ఈ రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు ములంకర్ ఆడిటోరియం కాంటీన్ లో సాహితి సమావేశం జరిగింది. శ్రీకాంత్, వీరయ్య, జయప్రకాశ్, కృష్ణ రావు గార్లు హాజరయ్యారు. ప్రసన్న ఆఫీసు పని వలన, విశ్వనాధ్ రెడ్డి ఆరోగ్య కారణాల వలన రాలేకపోయారు. చంద్రశేఖర్ ఫోన్ అందుబాటులో లేదు. వీరయ్య శ్రీ శ్రీ శతజయంతి సభ కార్యక్రమం గురించిన నివేదిక ప్రవేశపెట్టారు.
రెగ్యులర్ గా హాజరయ్యే సాహితి ప్రియులు ఈ సారి రాకపోయినప్పటికీ మొత్తం మీద కార్యక్రమం సజావుగానే సాగిందని అభిప్రాయపడ్డాము. మీడియా మిత్రులు హాజరు కాకపోతే హాజరు మరింత పెవళం గా ఉండేది. హాజరైన వారిలూ కొత్తవారు ఎక్కువగా ఉన్నారు.
ఆర్ధిక విషయాలకు సంభందించి కూడా వీరయ్య జమ ఖర్చుల వివరాలు సమావేశం ముందుంచారు. కార్యక్రమం ఖర్చులు పోను , గతం లో ఉన్న 4200 తో కలిపి 14,000 అందుబాటులో ఉన్నాయి. ఇందులో 3000 ఆంధ్ర అసోసియేషన్ ఇంకా ఇవ్వవలసి ఉంది. సాహిత్య అకాడమీ సహకారం పొందటం లో కృష్ణ రావు గారు మంచి కృషి చేసారు.
తదుపరి కార్యక్రమం గురించి కూడా కొంత ప్రాధమిక చర్చ గరిగింది. శ్రీ శ్రీ శతజయంతి ముగింపు ఉత్సవాల సందర్భం గా ఫుల్ డే సెషన్ ఒకటి నిర్వహించాలని ప్రతిపాదన వీరయ్య ముందుకు తెచ్చారు. అందరూ అంగీకరించారు. ఈ సందర్భంగానే జాతీయ కవి సమ్మేళనం, కవిత్వం, కథలు, శ్రీ శ్రీ గురించి పరిశోధన వ్యాసాలూ ఆహ్వానించి, ప్రత్యెక సంచిక తీసుకురావాలన్న ప్రతిపాదనకు అందరూ అంగీకరించారు. ఈ కార్యక్రమం గురించి మరింత వివరంగా చర్చించేందుకు పూర్తీ స్థాయి సమావేశం జరిపితే ఉపయోగం గా ఉంటుందని జయప్రకాశ్ సూచించారు.
శ్రీ కాంత్ మాట్లాడుతూ నూతన రచయితలకు ట్రైనింగ్ క్యాంపు నిర్వహించాలన్న్ ప్రతిపాదన ముందుకు తెచ్చారు. దీని గురించి గతం లో ప్రయత్నించినా వీలుపడలేదు. కథ రచన గురించి కాళీపట్నం రామ రావుని కావాలంటే పిలుద్దామని కృష్ణా రావు చెప్పారు. అయితే ఈ రెండు కార్యక్రమాలు కలిపి చేయాలా లేక వేరు వేరుగా చేయాలా అన్నది మనం నిర్ణయించుకోవాలి.
కృష్ణా రావు గారు ఆంధ్ర ప్రదేశ్ అవతరనూత్సవాల సందర్భంగా నాటిక వేస్టే బాగుంటుందని ప్రతిపాదించారు. చిన్న నాటిక ఒకటి వెతికి, ఎంతమంది అవసరం ఉంటుందో చూసి నిర్ణయించుకోవాలని భావించాము.
మీడియా మిత్రులు చొరవ తీసుకుంటే నవంబర్ మొదటి వారం లో బుక్ స్టాల్ ఏర్పతుచేయవచ్చని, అందుకు గాను జయప్రకాశ్, కృష్ణారావు లు చొరవ తీసుకుని, అద్దె లేకుండా స్టాల్ ఇప్పించాలని వీరయ్య ప్రతిపాదించారు.
వీలయినంత త్వరలో మరోసారి కలుసుకుని పై కార్యక్రమాలకు తుది రూపు ఇవ్వాలని నిర్నయించటమైనది.
బహుశ మూడో ఆదివారం, లేక శనివారం మనం మరోమారు కలుసుకోవచ్చని ప్రతిపాదిస్తున్నాను. అందరి వెసులుబాటు చూసుకుని తేది, సమయం ఖరారు చేద్దాము.
Monday, November 2, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment