిస్తున్నదే. భారతదేశంలో ప్రత్యే కించి 2002 తర్వాత ఎఫ్‌ఐఐల పాత్ర క్రియా శీలకంగా మారింది. 1996 నాటికి బిఎస్‌ఇలో 353 ఎఫ్‌ఐఐలు నమోదు చేసుకుంటే 2003 నాటికి వీటి సంఖ్య 502కి చేరింది. 2005 నాటికి 823, 2009 ఏప్రిల్‌ నాటికి 1639 ఎఫ్‌ఐఐలు భారత స్టాక్‌మార్కెట్లో లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. 1993-1997 మధ్య కాలం లో ఎఫ్‌ఐఐలు సగటున ఏటా 177.6 కోట్ల డాలర్ల పెట్టుబడులు తీసుకురాగా 1997-99 మధ్య కాలంలో ఈ సగటు విలువ 29.5 కోట్ల డాలర్లకు తగ్గింది.

2005లో తిరిగి పుంజుకుని 2,526.7 కోట్ల డాలర్లు పెట్టుబడులు ఎఫ్‌ఐఐల రూపంలో వచ్చాయి. బొంబాయి స్టాక్‌ ఎక్చేంజ్‌ సెన్సెక్స్‌ 10 వేల మైలురాయి దాటటంలో ఎఫ్‌ఐఐలదే ప్రధాన పాత్ర. తిరిగి 2005-2008 మధ్య ఎఫ్‌ఐఐల ద్వారా దేశీయ స్టాక్‌ మార్కెట్లో 25,899 కోట్ల డాలర్ల కొనుగోళ్లు జరగ్గా 23,747 కోట్ల డాలర్ల విలువైన కొనుగోళ్లు జరిగాయి. చివరికి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఎఫ్‌.ఐ.ఐ.లు 5,973.5 కోట్ల డాలర్లు నికర కొనుగోళ్లు, 5,374.7 కోట్ల డాలర్లు నికర అమ్మకాలు జరిపాయి. నికర పెట్టుబడి రాక చూస్తే 5,98.8 (6 బిలియన్‌ డాలర్లు) కోట్ల డాలర్లున్నాయి. స్టాక్‌ మార్కెట్లో విదేశీ మదుపు సంస్థల పట్టు పెరగటంతోపాటే సెన్సెక్స్‌ ఉత్ధాన పతనాలు కూడా సదరు మదుపు సంస్థల రాకపోకలపై ఆధారపడి పెరుగుతూ, తరుగుతూ వస్తోంది.

ఈ అనిశ్చితి కేవలం స్టాక్‌ మార్కెట్‌కే పరిమితం కాలేదు. ఆర్ధిక వ్యవస్థ కూడా అనేక రూపాల్లో అనిశ్చితికి గురవుతోంది. ఉదా హరణకోసం విదేశీ మారకద్రవ్యనిల్వలపై దీని ప్రభావర ఎలా ఉందో పరిశీలిద్ధాం.

పైన చెప్పుకున్నట్లు నాలుగైదేళ్లుగా స్టాక్‌ మార్కెట్లోకి పెద్దఎత్తున మన దేశంలోకి విదేశీ పెట్టుబడులు వచ్చాయి. కేంద్రప్రభుత్వం, రిజర్వు బ్యాంకులు పెరుగుతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలకు సంబంధించి నెలవారీ నివేదికలు విడుదల చేశాయి. కానీ ఈ నిధులను విని యోగించటానికి ప్రభుత్వం సిద్ధం కాలేదు. ఎందుకంటే ఈ డాలర్లన్నీ దేశీయ ఉత్పాద కరంగంలోకి వచ్చినవి కావు. కేవలం స్టాక్‌ మార్కెట్‌కే పరిమితం అయినవి. స్టాక్‌మార్కెట్లోకి వచ్చే పెట్టుబడులు ప్రధానంగా తక్షణం లాభాలు పోగేసుకొనే లక్ష్యంతో వస్తాయి. మన స్టాక్‌ మార్కెట్లో వచ్చే రోజువారీ లాభాల కంటే మరోచోట వచ్చే రోజువారీ లాభాలు ఎక్కువగా ఉంటే అక్కడకు పరుగులెడతాయి. అందుకనే దీన్ని కాలునిలవని పెట్టుబడి, గాలివాటు పెట్టు బడి అని పిలవటం పరిపాటి.

ఏరోజుకారోజు జరిగే లావాదేవీలపై ఆధారపడి వచ్చే విదేశీ ద్రవ్య నిల్వలను వ్యవస్థాగత ప్రయోజనాలకోసం వెచ్చించే సాహసం చేయలేరు. అందువల్ల ఈ స్టాక్‌మార్కెట్‌ పెట్టుబడులు ఒక దేశపు విదేశీ మారకద్రవ్య నిల్వలకు గ్యారంటీ ఇవ్వలేవు. గత సంవత్సరం సబ్‌ప్రైం సంక్షోభం సందర్భంగా, పైన చెపుకొన్నట్లు స్టాక్‌మార్కెట్‌ ఒక్కసారిగా కుప్ప కూలటంతో రిజర్వు బ్యాంకు వద్దనున్న డాలరు నిల్వలు అంతే వేగంగా పడిపోయాయి.

అటువంటి పరిస్థితుల్లో తలెత్తే మరో ప్రమాదం దేశీయ కరెన్సీ విలువలో అస్థిరత. ఉదాహరణకు 2004-2008 మధ్యకాలంలో విదేశీ మారక ద్రవ్యనిల్వలు విపరీతంగా పెరగటంతో రూపాయి విలువ కూడా పెరిగి డాలరు విలువ 39 రూపాయలకు సమానం అయ్యింది. అదే 2008 చివరినాటికి మన దేశం నుండి విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెద్దఎత్తున ఉడాయించటంతో రూపాయి విలువ ఒక్కసారిగా పతనం అయ్యింది. ఆ నేపధ్యంలో డాలరు విలువ 51 రూపాయలతో సమానం అయ్యింది. అంటే కేవలం సంవత్సరం వ్యవ ధిలో రూపాయి విలువ 29 శాతం పడిపో యిందన్నమాట. దేశీయ కరెన్సీ విలువలో ఈ స్థాయిలో అనిశ్చితి సహజంగానే వివిధ రంగా ల్లో పెట్టుబడి వ్యయంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. విదేశీ చెల్లింపులు భారం అవుతాయి. మరోవైపున ఈ రకమైన కరెన్సీ అనిశ్చితి వల్ల కూడా ప్రభుత్వంపైనా, ఆర్ధిక వ్యవస్థపైనా అదనపు భారం పడుతోంది.

ఉదాహరణకు రూపాయి విలువ పెరగటం వల్ల విదేశీ మదుపరుల ఆస్తుల విలువ తగ్గుతుంది. దాంతో 2008-2009 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం వీరికి 5,780 కోట్ల డాలర్లు చెల్లిం చాల్సి వచ్చింది. అంటే అంత మొత్తం నిధులు ఉత్తిపుణ్యానికి మన మార్కెట్‌ నుండి కనుమ రుగయ్యాయి. ఇటువంటి పరిస్థితులు చూసి నపుడే చెంప దెబ్బ దోడ దెబ్బ అన్న సామెత గుర్తుకొస్తుంది.

ద్రవ్యరంగంపై ఆధిపత్యం ఎవరిదన్న విషయం తెలసుకోవటానికి మార్కెట్‌ కాపిటలైజేషన్లో ఎవరివాటా ఎంతన్నది ఒక సూచికగా చెప్పవచ్చు. మొత్తం స్టాక్‌ మార్కెట్‌ కాపిటిలైజేషన్లో విదేశీ సంస్థల వాటా 12.87 శాతం ఉండగా భారతీయ ప్రజల వాటా 11.6శాతం మాత్రమే. ప్రభుత్వరంగ సంస్థల షేర్ల విషయంలో కూడా విదేశీ మదుపు సంస్థలదే సింహభాగం. స్టాక్‌ ఎక్ఛేంజ్‌ బోర్డు నిబంధనల ప్రకారం మార్కెట్‌ కాపిటలైజేషన్లో భారతీయుల వాటా 25శాతానికి తగ్గకుండా ఉంటే మార్కెట్‌ ఒడిదుడుకులను తట్టుకొని ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవచ్చు.

కానీ నేడు బిఎస్‌ఇలో విదేశీ సంస్థల వాటా 20 శాతానికి పైగా ఉంటే భారతీ ప్రజల వాటా 11 శాతానికి పరిమితం అయ్యింది. అంతేకాదు, ద్రవ్య ప్రపంచీకరణ పర్యవసానంగా తెరమీదకు వచ్చిన కమోడిటీ డెరివేటివ్స్‌, ఫ్యూచర్స్‌, హెడ్జ్‌ఫండ్‌, పార్టిసిపేటరీ నోట్లు, ఇంకా అనేక నూతన మార్కెట్‌ ఉత్ప త్తుల్లోనూ విదేశీ సంస్థలదే పైచేయిగా ఉంది. ఇవన్నీ ద్రవ్య పెట్టుబడి క్రియాశీలక రూపాలుగా చెప్పుకోవచ్చు. ఈ రూపాలన్నింటిలోనూ సదరు పెట్టుబడిపై పెత్తనం ఎవరిదన్న విషయం గోప్యంగా ఉంటుంది. ప్రభుత్వ నియంత్రణల నుండి ఈ గోప్యత ద్వారా ద్రవ్య పెట్టుబడి తనను తాను కాపాడుకొంటుంది. ఒకరకంగా చెప్పా లంటే ఇవన్నీ చీమల దండు లాంటివి. కను చూపుమేరలో కనిపించే చీమే చివరిది కాదు. వాటి కలుగు వేరే చోట ఉంటుంది. మోజారిటీ హెడ్జ్‌ఫండ్లు అమెరికా ఆధీనంలో ఉన్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు వీరి చేతుల్లో ఉంటాయి.

ఒక్క డెరివేటివ్స్‌ రూపంలోనే ప్రపంచ వ్యాప్తంగా 600 ట్రిలియన్‌ డాలర్ల (ట్రిలియన్‌=లక్షకోట్లు) పెట్టుబడి చలామణి అవుతోంది. ఉత్పాదక వ్యవస్థకూ, దీనికీ ఏ మాత్రం సంబంధం లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన ఈ డెరివేటివ్స్‌ నేడు క్రమంగా వర్ధమాన దేశాలకు విస్తరిస్తున్నాయి. ఒక అంచనామేరకు ఫ్యూచర్స్‌ మార్కెట్లో 43 కోట్ల 24 లక్షల ఒప్పందాలు జరిగాయి. వీటి విలువ 1,330 కోట్ల డాలర్లు.ఇంత పెద్ద ఎత్తున విదేశీ మదుపు సంస్థలు మన స్టాక్‌మార్కెట్లో పెటుబడులు పెట్టడానికి మూలకారణం, ఎటువంటి ప్రభుత్వ నియంత్ర ణలు లేకపోవటం. అవి సాధించే లాభాలపై పన్నులు లేకపోవటం. మిగిలిన పెట్టుబడిదారీ దేశాల్లో వచ్చే లాభాలకంటే మనదేశపు కాపిటల్‌ మార్కెట్లో వచ్చే లాభాల రేటు అధికంగా ఉండ టం. హెడ్జ్‌ఫండ్‌ వంటి రూపాల్లో ద్రవ్య పెట్టు బడి మనదేశం వంటి వర్ధమాన దేశాల కాపిటల్‌ మార్కెట్లలో ప్రవేశించటానికి సిద్ధంగా ఉం టుంది.

మోసాలకు లైసెన్స్‌

పైన చెపుకొన్నట్లు స్టాక్‌ మార్కెట్లలోకి రోజువారీ ప్రవేశించే పెట్టుబడులు ఎవరివన్న విషయం బయటకు పొక్కదు. దాంతో మన దేశంలోని పెట్టుబడిదారులైనా మారిషన్‌ కంపెనీ పేరుతో బొంబాయి స్టాక్‌మార్కెట్టును శాసించ వచ్చు. ఈ క్రమంలోనే ఫలానా కంపెనీ షేర్లు పెంచేయాలన్న అవగాహన సదరు కంపెనీకి, మార్కెట్‌ వర్గాలకు మధ్య కుదిరితే ఉన్నపళంగా సదరు కంపెనీ షేర్లు విపరీతంగా అమ్ముడ వుతాయి. అది చూసి జనం వేలం వెర్రిగా కొంటారు. మార్కెట్‌ నిలకడగా నడిచిన రోజు కంటే ఆ రోజున సదరు కంపెనీకి ఎక్కువ లాభాలు వస్తాయి. అటువంటి సందర్భాల్లో ముందుకొచ్చేవే స్టాక్‌ మార్కెట్‌ కుంభకోణాలు. 1991లో హర్షద్‌ మెహతా కుంభకోణం, 2001లో కేతన్‌ పరేఖ్‌, గ్లోబల్‌ ట్రస్ట్‌బ్యాంకు, మధేపురా సహకార సంఘం వంటి కుంభ కోణాలు ఈ కోవకు చెందినవే.

1991లో నేటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మన దేశానికి ఆర్థిక మంత్రిగా ఉండేవారు.

నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో కాపిటల్‌ మార్కెట్లలో ప్రభుత్వ జోక్యం ఉండదని ఆయన ప్రకటించారు. దాంతో ప్రభుత్వం కళ్లు మూసు కోవటం, హర్షద్‌మెహతా (ఈయన్ను స్టాక్‌ మార్కెట్‌ బ్రోకర్లు బిగ్‌బుల్‌-పెద్ద ఎద్దు అనిపిలు స్తారు) స్టాక్‌మార్కెట్‌ను అతలాకుతలం చేయడం జరిగాయి. ఫలితం రూ. 4000 కోట్ల కుంభ కోణం. 2001లో కేతాన్‌పరేఖ్‌, సిఆర్‌ భన్సాలీ, దినేష్‌ దాల్మియాలు హర్షద్‌ మెహతా అవతార మెత్తారు. ఫలితం సుమారు 7 కోట్ల మంది సాధారణ ప్రజలు తమ సొమ్ముదాచుకున్న యుటిఐ బ్యాంకు దివాళా తీసింది. ఇది గతం. వర్తమానం ఇందుకు భిన్నంగా లేదు.

కంపెనీల వాస్తవిక ఆర్థిక స్థితి గతులతో నిమిత్తం లేకుండా ఆకర్షణీయమైన వార్షిక ఫలితాలు ప్రకటించటం అనేది మరో తరహా మోసం. సత్యం కుంభకోణం గురించి పాఠకుల ఇంకా మర్చిపోలేదు. కనుక ఈ తరహ కుంభకో ణాల గురించి వివరణ అవసరం లేదు. సాధా రణంగా కంపెనీలు సంవత్సరానికి ఒకసారి జమాఖర్చులు లెక్కలు చూసుకోవటం ఆనవా యితీ. స్టాక్‌మార్కెట్‌ ఈ ఆనవాయితీని మార్చే సింది. సంవత్సరానికి ఒకసారి ఆదాయ వ్యయ వివరాలు ప్రకటిస్తే సదరు కంపెనీ షేర్లు సంవత్సరానికి ఒక్కసారే ప్రభావితం అవుతాయి. దీనికి భిన్నంగా ఇపుడు త్రైమాసిక ఫలితాలు ప్రకటించటం మనం చూస్తున్నాము. మధ్య మధ్యలో కొన్ని వాణిజ్య పత్రికలు ఎంపిక చేసిన కంపెనీల ఆర్థిక స్థితిగతుల ధోరణుల గురించి నడిపే ప్రత్యేక శీర్షికలు కూడా స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేస్తాయి.

ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మే 18, 2009 ట్రేడింగ్‌ వేగాన్ని అందుకోలేక బోంబే స్టాక్‌ ఎక్చేంజ్‌కి శెలవు ప్రకటించారని పైన చెపుకొన్నాము. ఈ రోజు జరిగిన ట్రేడింగ్‌ వెనక కేతన్‌ ఫరేఖ్‌ శిష్య బృందపు హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇటీవలనే 'క్లియర్‌ కాపిటల్‌' అనే సంస్థ స్టాక్‌ ఎక్చేంజ్‌లో నమోదైన 500 కంపెనీల అకౌంటింగ్‌ లావాదేవీలను అధ్యయ నం చేసింది. ఇందులో 63 సంస్థలు సత్యం తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తిం చింది.

ప్రాథమిక మార్కెట్లో కీలక సాధనం ఐపిఓ. అంటే ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌. గత పదిహేను సంవత్సరాలుగా ఐపిఓలు విడుదల చేసి వేలకోట్లు నిధులు సేకరించిన కంపెనీలు అడ్రసు లేకుండా పోయాయని కేంద్రప్రభుత్వమే అంగీకరించింది. నకిలి డిమాట్‌ అక్కౌంట్లు సృష్టించిన విషయం వెలుగు చూసింది. ఇటు వంటి వారిపై ఇటు కంపెనీ వ్యవహారాల శాఖ, స్టాక్‌ మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతింటుందన్న భయంతో ముందస్తు చర్యలు తీసుకోలేదని సెబి అధ్యక్షులు భావే ఈ మధ్యనే ప్రకటించాడు.

ఈ నేపధ్యంలో యుపిఏ-2 ప్రభుత్వం అనుసరిస్తున్న ద్రవ్యరంగ సరళీకరణ విధానాల కారణంగా స్టాక్‌మార్కెట్‌ మరింత ఊపుతా పులకు గురికానుంది. ఇప్పటికే గత రెండు వారాల్లో నాలుగు సార్లు... వందల పాయింట్ల పతనం, పెరుగుదల చూస్తున్నాము.

జాతీయ అంతర్జాతీయ గుత్త పెట్టుబడిదారులు, ద్రవ్య పెట్టుబడిదారులు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన విధానాలు అమలు చేయించుకోవటంలో స్టాక్‌ మార్కెట్‌ ఉత్తాన పతనాలను ఒక వ్యూహాత్మక సాధనంగా మార్చు కుంటున్నాయి. అందులో భాగంగా ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోబొతున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను స్టాక్‌మార్కెట్‌ పరిధిలోకి (ఇప్పటికి రానివాటిని కూడా) తీసుకురావటానికి, ఇప్పటికే లిస్ట్‌ అయిన వాటి షేర్లు ఎక్కువగా అమ్మకానికి పెట్టటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తు న్నది. ఏటా కనీసం 25వేల కోట్లు రూపాయలను ఈ సంస్థల షేర్లు అమ్మకాలు ద్వారా రాబట్ట బోతున్నది. వాస్తవంగా ఈసంస్థల వద్ద రిజర్వ్‌ నిధులు 4.85 లక్షల కోట్లు ఉన్నాయి. వీటి ఆధునీకరణకు, విస్తరణకు అవసరమైన పెట్టు బడులు బయటనుండి అవసరం లేదు. ఉదాహ రణకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌వద్ద రూ. 5,500 కోట్లు, ఎన్‌.టి.పి.సి వద్ద రూ. 15,000 కోట్లు, బి.యస్‌.యన్‌.యల్‌ వద్ద రూ. 37 వేల కోట్లు ఇలా రిజర్వ్‌ నిధులు ఉన్నాయి.

అవసరమైతే ప్రభుత్వం కూడా ఈ నిధులను సామాజిక అవసరాలకు వినియోగించుకోవచ్చు. కాని ప్రభుత్వ అసలు ఉద్ధేశం ఈ సంస్థలపై విదేశీ, స్వదేశీ బడా మదుపు సంస్థల ఆదిపత్యం పెంచటమే. ఇది ఒక పెద్ద కుట్ర. అలాగే బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ బిల్లు - 2005 ను ఆమోదించాలనీ, కొన్ని ఆహారపు వస్తువులపై ఉన్న ప్యూచర్‌ ట్రేడ్‌ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి ధరల రిస్క్‌ నిర్వాహణను పునరుద్దరించాలని కోరింది. ఇన్సురెన్స్‌, ఫింఛన్ల నిధి వంటివాటిని స్టాక్‌ మార్కెట్‌ పరిధిలోకి తీసుకువచ్చి దీర్ఘకాలిక ఋణ మార్కెట్‌ను మరింతగా విస్తృతపరచటం, ప్యూచర్‌ ద్రవ్య మార్కెట్‌ను సరళీకరణ చేయటం, దీనిలో దేశీయకంపెనీలపై ఉన్న పరిమితులను తొలగించటంతో పాటు యస్‌.డి.ఆర్‌ ద్రవ్యాన్ని కూడా షేరుమార్కెట్‌లో క్రయవిక్రయాలకు పెట్టాలని తెలిపింది. ఈ చర్యలు మన ఆర్ధిక వ్యవస్థను మరింతగా అంతర్జాతీయ ద్రవ్య పెట్టు బడితో ముడిపెడతాయి. దేశీయ ఆర్ధిక వ్యవస్థ లో ద్రవ్యీకరణను పెంచుతాయి. ఇవి భారత ఆర్ధిక వ్యవస్థకూ, ప్రజలకూ ఉరితాళ్లు బిగి స్తాయి.

మార్కిస్టుపై మీ స్పందనలను క్రింది మెయిల్‌లకు పంపగలరు.

svenkatarao_1958@yahoo.com

svr@prajasakti.com

No comments: