ప్రజాశక్తి - బిజినెస్ వాచ్ కొండూరి వీరయ్య Sun, 24 Jan 2010, IST
2010 సంవత్సరం భారత ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకోనుంది. యుపిఎ2 అనుసరించిన ఆర్థిక విధానాలు, అర్థం లేని మార్కెట్ మేనేజిమెంట్ పుణ్యమా అంటూ దేశ ప్రజానీకం ఈ సంవత్సరమంతా ధరాఘాతానికి లోనుకానుంది. ప్రస్తుత వ్యవసాయక సంవత్సరం ప్రారంభంలోనే వర్షపాతం అనుకూలం లేదని తెలుసు. సేద్యపు భూమి వైశాల్యం 8 శాతం తగ్గిందనీ వ్యవసాయ శాఖ ప్రకటించింది. ముఖ్యమైన ఆహారోత్పత్తులు దేశీయ అవసరాలకు అనుగుణంగా లేవనీ ప్రకటించింది. చక్కెర అవసరానికంటే తక్కువగా ఉందనీ తెలుసు. పప్పు ధాన్యాలు 30 లక్షల టన్నులు తక్కువగా ఉన్నాయనీ తెలుసు. కానీ అందుకవసరమైన నివారణ చర్యలు తీసుకోవటంలో అటు ఆర్థికమంత్రిత్వ శాఖ గానీ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ గానీ దారుణంగా విఫలమైంది. పర్యవసానం... ఉత్తరాది ప్రజలు దీపావళికీ, దక్షిణాది ప్రజలు సంక్రాంతికి నోరు తీపి చేసుకోవటానికి జేబులు ఖాళీ చేయించుకోవాల్సి వచ్చింది. సంవత్సరం క్రితం 20-25 రూపాయలుగా ఉన్న చక్కెర సంవత్సరం తిరక్కముందే 50 రూపాయలకు చేరుకొంది. ఖచ్చితంగా 100 శాతం రేటు పెరిగిందన్నమాట. సంవత్సరం క్రితం 40 రూపాయలకు అటు ఇటుగా ఉన్న కందిపప్పు నేడు 100 రూపాయలకు చేరింది. అంటే 125 శాతం రేట్లు పెరిగాయి. ఇంతేకాదు. ఉల్లిపాయలు, ఇతర కూరగాయలు కూడా పెరుగుదలలో ఏమాత్రం తీసిపోలేదన్నట్లు పోటీపడ్డాయి. వెరసి ఆహారోత్పత్తులకు సంబంధించిన ద్రవ్యోల్బణం 20 శాతానికి చేరింది.
విచిత్రమేమిటంటే ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణ ప్రమాదం పొంచి ఉంటే భారతదేశంలో మాత్రం రెండు మూడు నెల్ల పాటు టోకు ధరల సూచితో కొలిచే ద్రవ్యోల్బణం తిరోగమన దిశలో ఉంది. అంటే సున్నాకంటే కూడా తక్కువ స్థాయిలోకి పడిపోయింది. 2008 పార్లమెంట్ ఎన్నికలకు ముందు 12 శాతానికి పైగా ఉన్న ద్రవ్యోల్బణం ఎన్నికల తర్వాత అమాంతంగా ఎలా పడిపోయిందన్నది సామాన్య ప్రజలకే కాదు. ఇటు ఆర్థికవేత్తలకూ అంతుబట్టని సమస్యగా మిగిలింది. ఇదిలా ఉండగా వినిమయ ధరల సూచి మాత్రం దాదాపు 9 నుండి 11 శాతం మధ్య పెరిగితే అందులో ఆహారోత్పత్తుల ధరల సూచి 69 శాతం వరకూ పెరిగింది. ఈ కాలంలోనే ఇతర వస్తువుల ధరల మాట ఎలా ఉన్నా ఆహారోత్పత్తుల ధరలు మాత్రం ఆకాశానికంటటం ప్రారంభమైంది. ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తూఉండిపోయింది తప్ప కారణాలు వెతికేందుకు ప్రయత్నించలేదు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విజయోత్సవాల ఊపు మీద ఉన్న యుపిఎ2 పార్లమెంట్లో ధరల పెరుగుదలపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ధరల నియంత్రణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని నిస్సిగ్గుగా ప్రకటించింది. రాష్ట్రాల్లో నల్లబజారు పెద్దఎత్తున విస్తరించినందున సరుకులు దుకాణాల్లో కనిపించకుండా పోతున్నాయని సమస్యను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. వాస్తవాలు పరిశీలించేవారికి సరుకులు అసలు దుకాణాల వరకూ చేరకపోవటమే కాదు, ఉత్పత్తి స్థాయిలోనే తగ్గిపోయాయని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ప్రభుత్వం ఈ విషయాలు గుర్తించటానికి నిరాకరిస్తూ వచ్చింది. దాంతో నివారణ చర్యలు చేపట్టే బాధ్యత నుండి కూడా వైదొలగింది.
ఎట్టకేలకు కళ్లు తెరిసేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తయి ప్రజలు ధరాఘాతానికి బలైపోయారు. ప్రతిపక్షాల ఒత్తిడితో ప్రభుత్వం చివరికి అంతర్జాతీయ మార్కెట్ నుండి దిగుమతులు చేసుకోవటం ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించింది. తీరా అందుకవసరమైన అనుమతులు ఇవ్వటంలో తాత్సారం చేసింది. ఉన్న కొద్దిపాటి సమయాన్ని ప్రైవేటు సంస్థలు ఉపయోగించుకుని దిగుమతులు చేసుకోగా ప్రభుత్వరంగ సంస్థలైన స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, నాఫెడ్ వంటి సంస్థలు, పప్పుధాన్యాల మార్కెట్‌ను నియంత్రించే సంస్థలు మాత్రం కిమ్మనకుండా ఉండిపోయాయి. ఈ విషయంపై పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో అంతర్జాతీయ మార్కెట్లోనూ, దేశీయ మార్కెట్లోనూ ధరల విషయంలో పెద్దగా వ్యత్యాసం లేదని, ఇప్పుడున్న ధరలతో దిగుమతులు చేసుకుంటే లాభసాటిగా ఉండదని అందువల్ల దిగుమతులు మందగించాయని చెప్పి చేతులు దులిపే ప్రయత్నం చేసింది. అంటే దేశీయంగా ఉత్పత్తి చేయటానికి అవసరమైన పరిస్థితులు కల్పించకుండా, విదేశీ దిగుమతులు చేసుకోకుండా మరి ప్రజల అవసరాలు ఎలా తీర్చనుంది ? రిజర్వు బ్యాంకు మూడునెల్లకొకసారి చేసే ప్రకటనలో సదరు కాలంలో ప్రభుత్వం వద్ద ఇన్ని లక్షల కోట్ల డాలర్లు పేరుకున్నాయని ప్రకటిస్తూ రావటం మనం చూస్తున్నాము. మరి ఈ విధంగా పేరుకొంటున్న లక్షల కోట్ల డాలర్లను ఏ అవసరాలకు వినియోగించనున్నారు? ప్రజల ఆహార అవసరాలు తీర్చటం మినహా ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైన కర్తవ్యం ఏముంటుంది? అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
ప్రణాళికా సంఘం అంచనాల ప్రకారమే రానున్న మూడు సంవత్సరాల్లో పప్పు ధాన్యాల ధర మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే నేడు 100రూపాయలుగా ఉన్న కందిపప్పు ధర 150 వరకూ పెరిగినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నమాట. పప్పు ధాన్యాలు కార్మికులు, వ్యవసాయ కార్మికుల ఆహారంలో కీలక పాత్ర పోషిస్తాయి. మిగిలిన సంపన్నవర్గాల మాదిరిగా ఈ వర్గాలు పౌష్టికాహారం తీసుకునే ఆర్థిక స్థోమత కలిగిన వర్గాలు కాదు. కానీ వీరు చేసే శారీరక శ్రమకు తగ్గట్లుగా పోషకాహారం లేకపోతే వీరి ఉత్పాదకత కూడా పతనం అవుతుంది. ఆరోగ్యం క్షీణించటం ఎటూ తప్పదు. అటువంటి పరిస్థితుల్లో వీరి ఆహారంలో ముఖ్యభాగమైన చక్కెర, పప్పు ధాన్యాల పట్ల ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తోంది అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోతుంది. ప్రభుత్వ అంచనాల ప్రకారమే 2008-2009 ఆర్థిక సంవత్సరానికి దేశంలో 146.8 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అయింది. 2007-2008 ఆర్థిక సంవత్సంరలో మరో 105 లక్షల టన్నుల చక్కెర మిగిలి ఉంది. 2008-2009 ఆర్థిక సంవత్సరంలో 220 లక్షల టన్నులుగా ఉంది. అంటే గడచిన ఆర్థిక సంవత్సరానికి అవసరానిక మించి 30లక్షల టన్నుల చక్కెర మార్కెట్లో అందుబాటులో ఉంది. కానీ ధరలు మాత్రం పెరిగిపోయాయి. దీనికి కారణం ఎన్నికలకు ముందు చక్కెర పరిశ్రమ లాబీయింగ్ ఒత్తిళ్లకు లోనై ప్రభుత్వం ఎగుమతులకు అనుమతించటమే.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా చక్కెర ఉత్పత్తులు డిమాండ్‌కు తగ్గట్లుగా లేకపోవటంతో మన దేశ చక్కెర పరిశ్రమలకు లాభాల పంట బాగా పండింది. కానీ రైతులకు మాత్రం ఈ వ్యాపారం గిట్టుబాటు కాకపోవటంతో ఈ సంవత్సరం (2009-2010) చక్కెర సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. దాంతో ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. ఎతా వాతా ఈ మార్పులు ప్రభుత్వ విధాన రూపకల్పనలో ప్రాధాన్యతకు నోచుకోకపోవటంతో భారాలు మోయటం వినియోగదారుల వంతైంది.వందరోజుల్లో ఆహార భద్రత చట్టం ఆమోదిస్తామని అధికారానికి వచ్చింది యుపిఎ 2 ప్రభుత్వం. కానీ అధికారానికి వచ్చి తొమ్మిది నెల్లు గడుస్తున్నా ఈ చట్టం ఊసెత్తటం లేదు. ఈ విషయం అటుంచితే 2008-2009 ఆర్థిక సంవత్సరానికి జాతీయ ఆహార భద్రత కోసం వెచ్చించిన నిధుల్లో సగానికి పైగా ఖర్చుకాలేదు. అంతేకాదు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచే లక్ష్యాలకు కూడా ప్రభుత్వం ఆమడ దూరంలో ఉంది. ఇన్ని లోపాలు ఉండబట్టే ప్రభుత్వం అసమర్థతను ఆసరా చేసుకుని మార్కెట్ శక్తులు కూడా ధరాఘాతంలో తమవంతు పాత్ర పోషిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో వ్యవసాయ మార్కెట్ విధానాన్ని, సహకార రంగాన్ని సమూలంగా తిరగదోడాల్సి ఉంది. అంతేకాదు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతో వ్యవసాయ భూముల కైంకర్యాన్ని కూడా నియంత్రించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది. జాతీయఆహారభద్రత చట్టం తక్షణమే అమల్లోకి తేవటంతో పాటు అప్పటివరకూ ప్రజా పంపిణీ వ్యవస్థను దారిద్య్రరేఖకు ఎగువన, దిగువన అన్న వ్యత్యాసం లేకుండా అందరికీ అందుబాటులోకి తేవాలి. పేదరికాన్ని లెక్కించానికి ప్రణాళికా సంఘమే నియమించిన టెండూల్కర్ కమిటీ గత పదేళ్లల్లో పేదరికం పదిశాతానికి పైగా పెరిగిందని ప్రకటించింది. అంతకు ముందు గ్రామీణాభివృద్ధి మత్రిత్వ శాఖ నియమించిన స్వంతత్ర నిపుణుల కమిటీ ( ఎన్బి సక్సేనా కమిటీ) 50 శాతం ప్రజలు పేదరికంలో ఉన్నారని తెలిపింది. ఈ గణాంకాలకు అనుగునణంగా బడ్జెట్ కేటాయింపుల్లో మార్పులు రావాలి. వీటితో పాటు ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణానికి ప్రత్యేక సూచిని తయారు చేయాలి. ఈ చర్యలు చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలో విఫలం అయితే రానున్న కాలంలో ప్రజానీకాన్ని ధరాఘాతం వెన్నాడనుంది!
Thursday, January 28, 2010
Sunday, January 17, 2010
Jyoti Basu on his life and politics
Veteran Marxist leader Jyoti Basu, who died here Sunday, was a man of strong views and never hesitated to speak his mind. Here are some of his comments on his life and politics:
On childhood:
'My mother came from an upper middle-class family, they were well-to-do landowners. My father, Nishikanta Basu, came from a relatively lower middle-class background.'
'I was 10 years old. Talk of revolutionaries and the fight for independence was in the air.'
In London:
'I was initiated to international politics in London. Entire Europe was restive. Fascist Mussolini had wrested power in Italy.'
'We formed the `London Majlis' and I was its first secretary. The idea was to generate public opinion for the cause of Indian independence and collect subscriptions.'
On return to India:
'Marriage was being discussed. I did not attach importance to this. I knew there was a long and difficult political agenda ahead. Anyway, I got married.'
Political life:
'It never occurred to me that I would one day become an MLA, but the party thought otherwise. I had to abide by its directives.'
'My very first election as a candidate gave me a taste of what bourgeoisie elections were all about. It was baptism by fire. But all's well that ends well.'
On undivided CPI:
'Raids and arrests were routine. Between September 1948 and January 1949, I worked openly in trade unions, maintaining the communication links with our leadership in hiding.'
Emergency rule:
'(Indira) Gandhi was scared. Her authoritarianism knew no limits. Thus she chose the option which all dictators faced with a critical situation coupled with the fear of losing power usually do: she opted to usurp all the rights of the people.'
Left Front government:
'It was exactly at 10.30 a.m. on June 21, 1977, that the first Left Front ministry was sworn in... Land reforms were our topmost priority.'
On politics:
'I have worked for the people of this country and in the process, been witness to many twists and turns of history,'
On Sino-Indian war:
'India and China went to war over the border dispute in 1962. The reactionary forces led by the Congress cried for war and inflamed passions. We said that talks were the only way; the reactionaries called us `anti-nationals' for this.'
Centre-state ties:
'We kept up our sustained campaign for a review of centre-state ties and it was because of this pressure that the government of (Indira) Gandhi was forced to set up the Sarkaria commission on June 9, 1983.'
On Operation Bluestar (June 1984):
'If the centre had been keen and serious about a political settlement to the Punjab problem, then this operation could have been avoided.'
On Babri Masjid razing:
'On December 6 (1992), barbarians demolished Babri Masjid. We stood dishonoured in front of the entire world.'
(Excerpts from 'Memoirs-A Political Autobiography: Jyoti Basu', National Book Agency Pvt Ltd, Kolkata)
Courtesy IANS

Jyoti Basu leaves a generational gap in Indian Politics
Com. Jyoti Basu's demise left with a generational gap in Indian politics. Jyoti Basu is the last out post in Indian politics who represents the generation of freedom fighters. He, through out his life upheld the spirit of freedom movement and worked for the betterment of lakhs of people. During his tenure as chief minister, he had done as much as possible with the spectrum of democratic constitution in India. He also stood for the rights of State governments and became a rallying point for chief ministers either in the case of Sarkaria recommendations implementation or in the case of allocation of financial resources. He not only championed the rights of minorities but also ensured that they would live a respectable and protected life when the country is filled with communal riots. With his innovative administration he turned the administration from oppressor to protector of the common man's rights. Educated in the West during the high noon of enlightenment he imbibed the ideals of enlightenment and his ideals enriched with application of Marxism. He became a true disciple of Marxism and did a lot to apply the principles of Marxism in the Indian context to advance the interests of toiling masses with in the state government limitations. Under his tenure, the state of Bengal became of testing ground to know how to apply the principles of Marxism in such a situation. Even the successive winning of state elections caused a surprise to Fidel Castro who asked in his encounter with Jyoti Basu, how they are able to win tremendously for that much long time even under democracy.
The CPI(M) rule in Bengal gave a new definition for participative democracy. It was under his tenure the downward linkages participatory democracy were strengthened with the strengthening of grass root level democratic institutions at village level. This helped the people who were benefited out of land reforms to consolidate those benefits.
He also represents a cultured interaction through which he became dearer to all strands of politicians. He was part of England educated freedom fighters who were disciplined their political understanding during the peak of international developments such as first and second world wars and also cold war era. His demise left the Indian political spectrum with a generational gap.

Saturday, January 16, 2010
SC, ST (prevention of atrocities) Act: 20 years after
This year the dalit advocacy groups are celebrating the 20th year of SC, ST (prevention of atrocities) act. In implementing the universal human rights and the rights and protections guaranteed by the constitution, SC, ST (Prevention of Atrocities) Act 1989 is a milestone. That act itself came in the backdrop of inhuman incidents such as Kilvenmani, Tchuduru, Karamchedu which shocked the nation in late 80s and early 90s.
Indian constitution, under article 17, prohibits untouchability where as article 15 prohibits any kind of discrimination on the grounds of caste. In pursuance of this constitutional mandate central government adopted protection of civil rights act way back in 1955. The philosophy behind the inclusion of these articles under Fundamental Rights part implies the recognition of state’s dual role, protector as well as facilitator when it comes to depressed classes. The PCR act applies to all under- privileged classes, its main focus is the protection of rights guaranteed to SC and STs. 1955 act recognizes the violation of rights against SCs and STs as crimes to which the policy makers outlined remedial measures as well as protective measures under law of the land. Four decades of its implementation supported by the governmental efforts generated awareness about civil rights of depressed classes. At the same time violation of SC, ST rights kept going on. The social and democratic awareness fueled by anti emergency struggle in the country widened the ambit of civil rights. Followed by the increased activism of dalit advocacy groups, apparently those who headed such groups are the first generation beneficiaries of opportunities under reservation policy, succeeded in differentiating between civil rights and atrocities.
The dalit movements of late 70s and early 80s centered around self respect apart from graded equality. Self respect movements fueled by inhuman atrocities such as mentioned above paved way for new debate about protecting the dalit rights at the same time protecting the dalits from atrocities unleashed against them. Thus the necessity for a new act came up and parliament at that time acted promptly to recognizing this need, thus came in to existence the prevention of SC, ST atrocities which empowers the State to use its powers to see that the perpetrators of atrocities not to go unpunished. The conflicts debated at that time and redressal or remedial mechanisms outlined in those acts are basically individual centric.
Despite these guarantees and protections, the 21st century India is witnessing an increase in atrocities against SCs and STs. The table given below reflects this increase. The major change that needs to be recognized in these atrocities is that they migrated from individual sphere to social sphere. In other sense atrocities against group are increased as against individuals. Particularly this change is evident in the case of developed states such as Maharashtra, Haryana, Andhra Pradesh as well as the states where predominantly feudalistic social relations are in tact. The data covering the major states, compiled from national crime bureau records as well as annual reports of National SC, and ST commissions, Human Rights Commission confirms the same. The data for the year 2001 is complied from National Commission for Scheduled Castes which figures are contestable because of its abrupt reduction of incidence of crime against SC/STs in Madhya Pradesh, Bihar, Rajasthan.
State 1992 1995 1998 2001 2004 2007
Andhra Pradesh 591 1764 1880 1417 3791 3383
Bihar 751 747 785 523 2691 2786
Karnataka 905 1171 1148 1294 1816 1844
Kerala 634 696 1148 135 520 477
Madhya Pradesh 4571 3979 4057 681 6363 4106
Gujarat 190 207 694 465 1549 1038
Maharashtra 1231 1622 683 148 949 1164
Orissa 220 497 772 814 1917 1355
Punjab 18 9 23 50 134 177
Rajasthan 4379 5197 5586 3630 5391 4174
Tamilnadu 550 1293 1562 706 1183 1737
Uttar Pradesh 9296 14215 6511 4972 3790 6144
West Bengal 29 0 0 6 23 3
With the globalization and economic reforms there is a sea change in the debate on dalit rights. Globalisation facilitated the marginalization of dalits and adivasis from socio, economic and cultural fields at the same time consolidating the opportunities in the hands of privileged. This is the time when the state retreated from its duty to managing the social needs, thus opening the earlier restricted field for open competition which resulted opening of new areas of conflict. As mentioned earlier, in this period escalation of atrocities against the dalits and adivasis from individual centric to group centric gained momentum. As this is far beyond the limits of modern jurisprudence which is basically individual centric, the establishment also refusing to register the cases of group violence in nature thus leaving the field open for direct confrontation at some times. This is resulting in conflict of interest for limited opportunities which in turn expressed in terms of caste based conflicts due to the absence of democratic ways of mobilization, and proper grievance redressal mechanisms.
Thus under globalization caste conflicts and atrocities against SC and STs are migrated from individual ethical space to social and economic space. That is the reason for enormous increase of incidence of crime against SC/STs over this period. This is confirmed by National Crimes Bureau records. According to National Crime Bureau Records, as The Hindu reported on July 20th, 2004, Statistics available with the Scheduled Castes and the Scheduled Tribes Commissions indicate that Maharashtra, Rajasthan, Uttar Pradesh, Andhra Pradesh and Tamil Nadu recorded high incidence of atrocities against SC/ST between 1996-2000. In UP, where dalit population is at nearly 21 percent, 17 cases were registered per each lakh of SC population, where as this ratio peaks for Madhya Pradesh with 45 cases for lakh population. In Bengal where SC population stood at 23 % as per 2001 Census, this ratio stands at 0.01 cases / lakh population. In Andhra Pradesh where 16 % population consists 26 cases were registered per each lakh of SCs. Apart from that the analysis of data on incidence of crime against SC/STs reveals fundamental character. The stubborn persistence of deprivations, poverty in its different manifestations, marginalization, in access to resources, both traditional and newly available, denial of benefits of development are producing the conditions for continuous escalation of conflicts across the country. Prevention of atrocities act mainly concentrates on redressal mechanisms. But if we look at the data provided by National Bureau of Crime Records, the progress is not satisfactory. As on 2007, December, 104006 cases are in courts out of which in 6505 cases convictions announced, and 14217 cases culprits were acquitted. Rest of 82472 are still pending before the courts. This performance is after the majority of states established special courts to deal with offences under PCR and POA acts.
Globalisation opened up new opportunities for the upper caste cluster. The same upper caste clusters are having the inward linkages available under the existing state structure. The changed scenario helped them to sustain their hegemony over the economy as well as over the social life in rural India with the coupling of upward linkages made available to them under globalization with already existing inward linkages within the state systems. With the State retreating from the managing of social and public life, in the economic sphere this retreat opened up new opportunities for the private capital where in social sphere opened up new opportunities for non governmental agencies to intrude in to social life. Thus we can now see that the nature of NGOs activities are wide spread across the sectors from helping the disable to microfinance institutions.
On the other hand, this retreat of state also opened up new opportunities for caste forces which are striving for restoring the old identity and group based loyalties instead of striving for democratic grievance redressal means thus consolidating the politics of identity. This identity politics in turn reinforcing the divisions and sub divisions from the existing underprivileged caste clusters there by weakening their bargaining power in its encounter with the State as well as civic life. This in turn, further dividing the socially and economically weaker sections and STs, SC by juxtaposing the interests of these sections, at a time when there is a need to develop solidarity cutting across the castes to protect the underprivileged. This underscores the need for developing sustained movements based on building sustainable movements by developing strong solidarity among the under privileged castes. In this back ground the governments has to factor in the changed scenario in social life over the last two decades while formulating the policies including multidimensional programs to address the structural roots of violence. To be precise, in case of protecting civil rights of underprivileged and prevention of atrocities against them needs a reconsideration in the backdrop of experiences of implementation of prevention of atrocities act over the last two decades. Movements coercing the state to discharge its duties in true constitutional spirit needs to be built up. And such movements shall be in a position to address and accommodate the multidimensional aspirations of the constituent participants.

Wednesday, January 13, 2010
భాషాప్రయుక్త రాష్ట్రాలు: చారిత్రక నేపథ్యం
Published in Marxistu, CPI(M) AP State Committee's Theoretical Monthly in January 2010
ఫజుల్ ఆలీ సంఘం నివేదిక 371 పేరాగ్రాఫ్‌లో ''తెలంగాణాతో కలిపి విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తే తెలుగు మాట్లాడే 3.20 కోట్ల మంది ప్రజలతో కూడిన విశాల రాష్ట్రం ఒకే పరిపాలనా యూనిట్‌గా ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రానికి అవసరమైన ఇంధన, జల వనరులు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. అవసరమైనంత స్థాయిలో ఖనిజవనరుల సంపద అందుబాటులో ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటున్న రాజధాని సమస్య కూడా పరిష్కారమవుతుంది. హైదరాబాద్, సికిందరాబాద్‌లతో కూడిన జంట నగరాలు విశాలాంధ్ర రాజధానిగా ఏర్పాటుచేయటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు'' అని అభిప్రాయపడింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలతో రాష్ట్రం గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో రాజ్యాంగ సంక్షోభం అంచులకు చేరింది. తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ అనుసరించిన విధానాలు రాష్ట్ర ప్రజల మధ్య దీర్ఘకాల ప్రభావం చూపించే అఘాతాన్ని సృష్టిస్తున్నాయి. రాష్ట్రం ఒకవైపున ప్రత్యేక తెలంగాణ వాదులు, మరోవైపున సమైక్య ఆంధ్రప్రదేశ్ వాదుల నడుమ కొట్టుమిట్టాడుతోంది. మధ్యలో కేంద్రం నుండి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు మరో సంఘాన్ని నియమించాలన్న ప్రతిపాదలు వినవస్తున్నాయి. మీడియాలో సైతం భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి చర్చ జరుగుతోంది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాథమిక పునాది గురించే ప్రశ్నలు లేవనెత్తబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల వాస్తవిక చరిత్రను గుర్తు చేసుకోవటం తాజా పరిణా మాలపై అవగాహనతో కూడిన నిర్ణయం తీసుకోవటానికి దోహదం చేస్తుంది.
భారతదేశంలో భాష, భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్య నేటిది కాదు. దీనికి దాదాపు వంద సంవత్సరాల చరిత్ర ఉంది. 1894లోనే వలసపాలకులు ప్రాంతీయ భాషల్లో భావప్రక టనా స్వేచ్ఛకు వ్యతిరేకంగా చట్టం చేశారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో పెద్దఎత్తున ఆందోళనలు సాగాయి. అప్పటికే యూరోపియన్ దేశాల ప్రజలను ఏకం చేయటం లోనూ, ఇటలీ, జర్మనీ వంటి దేశాల ఏకీకరణ లోనూ భాష పోషించిన పాత్ర గురించి తెలుసు కున్న తొలితరం స్వాతంత్య్రోద్యమ నేతలు భారత స్వాతంత్య్రోద్యమంలో భాషల విలువ తెలుసుకున్నారు. యూరోపియన్ దేశాల్లో భాషల ఆధారంగా ఏర్పడిన దేశాలు పెట్టుబడిదారీ వ్యవస్థకు అవసరమైన విశాలమైన మార్కెట్లను అందుబాటులోకి తెచ్చాయి. అదేసమయంలో భాషకు ఉండే ప్రజాతంత్ర స్వభావం కూడా ఆ సమయంలోనే వెల్లడైంది. ఒక దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలను సమకా లీన రాజకీయ ఆర్థిక వ్యవస్థలకు వ్యతిరేకంగా సమీకరించటంలో భాష ప్రధాన సాధనంగా ఉపయోగపడింది.
19వ శతాబ్దం చివర్లో ఫ్రాన్స్, జర్మనీ, ఇంగ్లాండ్‌లలో జరిగిన ప్రజా తంత్ర పోరాట లక్ష్యాలను విస్తృతంగా ప్రచారం చేయటంలో ప్రజాదరణ పొందిన భాష, అటువంటి భాష మాట్లాడే ప్రజానీకం ఒకే ప్రాంతంలో నివశించటం ముఖ్యమైన కారణా లుగా ఉన్నాయి. భారత స్వాతంత్య్రోద్యమంలో భాష ప్రాధాన్యత, అది నిర్వహించగలిగిన పాత్రను గుర్తించటమే కాదు వలస ప్రభుత్వం భారతదేశాన్ని భాషల ప్రాతిపదికన పునర్విభ జించాలని ప్రతిపాదించిన మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు భాలగంగాధర్ తిలక్ అని చెప్పవచ్చు. 1891లో ఆయన కేసరి పత్రికలో ''ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిపాలనా విభాగాలు నిర్దిష్ట చారిత్రక క్రమం నేపధ్యంలో ఉనికిలోకి వచ్చినవై యుండాలి. లేదా పూర్తిగా కాకతాళీయంగా తెరమీదకు వచ్చిన వైనా అయి ఉండాలి. ప్రస్తుతం ఉన్న ప్రావిన్సు లను భాషల ప్రాతిపదికన విభజిస్తే ఆయా ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య సారూప్యత ఉండటమే కాదు తమతమ భాషలను అభివృద్ది చేసుకోవటానికి అవసరమైన ప్రోత్సాహం కూడా ప్రజలకు అందుతుంది'' అని రాశారు.
1905లో లార్డ్ కర్జన్ అప్పటి బెంగాల్ రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించినప్పుడు కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాల భావన భారత రాజ కీయాల్లో కేంద్ర స్థానానికి చేరలేదు. పైన చెప్పుకున్నట్లు భాషకున్న ప్రజాతంత్ర లక్షణం, రాజకీయ సమీకరణలపై దాని ప్రభావం గురించి వలసపాలకులకు అప్పటికే అవగాహన ఉంది. యూరప్‌లో దేశాలు ఎదుర్కొన్న పరిస్థితులు భారతదేశంలో పునరావృతం కారాదన్న నిర్ణయా నికి వచ్చారు. అందువల్లనే భారతదేశంపై సంపూర్ణాధికారం సాధించిన తర్వాత కూడా బ్రిటిష్ పాలకులు రాష్ట్రాలను ఏర్పాటు చేయటంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ బహుళ భాషలు మాట్లాడే ప్రజానీకం సహజీవనం సాగించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మద్రాసు ప్రెసిడెన్సీ, బొంబాయి ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రావిన్స్, నేటి పాకిస్తాన్‌లోని వాయువ్య ప్రావిన్సు, అవిభవిక్త సెంట్రల్ ప్రావిన్సులు ఈ విధంగా తెరమీదకు వచ్చినవే. 1903లో అప్పటి హౌంమంత్రి హెచ్ ఎస్ రిజ్లీ బెంగాల్లో వెల్తువెత్తుతున్న స్వాతంత్య్రో ద్యమ కాంక్షను అణగ దొక్కాలంటే భాష ద్వారా సమీకృతం చేయబడ్డ రాష్ట్రాన్ని విడగొట్టటం తప్ప మరో మార్గం లేదని బ్రిటన్ పార్లమెంట్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఈ ఆలోచన 1905కి గానీ ఆచరణరూపం దాల్చలేదు.
ఫలితంగా ఒకే భాష మాట్లాడే విశాల వంగ దేశం ముస్లిం లు అధికంగా ఉన్న తూర్పు బెంగాల్, హిందు వులు అధికంగా ఉన్న పశ్చిమబెంగాల్‌గా విభజితమైంది. నాటి నుండీ వలసపాలకుల విభజించు పాలించు సూత్రం గురించి భారతీ యులకు సుపరిచితమే. ఈ చర్య వలసవాద వ్యతిరేకతను సామాన్య ప్రజల వరకూ విస్తరిం చటంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాదు. భాషా పరంగా ప్రజలు ఏకం కావాలన్న ఆలో చనను కూడా ముందుకు తెచ్చింది. బెంగాల్ ఏకీకరణ కోసం సాగిన ఉద్యమం అనతి కాలం లో తూర్పు భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల డిమాండ్లను ముందుకు తెచ్చింది. ఈ మార్పును గమనంలోకి తీసుకున్న జాతీయ కాంగ్రెస్ 1905లో కలకత్తాలో జరిగిన వార్షిక సమావేశాల్లో ఆమోదించిన తీర్మానం కర్జన్ నిర్ణయాన్ని వ్యతిరేకించటమేకాదు. ''ఈ మహాసభ పరిపాలన సౌలభ్యంతో పాటు బెంగాలీ భాష మాట్లాడే ప్రజలందరినీ ఒకే పరిపాలనా విభాగంగా ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేస్తోంది'' అని ప్రకటిం చింది.
చివరికి వలసపాలకులు బెంగాల్ విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా ఉద్యమం ఒత్తిడి తెచ్చింది. అయితే అదేసమయంలో అవిభక్త వంగ దేశం నుండి అస్సాం, ఇతర ఈశాన్య ప్రాంతాలను ఒక రాష్ట్రంగానూ, బీహార్, ఒరిస్సా లతో కూడిన ప్రాంతాలను మరో రాష్ట్రంగానూ విభజిస్తూ వలస ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఆ విధంగా భారతదేశంలో 1911లో తొలి సారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉనికిలోకి వచ్చాయి. ఇదేసమయంలో 1916లో లక్నోలో జరిగిన వార్షిక సమావేశాల్లో జాతీయ కాంగ్రెస్ సమాఖ్య వాదాన్ని ఆమోందించటంతో అటు వంటి పలు రాష్ట్రాలు ఏర్పాటు చేయాల్సి అవస రం గురించి చర్చ జరిగింది. పలు ప్రాంతాల వారు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాం డ్‌ను కాంగ్రెస్‌లో వినిపించారు. 1917 ఏప్రిల్ 8న లక్నో మహాసభల తీర్మానాన్ని అనుసరించి మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు మాట్లాడే ప్రజలను వేరు చేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కాంగ్రెస్ ముందుకు తెచ్చింది. అదేవిధంగా భాషాప్రయుక్త రాష్ట్రాల సమస్యను జాతీయ రాజకీయ సమస్యగా మలచటంలో హౌంరూల్ ఉద్యమం కూడా ముఖ్యమైన పాత్ర పోషించింది. 1917లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన అనిబీసెంట్ ''సాధ్యమైనంత త్వరలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాలను భాషల ప్రాతిపదికన విభజించాల''ని డిమాండ్ చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో 1920లో నాగ పూర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాల్లో భాష ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్విభజించటం స్వాతంత్య్రోద్యమ లక్ష్యాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ తీర్మానం పర్యవ సానంగానే తొలుత కాంగ్రెస్ పార్టీ, తర్వాత కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్ర స్థాయిలో తమ తమ సంస్థాగత కార్యకలాపాలకు శ్రీకారం చుట్టాయి. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ కార్యక్రమాలు దిగువ స్థాయిలో మాతృభాషలో ప్రజలను సమీకరించ టంలో ముఖ్య పాత్ర పోషించాయి.ఈ విధంగా భారతదేశంలో పెరుగుతున్న సమాఖ్య తత్వం నేపథ్యంలో బ్రిటిష్ పార్లమెంట్ 1927లో జాన్ సైమన్ నేతృత్వంలో రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన పునర్విభజించటానికి అవసరమైన చట్టబద్ధమైన కమిషన్‌ను నియమిం చింది. (స్టాట్యుటరీ కమిషన్ ఆన్ లింగ్విస్టిక్ రీ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రావిన్సెస్) పేరుతో ఇది పేరుకెక్కింది.
ఈ కమిషన్ 1928లో సమర్పిం చిన తన నివేదికలో ''రాష్ట్రాలను పునర్విభ జించటానికి భాష ఏ మాత్రం ప్రాతిపదిక కాకూడదు'' అని స్పష్టం చేసింది. తదనంతరం స్వాతంత్య్రోద్యమంలో పలు ధోరణులకు ప్రాతి నిధ్యం వహించే మోతీలాల్ నెహ్రూ, సుభాష్ చంద్ర బోస్, సర్ ఆలీ ఇమామ్, సర్ తేజ్ బహదూర్ సప్రూ, జవహర్లాల్ నెహ్రూ తది తరులతో కూడిన నెహ్రూ కమిటీ ప్రతిపా దించిన రాజ్యాంగంలో స్వాతంత్య్రానంతరం భాషల ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజన చేస్తుందని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ నెహ్రూ కమిటీ ''పాక్షికంగా భౌగోళిక పరిస్థితులు, పాక్షికంగా ఆర్థికాభివృద్ధి రాష్ట్రాల ఏర్పాటుకు ప్రాతిపదికగా ఉండాలి. కానీ ఒకే భాష మాట్లాడే ప్రజలు ఒకే ప్రాంతంలో నివసించటం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ప్రధాన ప్రాతిపదికగా ఉండాలి. అందువల్ల రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన పునర్విభజించటం అవసరం'' అని వివరించింది. దాంతో దిగువ స్థాయిలో ఈ నినాదం పెద్దఎత్తున ప్రజలను కదిలించే నినాదంగా మారింది.
''ఈ సూత్రాన్ని కాంగ్రెస్ అధికారికంగా ఆమోదించింది. ఎన్ని కల ప్రణాళికలో చేర్చింది. 1947 నవంబరు 27న రాజ్యాంగ పరిషత్తులో ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ భారత ప్రభుత్వం తరపున రాష్ట్రాల పునర్విభజనకు భాష ప్రాతిపదిక అన్న సూత్రాన్ని అంగీకరిస్తున్నట్లు ప్రకటించారు'' అని రాజ్యాంగ పరిషత్ సభ్యుడు, ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు బి. శివరావు రాశారు. అంబేద్కర్ మార్గదర్శ నంలో ఈయనే మన రాజ్యాంగంలో అత్యధిక భాగానికి అక్షర రూపం ఇచ్చారు.
మరోవైపున రెండో ప్రపంచ యుద్ధా నంతరం దేశానికి స్వాతంత్య్రం రానుందన్న వాతావరణం నెలకొనటంతో దక్షిణ భారత దేశంలో విశాలాంధ్ర, ఐక్య కేరళ, సంయుక్త మహారాష్ట్ర నినాదాలతో పెద్దఎత్తున ప్రజా ఉద్యమం సమాంతరంగా ముందుకు వచ్చింది. ఈ ఉద్యమాలకు భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రయోజనాలను కమ్యూనిస్టు పార్టీ పెద్దఎత్తున ప్రజల వద్దకు తీసుకెళ్లింది.
తెలుగు భాష మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం అన్న సమస్య జాతీయ రాజకీయ ఎజెండాలో నిరంతరం కీలక స్థానాన్ని ఆక్రమిస్తూ వచ్చింది. చివరకు రాజ్యాంగ పరిషత్తులో కూడా ఆంధ్రప్రాంతానికి ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వాలన్న ప్రతిపాదన కేరళ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ఏర్పాటు డిమాండ్ల గురించి అధ్యయనం చేసేందు కు రాజ్యాంగ పరిషత్తు ఒక కమిటీని నియమిం చేందుకు దారితీసింది. ఆ విధంగా తెరమీదకు వచ్చిందే ధర్ కమిషన్. భాషా ప్రయుక్త రాష్ట్రాలకోసం జరుగుతున్న డిమాండ్లు చివరకు దేశాన్ని ముక్కలు చేస్తాయన్న వాదన ముందుకు తెచ్చారు. దాంతో ధర్ కమిటీ 1948 డిశంబరు 10న సమర్పించిన తన నివేదికలో ''భాష ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పడటం భారతదేశ ప్రయోజనాలకు భంగకరం. అందువల్ల ఈ ఎజెండాను ఇప్పట్లో చేపట్టరాదు'' అని సిఫారసు చేసింది. అంతేకాదు. ''సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పడిన ద్విభాష జిల్లాలు తమకంటూ విలక్షణ మైన ఆర్థిక జీవన శైలిని ఏర్పరచుకున్నాయి. వీటిని విడదీయటం సరికాదు. వాటి ప్రత్యేక అవసరాలు, ప్రయోజనాలను గమనంలోకి తీసుకోవాలి'' అని ప్రకటించటం ద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు శాశ్వత అవరోధాన్ని సృష్టించింది.
భవిష్యత్తులో అభివృద్ధి చేయటానికి గల అవకాశాలు, భౌగోళిక సామీప్యత, ఆర్థిక సామర్థ్యం, పరిపాలనా సౌలభ్యం ప్రాతిపదికగా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ధర్ కమిటీ తీర్మానించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నెహ్రూ, వల్లభాయి పటేల్, పట్టాభి సీతారా మయ్యలతో కూడిన జెవిపి కమిటీని నియమించి భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్యపై నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ కమిటీ దేశవిభజన అనంతరం నెలకొన్న పరిస్థితులను గమనంలోకి తీసుకుని భద్రత, ఐక్యత, ఆర్థిక సాఫల్యత ఆధారంగా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని, అంతే తప్ప భాష ఒక్కటే రాష్ట్రం ఏర్పాటుకు ప్రామాణి కంగా ఉండకూడదని ప్రతిపాదించింది. తద్వా రా స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలోతొక్క టానికి రంగం సిద్ధం చేసింది. అంతేకాదు సర్దార్ పటేల్ మాటల్లో ''ఈ విధంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయటం భారతదేశం ఒక జాతిగా ఎదగటానికి ఆటం కంగా మారుతుంది'' అని ఆందోళన కూడా వ్యక్తం చేసింది.
ఇదే సమయంలో మరోవైపున తెలుగు ప్రజలు ఆంధ్ర రాష్ట్రం కోసం, నిజాం సంస్థా నంలో ఆంధ్రమహాసభ పేరుతో వెట్టి, భూస్వా మ్య వ్యవస్థల దోపిడీకి వ్యతిరేకంగా మహౌధృత పోరాటం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదరుగా పడి ఉన్న తెలుగు మాట్లాడే ప్రజలంతా ఒకే రాష్ట్రం - విశాలాంధ్రగా ఏర్పాటు చేయాలన్న నినాదం ఆంధ్రమహాసభ నినాదాల్లో అంతర్భాగం అయ్యింది. తెలంగాణా సాయుధ పోరాటం పురోగమించేకొద్దీ విశా లాంధ్ర ఉద్యమం కూడా ఊపందుకొంది. రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు వంటి కమ్యూనిస్టేతర ప్రముఖులు కూడా విశాలాంధ్ర నినాదాన్ని సమర్థించారు. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే పోలీసు యాక్షన్ తర్వాత నైజాం సంస్థానం భారతదేశంలో విలీనమయింది.
ఈ సంస్థానాన్ని మూడు భాగాలుగా విడదీసి తెలుగు మాట్లాడే ప్రాంతాలను హైదరాబాద్ రాష్ట్రంలో కలిపారు. అంతేకాదు వ్యక్తిగతంగా తన అభిప్రాయాలు వెల్లడించనప్పటికీ ముఖ్య మంత్రిగా 1953లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు దేభర్కు రాసిన లేఖలో తెలంగాణ ప్రాంతం విశాలాంధ్రలో కలవాలన్న డిమాండ్‌కు సమాం తరంగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగానే కొన సాగించాలన్న డిమాండ్ కూడా శక్తివంతంగా ఉందని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలోని భూస్వాములందరూ విశాలాంధ్ర నినాదాన్ని వ్యతిరేకంచటంలో ముందుపీఠిన నిలిచారు. తెలంగాణ సాయుధపోరాట ప్రభావం దీనికి తక్షణ కారణమని ప్రత్యేకంగా ప్రస్తావించన వసరం లేదు. చివరకు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ శాసనసభలో తీర్మానం ఆమోదించి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి మార్గం సిద్ధం చేశారు. ఈ విధంగా తెలంగాణా సాయుధ పోరాటం భూసంస్కరణలతో పాటు భాషా ప్రయుక్త రాష్ట్రాల సమస్యను సైతం జాతీయ ఎజెండాలోకి తేవటంలో జయప్రదం అయ్యింది.
విశాలంధ్ర ఏర్పాటులో కాంగ్రెస్ అనుస రించిన దాగుడుమూతలకు ఆ పార్టీ తొలి సార్వత్రిక ఎన్నికల్లో పెద్దఎత్తున మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఈ ఎన్నికలు జాతీయ రాజకీయాల్లో ప్రత్యేకించి రాష్ట్ర రాజకీయాల్లో కమ్యూనిస్టుల ప్రాభవానికి అద్దం పట్టాయి. తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులు గణనీయ సంఖ్యలో సీట్లు సాధించటంతో పాటు మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్రప్రాంతంలో మొత్తం 140 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ కేవలం 43 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాంతో మద్రాసు రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ, టంగుటూరి ప్రకాశం పంతులుతో చేతులు కలిపి ఐక్య ప్రజాతంత్ర సంఘటన- యుడిఎఫ్గా ఏర్పడ్డారు. ఈ కూటమి 163 సీట్లు గెల్చి ప్రకాశం పంతులును శాసన సభాపక్ష నేతగా ఎన్నుకొంది. కాంగ్రెస్ పార్టీ 152 సీట్లకు పరిమితం అయ్యింది. అయితే శాసనసభలో ఆధిక్యత ఉన్న యుడిఎఫ్‌ను పక్కన పెట్టి కాంగ్రెస్‌కు చెందిన రాజగోపాలాచారిని ముఖ్యమంత్రిగా నియమించింది. ఈ అప్రజాస్వా మిక చర్యను అంగీకరించలేని తెలుగు ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తిరిగి ఉద్యమం ప్రారంభించారు.
ఈ ఉద్యమానికి మద్దతుగా 1952 జూలై 16న పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న పుచ్చలపల్లి సుందరయ్య ఒక అనధికార చట్టాన్ని ప్రతిపాదిస్తూ ''ఇప్పుడున్న బహుళ భాషా రాష్ట్రాల కంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేస్తేనే భారతదేశం మరింత ఐక్యంగా ఉంటుంది. ఈ డిమాండ్లు అంగీకరించకపోతే పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. తాత్కాలి కంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం డిమాం డును అంగీకరించినంత మాత్రాన సరిపోదు. నా మిత్రుడు కోటంరాజు రామారావు గారు అభిప్రాయపడినట్లుగా హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడేవరకు మేము విశ్రమించేది లేదు'' అన్నారు. నెహ్రూ వ్యక్తం చేసిన ఆందోళనకు సుందరయ్య సమాధానమిస్తూ ''భాషా ప్రయుక్త రాష్ట్రాలు ప్రభుత్వం భావిస్తున్న ట్లుగా జాతీయ సమైక్యతకు ముప్పు కాదు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు నిజానికి జాతీయ సమైక్యత, సమగ్రత, భద్రతలను మరింత పటిష్టపర్చగలవు'' అని కూడా వివరించారు. కానీ నెహ్రూ ఈ ప్రతిపాదనలను అంగీకరించకుండా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని పార్లమెంట్లో సమాధానమిచ్చారు.
ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ వాదుల్లో సైతం నిరాశ, ఆగ్రహాలకు కారణం అయ్యాయి. నెల్లూరు జిల్లాకుచెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు పొట్టి శ్రీరాములు తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష సాగించి అమరులయ్యారు. దాంతో ఒక్కసారిగా తెలుగు ప్రజలు అగ్రహౌ దగ్రులయ్యారు. మద్రాసు, సర్కారు, సీడెడ్ జిల్లాల్లో ఉద్యమం తారాస్థాయికి చేరింది. చివరికి కేంద్ర ప్రభుత్వం తెలుగు మాట్లాడే ప్రజలున్న జిల్లాలను వేరు చేసి ఆంధ్రరాష్ట్రంగా ప్రకటించేందుకు సిద్ధమైంది. 1952 సెప్టెంబరు 2న ఆంధ్రరాష్ట్రం ఏర్పాటుకు అవసరమైన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్దింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ బిల్లులో భాషా ప్రయుక్త రాష్ట్రం అన్న పదాన్ని వాడకుండా జాగ్రత్త పడింది. ఈ బిల్లును సమర్థిస్తూ రాజ్యసభలో మాట్లాడిన సుందరయ్య నెహ్రూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ''30 ఏళ్ల అనుభవం తర్వాత కూడా భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు అన్న సూత్రాన్ని తిరస్కరించటం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్‌ను తిరస్కరించబూనుకొంటోంది.
ప్రజలు మాత్రం భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవటంలో జయప్రదం అవుతారు. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం మరో సంఘం నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ప్రభుత్వం ముందున్న సమస్య అక్టోబరు 1 నుండి ఆంధ్రరాష్ట్రం ఉనికిలోకి వస్తుందని ప్రకటించటమా లేదా అన్నదొక్కటే. మరే హామీ ఈ సమస్యను పరిష్కరించటానికి సరిపోదు'' అన్నారు. చివరిగా నెహ్రూ 14 జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం ఉనికిలోకి వస్తున్నట్లుగా లోక్‌సభలో ప్రకటించారు. ఆ విధంగా అక్టోబరు 1న కర్నూలు రాజధాని, గుంటూరు హైకోర్టుతో ఆంధ్రరాష్ట్రం అవతరించింది. ఆంధ్రరాష్ట్రా వతరణ విశాలాంధ్ర ఉద్యమానికి మరింత బలం చేకూర్చింది. మరోవైపున కేరళ, మైసూరు, ముంబయి ప్రాంతాల్లో కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ పతాక స్థాయికి చేరింది. ఈ ఉద్యమంలో భాగంగానే సుందరయ్య విశాలాంధ్రలో ప్రజారాజ్యం అన్న నినాదం ఇచ్చారు. ఈ నినాదాన్ని సమర్థిస్తూ దానికి అవసరమైన వాదనలను తన విశిష్టరచనలో ప్రస్తావించారు. ఈ వాదనలకు అనుగుణంగానే 1956 ఏప్రిల్ 19-29 వరకూ పాల్ఘాట్లో జరిగిన నాల్గో జాతీయ మహాసభల్లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానంలో ''భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రజా జీవనం మెరుగుపర్చుకోవటానికే కాదు. ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే కర్తవ్యంలో అంతర్భాగం కూడా'' అని పేర్కొంది. అంతేకాదు ''ఏ పరిస్థితుల్లోనూ ప్రజలు భాష కారణంగా విడిపోరాదు. ఇటువం టి విచ్ఛిన్నకర చర్యలు భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్‌ను బలహీనపర్చటమే కాదు ఆర్థిక, ప్రజాస్వామ్య అభివృద్ధికి అవసరమైన ప్రజల ఐక్యతకు కూడా భంగం కలిగిస్తాయి'' అని కూడా హెచ్చరించింది.
న్యాయశాఖ మంత్రిగా భాషా ప్రయుక్త రాష్ట్రాలను వ్యతిరేకించిన రాజ్యాంగ నిర్మాత బి. ఆర్. అంబేద్కర్ సైతం 1956 నాటికి తన అభిప్రాయం మార్చుకుని ఈ డిమాండ్లను బలపరిచారు. 1955 డిసెంబరులో రాసిన ''భాషా ప్రయుక్తరాష్ట్రాలపై నా అభిప్రాయాలు'' అన్న రచనలో ''బహుళ భాషా రాష్ట్రాలు అన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి. ప్రతి రాష్ట్రం ఒకే భాష మాట్లాడే ప్రాంతంగా ఉండాలి. ఎక్కడైతే ఈ సూత్రాన్ని అమలు చేయటంలో విఫలం అయ్యారో ఆయా దేశాల న్నింటిలో రాజ్యం ఉనికికే ముప్పు వచ్చింది. బహుళ భాషా రాష్ట్రాలతో నిండిన టర్కీ సామ్రాజ్యం గానీ, ఆస్ట్రియన్ సామ్రాజ్యం గానీ దీర్ఘకాలం మనుగడ సాగించలేకపోయాయి. ఈ సామ్రాజ్యాలు పతనం కావటం వెనక గల ప్రధాన కారణాల్లో బహుళ భాషా రాష్ట్రాలు ఒక కారణం. భారతదేశం ఇప్పుడున్న పరిస్థితి, బహుళ భాషా రాష్ట్రాల సమాఖ్యగా కొనసాగితే అటువంటి ముప్పును ఎదుర్కొనే సమస్య ఉంది'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
అప్పటికే నెహ్రూ ప్రభుత్వం పెరుగుతున్న ప్రజా ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఫజుల్ ఆలీ నేతృత్వంలో రాష్ట్రాల పునర్య్వవస్థీకరణ సంఘాన్ని నియమించింది. ఈ సంఘం భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్లను పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ఆంధ్ర, తెలంగాణా, విశాలాంధ్రల గురించి ప్రధాన భాగం కేటాయించింది. ఫజుల్ ఆలీ సంఘం నివేదిక 369-389 పేరాల్లో విశాలాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల గురించి విపు లంగా పరిశీలించి ఈ క్రింది నిర్ధారణలకు వచ్చింది. రాష్ట్రాల పునర్య్వవస్థీకరణ సంఘం మాటల్లోనే విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు ఈ విధంగా ఉన్నాయి.
371 పేరాగ్రాఫ్‌లో ''తెలంగాణాతో కలిపి విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేస్తే తెలుగు మాట్లాడే 3.20 కోట్ల మంది ప్రజలతో కూడిన విశాల రాష్ట్రం ఒకే పరిపాలనా యూనిట్‌గా ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రానికి అవసరమైన ఇంధన, జల వనరులు పుష్కలంగా అందుబా టులో ఉంటాయి. అవసరమైనంత స్థాయిలో ఖనిజవనరుల సంపద అందుబాటులో ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటున్న రాజ ధాని సమస్య కూడా పరిష్కారమవుతుంది. హైదరాబాద్, సికిందరాబాద్‌లతో కూడిన జంట నగరాలు విశాలాంధ్ర రాజధానిగా ఏర్పాటు చేయటం ద్వారా ఈ సమస్యను పరిష్కరించ వచ్చు'' అని అభిప్రాయపడింది. అంతేకాదు ఈ నివేదిక ''ఇరు ప్రాంతాల ప్రజలు దీర్ఘకాలం సంస్థలు, వ్యవస్థలతో తమ జీవితాలు ముడివేసుకుని ఉన్నందున ఇంతకంటే బలమైన ప్రత్యేక కారణం ఉంటే తప్ప విశాలాంధ్ర నినాదాన్ని అంగీకరించకపోవటానికి ప్రత్యేక కారణం ఏమీ కనిపించటం లేదు'' అని కూడా ప్రకటించింది. అంతటితో ఆగలేదు ''విశాలాంధ్ర ఏర్పాటు చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. కృష్ణా, గోదావరి నదీపరివాహక ప్రాంతాలు ఒకే నియంత్రణ కిందకు తేవటం, రెండు ప్రాంతాల మధ్య ఉన్న వాణిజ్య సంబంధాలు, హైదరాబాద్ ఉభయులకూ ఆమోదయోగ్యమైన రాజధాని కావటం, ఇవి క్లుప్తంగా ప్రయోజనాలు అని చెప్పవచ్చు.'' అని నివేదిక 381 పేరాగ్రాఫ్‌లో స్పష్టంగా చెప్పింది.
అంత మాత్రాన ఫజల్ ఆలీ సంఘం తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పకూడదు. ''ప్రత్యేక తెలంగాణా నినాదం'' అన్న శీర్షిక కింద విశాలాంధ్ర ఏర్పాటుకు ఎదురయ్యే అవరోధాల గురించి కూడా వివరంగా పేర్కొంది. ''ఎన్ని వివరణలు ఇచ్చినా కొందరు తెలంగాణ ప్రాంత నేతల్లో ఆందోళనలు తొలగిపోలేదు. ఈ విలీనం వల్ల తెలంగాణ ప్రాంతంలో ఉన్న అధిక ఆదాయ వనరులను మిగిలిన ప్రాంతంలో పంచుకోవాల్సి వస్తుంది. ఈ ఆదాయంతోనే అభివృద్ధి పథకాలకయ్యే ఖర్చును భరించవచ్చు. ఈ విలీనం నేడు ఆంధ్రరాష్ట్రం ఎదుర్కొంటున్న తరహాలో ఆర్థిక అస్థిరత్వానికి దారితీయవచ్చు''(పేరా 376) ''కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ ప్రాంతానికి ప్రస్తుతం ఉన్న ప్రత్యేక హక్కులు వదులుకోవటానికి ఈ ప్రాంతం సిద్దంగా లేదు'' ( పేరా 377). ''మరోవైపున తెలంగాణ ప్రాంతం విద్యాపరంగా వెనకబడటం ఈ విలీనాన్ని వ్యతిరేకించటం వెనక ఉన్న కారణాల్లో ఒకటి'' ( పేరా 378). అదే సమయంలో ఈ నివేదిక వివిధ ప్రాంతాల ప్రజల్లో ఉన్న అపోహల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రాంత ప్రత్యేక ప్రయోజనాల పరిరక్షణకు చర్యలు తీసుకోవ టంలో విఫలం అయ్యేట్లయితే ప్రత్యేక తెలం గాణా రాష్ట్రం సిఫార్సు చేయటానికి వెనకాడ బోము'' అని కూడా నివేదిక హెచ్చరింది.
ఫజుల్ ఆలీ నేతృత్వంలోని రాష్ట్రాల పునర్య్వవస్థీకరణ సంఘం ఉభయ ప్రాంతాల వాదనలు, వాటి సమంజసత్వం వేర్వేరుగా పేర్కొన్నప్పటికీ చివరికి విశాలాంధ్రకు అనుకూ లంగా తన నిర్ధారణ ఇస్తూ ''ప్రస్తుతానికి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు వేర్వేరు రాష్ట్రాలుగానే కొనసాగుతూ మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రాలు విలీనం కావటానికి అవకాశాలు అట్టేపెట్టుకోవాలి. అది కూడా రెండు శాసనసభల్లో మూడింట రెండువంతుల మెజారిటీతో తీర్మానం ఆమోదించిన తర్వాతనే'' అని చెప్పింది. ఈ తరహా ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను కూడా విపులీకరిస్తూ తన నివేదికలో ఫజల్ ఆలీ సంఘం ''ఐదారేళ్లలలో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలు విలీనం కావటా నికి ఉన్న అవకాశాలు ఏమీ తగ్గిపోవు. ఈ కాలంలో రెండు ప్రభుత్వాలూ తమ పరిపాలనా వ్యవస్థలను స్థిరీకరించుకోవటానికి కృషి చేయ వచ్చు. రెండు ప్రాంతాల్లో వేర్వేరుగా ఉన్న లాండ్ రెవిన్యూ వ్యవస్థను కూడా అవసరమనుకుంటే సమీక్షించుకోవచ్చు. రెంటిమధ్య సారూప్యత సాధించ వచ్చు. ఈ రెండు ప్రారతాల ప్రజల్లో అక్కడక్కడా ఉన్న భేదాభిప్రాయాలు, ఆందోళ నలను తొలగించటానికి కూడా ఈ కాల వ్యవధి ఉపయోగపడుతుంది. ఒకసారి అటువంటి ఆందోళనలు తొలగిపోతే విలీనం శాశ్వతమవు తుంది'' అని ప్రకటించింది. ఈ విధంగా రాష్ట్రా ల పునర్య్వవస్థీకరణ సంఘం అన్ని అవకాశా లు, మార్గాలు సూచించింది. విశాలాంధ్ర ఏర్పా టుకు అవసరమైన భూమిక సిద్ధం చేయా ల్సిన బాధ్యత పాలకులపైనే ఉందని స్పష్టం చేసింది.
కానీ ఈ దూరదృష్టితో కూడిన కమిషన్ నివేదికను పక్కన పెట్టి నెహ్రూ ప్రభుత్వం తెలంగాణను శాశ్వతంగా ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని ప్రయత్నించింది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అప్పటి హైదరాబాద్ శాసనసభలో రాష్ట్రంలో గణనీయమైన సంఖ్యలో ఉన్న కమ్యూని స్టులు రాజీనామాలకు సిద్ధపడ్డారు. ఈ పరిస్థితు ల్లో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు శాసనసభలో తీర్మానం ఆమో దించటం ద్వారా హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్‌గా అవతరించటానికి మార్గం సిద్ధం చేశారు. ఆ విధంగా నవంబరు 1, 1956 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేయటంతో సంయుక్త మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల ఏర్పాటు గురించి కూడా సమరశీల పోరాటం ప్రారంభమైంది. ఈ ఉద్యమం వెనక ఉన్న బల మైన ప్రజాతంత్ర కోరిక, స్పూర్తిని గుర్తించ నిరాకరించిన కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున అణచివేతకు పూనుకొంది. బొంబాయిలో ఒక్క రోజులోనే 90 మంది ఆందోళనకారులు పోలీసు కాల్పుల్లో బలయ్యారు. బొంబాయిని ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలన్న నెహ్రూ ఆలోచననను బూర్జువావర్గం సమర్థించింది. స్వాతంత్య్రానంత రం రాజకీయ రాజధాని ఢిల్లీ అయినా ఆర్థిక రాజధానిగా బొంబాయి అవతరించిన విషయం తెలిసిందే. బొంబాయి ప్రత్యేక రాష్ట్రంగా ఉంటే తమ ఆర్థిక వాణిజ్య ప్రయోజనాలకు మెరుగైన రక్షణలుంటాయని ఈ వర్గం భావించింది. మహారాష్ట్ర, గుజరాత్ల సమస్య పరిష్కారం అయిన తర్వాత పంజాబ్ సమస్య జాతీయ రాజకీయాల్లో ముఖ్య సమస్యగా ముందుకు వచ్చింది. హర్యానా, పంజాబ్‌లను వేర్వేరు రాష్ట్రాలుగా చేయాలన్నది అక్కడి ప్రజల డిమాండ్. 1968లో శ్రీనగర్‌లో జరిగిన జాతీయ సమగ్రతా మండలి సమావేశాల్లో మాట్లాడుతూ అప్పటి సిపిఐ(ఎం) ప్రధాన కార్య దర్శి పుచ్చలపల్లి సుందరయ్య రాష్ట్రాల పునర్య్వ వస్థీకరణ సమస్యను ఒక కొలిక్కి తేవటంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తాత్సార వైఖరిని దుయ్యబట్టారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం జరుగుతున్న ఉద్యమాలను కులతత్వం, మతత త్వంతో కూడిన ఉద్యమాలతో జతకట్టి జాతీయ సమగ్రతకు ప్రమాద చిహ్నాలుగా చూపించేందుకు జరిగిన ప్రయత్నాల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈశాన్య ప్రాంత రాష్ట్రాలను కూడా పునర్య్వవస్థీకరించాలన్న డిమాండ్‌ను ముందుకు తెచ్చారు. చివరకు 70 దశకంలో ఈశాన్య రాష్ట్రాలను భాష, జాతుల ఆధారంగా పునర్య్వ వస్థీకరించటంతో భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ముగింపుకు వచ్చింది.

Tuesday, January 12, 2010
సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు సవాళ్లు విసిరిన దశాబ్దం
ప్రపంచం నూతన సహస్రాబ్దంలో రెండో దశకంలో ప్రవేశించింది. తొలి దశాబ్దం చివరి కాలం పెట్టుబడిదారీ వ్యవస్థ కనీ వినీ ఎరుగని సంక్షోభంతో ముగిసింది. గత సంవత్సర కాలం నుండీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ సంక్షోభం నుండి విముక్తి దిశగా సాగుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అయితే వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం తాజా సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా 61 మిలియన్ల మందిని నిరుద్యోగ సైన్యంలో జత చేయగా, 2009 చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా 214 మిలియన్ల నుండి 241 మిలియన్ల మధ్య నిరుద్యోగ సైన్యం ఉందని అంచనా వేసింది. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల సంస్థ (ఒఇసిడి) నిర్వహించిన సర్వేలో 2009 చివరి నాటికి సభ్య దేశాల్లో నిరుద్యోగం 9 శాతానికి పైగానే ఉన్నట్లు నిర్ధారించింది. ఒఇసిడి దేశాలకు నాయకత్వం వహిస్తున్న అమెరికాలో నిరుద్యోగం 16 శాతం వరకూ ఉంటుందని అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలే అంచనా వేస్తున్నారు. అమెరికా ప్రభుత్వమే తమ దేశంలో నిరుద్యోగం 10 శాతం ఉందని అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటికే నిరుద్యోగ భృతి కోసం వెచ్చిస్తున్న నిధులు సరిపోవటం లేదని రాష్ట్ర ప్రభుత్వాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. జోసెఫ్ స్టిగ్లిట్జ్ లాంటి ప్రముఖ ఆర్థిక వేత్తలు అమెరికా ప్రభుత్వం మరో దఫా ఉద్దీపన వరాలు ప్రకటించకపోతే పెరుగుతున్న భారాన్ని తట్టుకోవటం సాధ్యం కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచబ్యాంకు తాజాగా 53 దేశాల్లో నిర్వహించిన మరో అధ్యయనంలో 2007లో 4.1 శాతంగా ఉన్న నిజవేతనాల వృద్ధి రేటు 2009 చివరి నాటికి 1.4 శాతానికి తగ్గిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా 100 బిలియన్ల మంది రోజూవారీ అర్థాకలితో కాలం వెళ్ల దీస్తున్నారు. అంతేకాదు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం రోజుకు 1.25 డాలర్ల ఆదాయం పొందలేని వారు కడుపేదల జాబితాలో ఉంటారు.
అటువంటి వారి సంఖ్య 1.4 బిలియన్లకు చేరిందని ఐరాసనే తేల్చి చెప్పింది. అంటే ప్రపంచ దేశాలు మిలీనియం లక్ష్యాల సాధనకు చాలా దూరంలో ఉన్నాయని ఈ వివరాలు రుజువు చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఉరుగ్వే ప్రధాని యోవెన్ ముసువేరి మాటల్లో ''ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నూతన సహస్రాబ్దిలో పాత వ్యవస్థే నూతన మార్గాల్లో తన ఆధిపత్యాన్ని కొనసాగించే దిశగా సాగుతోంది''. ఇదీ నూతన దశాబ్ధంలో ప్రవేశిస్తున్న ప్రపంచఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు. గతవారం చెప్పుకున్నట్లుగా నూతన దశాబ్దంలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేడు వర్ధమాన దేశాల నుండి రాజకీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోంటోంది. తాజాగా పెట్టుబడిదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఎదుర్కొంటున్న సైద్ధాంతిక సవాళ్లను కూడా ముందుకు తెచ్చింది.
గత దశాబ్దంలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఎదుర్కొంటున్న రాజకీయ సవాళ్లు లాటిన్ అమెరికా దేశాల రాజకీయ పరిణామాల్లో ప్రస్ఫుటం అయ్యాయి. సోషలిజానికి పెట్టని కోటగా ఉన్న క్యూబాకు తోడుగా దక్షిణ అమెరికా ఖండంలో వెనిజులా, బొలీవియా, చిలీ వంటి దేశాలు సామ్రాజ్యవాద ప్రపంచీకరణ మార్గం నుండి వైదొలగటమే కాదు. ఈ వ్యవస్థ పట్ల సమర్థవంతమైన విమర్శకు తెరతీయటం ద్వారా ప్రపంచీకరణపై సమగ్ర సైద్ధాంతిక దాడికి పూర్వరంగం సిద్ధం చేశాయి. దానికి తోడు నాలుగు దశాబ్దాల ప్రపంచీకరణ విధానాలు పెట్టుబడిదారీ వ్యవస్థను కోలుకోలేని లోతులకు నెట్టేశాయి. దాంతో పలు వర్ధమాన దేశాలు పెట్టుబడిదారీయేతర ఆర్థిక నమూనాల పట్ల, రెండో ప్రపంచ యుద్ధానంతరం తెరమీదకు వచ్చిన పలు ఆర్థికాభివృద్ధి నమూనాల పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. అంతేకాదు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు రాజకీయంగా ఊపిరి పోస్తున్న ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా ఈ కాలంలో సైద్ధాంతిక గందరగోళానికి లోనైంది.
ప్రజాస్వామిక ప్రభుత్వాలు లాటిన్ అమెరికాలో పురోగామి శక్తులకు ప్రాతినిధ్యం వహించటానికి బదులుగా పెట్టుబడిదారీ సైద్ధాంతిక, రాజకీయ, ఆర్థిక విధానాలను ముందుకు తీసుకెళ్లే సాధనంగా మారటంతో ఆయా దేశాల్లో ప్రజలు ప్రజాస్వామిక పద్ధతులనే ఉపయోగించుకుని ప్రత్యామ్నాయ మార్గాల వైపు నడవటానికి సిద్ధం అయ్యారు. దాంతో సామ్రాజ్యవాద దేశాలన్నీ ఏకంగా ప్రజాస్వామిక వ్యవస్థే ముప్పు ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశాయి. రెండేళ్ల క్రితం ఏకంగా ప్రధాని మన్మోహన్సింగ్, అమెరికా మాజీ అధ్యక్షులు బుష్‌ల సంయుక్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి సాక్షిగా ప్రకటించారు.
గత దశాబ్ద కాలంగా సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఎదుర్కొంటున్న ముప్పేట సవాళ్లను పరిష్కరించటంలో అంత సామర్థ్యం చూపలేకపోయినందున ఈ తరహా ప్రపంచీకరణకే పునాదులుగా నిలిచిన ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచవాణిజ్య సంస్థలు పెద్దఎత్తున సామ్రాజ్యవాద దేశాల నిర్లక్ష్యానికి గురయ్యాయి. దోహాలో ప్రపంచ వాణిజ్య సంస్థ పతనం మొదలు కాగా లాటిన్ అమెరికా దేశాలు ఐఎంఎఫ్ నిధులు నిరాకరించటం ద్వారా ఆయా సంస్థలకు సవాలు విసిరాయి. తాజాగా పెట్టుబడదారీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం నుండి వివిధ దేశాలు బయటపడటానికి అవసరమైన నిధులు సమకూర్చటంలో విఫలమైన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చివరకు తనవద్ద ఉన్న బంగారం నిల్వలను అమ్మి నిధులు సమీకరించుకోవాల్సిన దుస్థితికి చేరింది. దీనికి ముఖ్యమైన కారణం ఈ సంస్థలు సామ్రాజ్యవాద దేశాల ప్రయోజనాలకు సమర్థులైన బోయీలుగా వ్యవహరించలేకపోవటమే. అటువంటి పరిస్థితుల్లో సామ్రాజ్యవాద దేశాలు ఈ సంస్థలకు కేటాయించాల్సిన వార్షిక నిధులను కూడా సమకూర్చటానికి అమెరికా వంటి దేశాలు ముందుకు రావటం లేదు. దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తన పాత్రకు అనుగుణంగా జోక్యం చేసుకోవటానికి గాను ఐఎంఎఫ్ వంటి సంస్థలు తమ వద్ద ఉన్న బంగారం నిల్వలను అమ్ముకోవాల్సి వస్తే ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు దేశాలకు ఇచ్చే రుణాలను కుదించుకోవాల్సి వస్తోంది.
వర్ధమాన దేశాలు డబ్ల్యుటిఓలో ఇంతకాలంసంపన్న దేశాలు అనుసరిస్తూ వచ్చిన మాయోపాయాలు గుర్తించి వారికి దీటుగా ప్రత్యామ్నాయ వ్యూహరచన చేయటంతో అక్కడ కూడా సంపన్న దేశాల ఆటలు సాగటం లేదు. తన మాట నెగ్గకపోతే ఒప్పందమే అవసరం లేదన్న ధోరణిలో సామ్రాజ్యవాద దేశాలు ఒంటెత్తుపోకడకు పోవటమే దోహా దఫా చర్చలు దశాబ్దకాలం పలు దఫాల అధికారిక, అనధికారిక చర్చల తర్వాత కూడా ముగింపుకు రాలేకపోయాయి. పైన చెప్పుకున్నట్లే తాజా సంక్షోభంతో పలు దేశాలు ప్రత్యామ్నాయ ఆర్థికాభివృద్ధి నమూనాల వైపు దృష్టి మళ్లిస్తున్నాయి. అందులో భాగంగా పలు దేశాలు తమ తమ దేశాల్లో అంతర్గత మార్కెట్‌పై దృష్టి సారించటం, ప్రణాళికా వ్యవస్థలను పటిష్టం చేయటం వంటి చర్యలు చేపట్టాయి.
ఈ చర్యలు ఆయా వర్ధమాన దేశాల్లో జాతీయ బూర్జువావర్గం అంతర్జాతీయ స్థాయికి ఎదగటానికి పెద్దఎత్తున దోహదం చేస్తోంది. భారతదేశానికి చెందిన టాటా, బిర్లా, ఎయిర్టెల్, అంబానీ, స్టెరిలైట్ వంటి పలు గుత్త వాణిజ్య సంస్థలు అంతర్జాతీయ కంపెనీలతో పోటీపడగల స్థాయిలో బహుళజాతి కంపెనీలుగా ఎదిగాయి. గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాలను రెండు భాగాలుగా విడదీయవచ్చు. మొదటి 1991 నుండి 2000 వరకూ అమలు జరిగిన విధానాలు ప్రధానంగా దేశీయ గుత్తపెట్టుబడిదారుల వద్ద మూలుగుతున్న పెట్టుబడి నిల్వలను మార్కెట్లో వినియోగానికి తేవటానికి అవసరమైన విధానాలు కాగా 2000 తదనంతర కాలంలో అనుసరించిన విధానాలు మొదటి దశ విధానాలతో విపరీతంగా లాభాలు పెంచుకున్న దేశీయ గుత్తపెట్టుబడిదారులు అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశించటానికి అవసరమైన రంగాన్ని సిద్ధం చేసే దిశగా ఉన్నాయి.
ఈ రెండు దశల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించటానికి ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చల్లో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ఎత్తుగడలను పరిశీలిస్తే సరిపోతుంది. తాజా సంక్షోభం నేపథ్యంలో కూడా భారత ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక, ద్రవ్య విధానాలు ఈ రెండు దశల్లో ఉన్న వ్యత్యాసాలను మనముందుకు తెస్తున్నాయి. ఈ విధంగా గడచిన దశాబ్దం సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, పెట్టుబడిదారీ ఆర్థిక నమూనాలకు పెనుసవాళ్లు విసిరిన దశాబ్దంగా చరిత్రలో నిలిచిపోతుంది. అదేసమయంలో అంతర్జాతీయ ఆర్థిక రంగం, మార్కెట్, లాభాల వాటాలో వర్ధమాన దేశాలకు చెందిన బహుళజాతి కంపెనీల పాత్ర పెరగటానికి పునాదులు వేసిన దశాబ్దంగా కూడా దీన్ని పరిగణించవచ్చు. రానున్న దశాబ్దం సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఎదుర్కునే సవాళ్లను తీవ్రతరం చేయటమే కాదు. దాని మనుగడను ప్రశ్నార్థకం చేసే దిశగా అడుగులు వేస్తుందని కోపెన్‌హేగెన్‌లో వర్ధమాన దేశాలు అనుసరించిన ఎత్తుగడలు స్పష్టం చేస్తున్నాయి.

Subscribe to:
Posts (Atom)