From Business Standard, April 10th 2010
David Shulman, professor of humanistic studies, Hebrew University of Jerusalem and an expert on South Indian languages and cultures has written Spring, Heat, Rains: A South Indian Journey (University of Chicago Press, $25/Special Indian price, Rs 1,004) which is not just a travelogue but a long meditation on Telegu literature with reflections on Andhra history. As a journey across space and time, it is rather like a genre without rules, free from precept or precedent: part travel writing, part literary appreciation but above all, a philosophy expressed in images. Shulman is also a scholar in Sanskrit and classical Hindustani music, plus much else besides, and brings to bear his formidable learning to this book, which he admits to “a restlessness that rules me, so the landscapes shift like the languages and the texts”. All of which makes it difficult to write about it in this limited space! As you might expect, the diary is lyrical, sensual but more than anything else, it is introspective. Just about everything becomes a part of the huge canvas Shulman builds his story on. There are reflections on daily happenings and the life around: “Rocks. Goats. Dry shrubs, Buffaloes. Thorns. A fallen tamarind tree.” Simple observations of the daily lives of ordinary people of Rajahmundry, on the banks of the river Godavari which like all rivers in India are sacred and determine the life styles of millions around. Shulman has been bitten by the metaphysical bug: “How did I happen to find myself in Rajamundhry in the early spring of 2006? The answer would be the river called me. She — the Godavari — is imperious, also infinitely seductive. Rajamundhry is her town. When I saw her, she extracted a promise that I would return:….” And long before he first saw India, he had a calling within, “as if India was the magnet, and I the iron filing, unconscious, unmelted…. If words mean anything — but why should they mean? —it is only when the underlying echo, the music that motivates all real language, fades into silence”.
It is classical Hindustani music which Shulman had studied in depth that had drawn him to India, along with the music of the Dravidian languages, which fascinated because he says, “Linguistics had shown that South Indians utter, on average, more syllables per second than any other attested speakers of known human languages — and sometimes give the impression of a bubbling or cascading stream.” Telugu, he adds, is in fact “the main language of classical South Indian musical compositions”. Shulman goes into history to explain “the strangely hypnotic, contrapuntal complexity of tremendous aural power — a musical experience unlike any other, perhaps transcending meaning in any of the usual senses of the word”.
Shulman uses the metaphors of music to describe early mornings in Rajahmundry. “The rooftops, white, gray, streaked with grime, partly hidden by thick green clusters of palm, seem to be humming a barely audible morning raga. Birdcalls, the bells on the bicycles, the constant backdrop of horns from the cars and rickshaws, the cries of fruit vendors, the distant ring of a radio broadcasting a Sanskrit prayer to the waking god, mothers shouting at their children: all this is the raga as it breaks through the surface to audibility.” For the non-Telugu speaker or for those unfamiliar with classical Hindustani music, we have simply to go along, overawed by the depth and range of Shulman’s scholarship, and the meanings he gives to the everyday happenings around him.
It is Shulman’s principle not only to read poetry in the original language “but also to absorb it in the setting where it was written” because language does not exist independent of the environment in which it is rooted.
Shulman plunges deep into Telugu poetry and in the process into the beliefs, philosophies, the myths and legends of the land. So, “Godavri is not somewhere outside us but deeply alive within.” Like the Hindu way, he is inclined to see divinity in the earth itself, in rocks, in trees, in stone sculptures, in mountains, in rivers but specially in the Godavri in spate: …marvelling at the dramatic swelling and acceleration of their goddess, this necklace hanging over the breast of the Andhra Earth-goddess….” Shulman does not lose his critical eye and sees the muck behind the façade of modernity and the pollution of the river “smothered in the stench of the Andhra Pradesh Paper Mills upstream”.
This book isn’t an easy read and has to be taken in small doses by the noncognoscenti. But it is fascinating the extent to which some foreign scholars go in understanding us. How many of our own do so?
Saturday, April 10, 2010
Monday, March 22, 2010
కుంభకోణం పెట్టుబడుల ఉపసంహరణ
యుపిఎ 2 ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పెట్టుబడుల ఉపసంహరణ కుంభకోణం దిశగా నడుస్తోంది. ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వరంగ సంస్థల గ్రామీణ విద్యుదీకరణ కంపెనీ, జాతీయ గనులు, ఆర్‌ఇసి, ఖనిజాభివృద్ధి సంస్థ, ఎన్‌ఎంఎండిసి, జాతీయ థర్మల్ విద్యుత్పత్తి కార్పొరేేషన్ ఎన్టీపిసిల్లో ప్రభుత్వ వాటాల ఉపసంహరణ వ్యవహారాన్ని పరిశీలిస్తే నా ఈ సందేహం నిరాధారం కాదని స్పష్టమవుతోంది. 2009-2010 ఆర్థిక సంవత్సరానికి 25000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సంపాదించాలని ప్రభుత్వం నిర్ణయించుకొంది. యుపిఎ- 1 మరియు యుపిఎ 2 మధ్య ఆర్థిక విధానాల్లో ఉన్న మౌలిక వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తూ 2009 జూన్‌లో రాష్ట్రపతి, 'ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల్లో వాటాలు పొందే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. అందువల్ల ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యంలో మార్పు లేకుండా సాధ్యమైనంత మంది ఎక్కువ ప్రజలకు వాటాలపై హక్కులు కల్పించేందుకు గాను ప్రభుత్వం చర్యలు చేపడుతుంది' అని పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల వాటాలు ప్రైవేటు శక్తులకు కట్టబెట్టే పనికే నాజూకుగా ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులపై ప్రజలకు హక్కులు కల్పించటం అని పిలిచింది. ఈ విధానం ప్రకారం ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయంలో ప్రజలు తండోపతండాలుగా పాల్గొనాలి. లక్షలాది షేర్లు, వాటాలు కొనుగోలు చేయటానికి గాను మార్కెట్‌ను ప్రజలు ముంచెత్తాలి. కానీ పరిస్థితి దీనికి భిన్నంగా సాగుతోందని దిగువనున్న పట్టిక తెలియచేస్తోంది.
ఈ మొత్తం ప్రక్రియలో మరో కీలకమైన అంశం దాగి ఉంది. షేర్లు కొనటానికి సాధారణ ప్రజలు సిద్ధం కాకపోవటం ఒక అంశమైతే మరోటి ప్రయివేటు కంపెనీలు కూడా సిద్ధం కాకపోవటం. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందన్న ప్రశ్నకు సమాధానం వెదకటంలోనే అసలు కిటుకు దాగి ఉంది. ప్రభుత్వం ఆశించినంతగా వాటాల కొనుగోళ్లుకు దరఖాస్తులు రాలేదని ఈ పట్టికలోని సమాచారం తెలియచేస్తోంది. అలా అని వాటాల ఉపసంహరణ ప్రక్రియను విరమించుకుంటే ప్రభుత్వ మౌలిక స్వభావమే ప్రశ్నార్థకం అవుతుంది. అందువల్ల పెద్దఎత్తున ప్రభుత్వ రంగ సంస్థలైన, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత జీవిత బీమా కంపెనీలను మార్కెట్‌లోకి దించి వారి పెట్టుబడులను వాటాల కొనుగోళ్లకు పురమాయించింది ప్రభుత్వం. ఉదాహరణకు గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ వాటాలు కొనుగోలు చేయటానికి ఎల్‌ఐసి 3000 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఎన్‌ఎండిసి కంపెనీ వాటాలు కొనుగోలు చేయటానికి మరో రూ.8000 కోట్ల ఎల్‌ఐసి నిధులు వినియోగించబడ్డాయి. ఇతర ప్రయివేటు సంస్థలు, మ్యూచ్‌వల్ ఫండ్స్, ఇతర ద్రవ్య సంస్థలు ఈ వాటాలు కొనుగోలు చేయటానికి ముందుకు రాలేదు. తత్పర్యవసానంగా ఆయా కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ విలువ తగ్గిపోయింది. ఫలానా కంపెనీ వాటాలు మార్కెట్‌లో విడుదలైన దానికంటే ఎన్ని రెట్లు ఎక్కువగా అమ్ముడయితే ఈ కంపెనీ మార్కెట్ విలువ అంత ఎక్కువ ఉన్నట్లు. మరి ఆర్‌ఇసి, ఎన్‌ఎండిసి కంపెనీల మార్కెట్ విలువ పెంచే దిశగా ప్రభుత్వ చర్యలు దోహదం చేయలేదని దీన్ని బట్టి అర్థం అవుతుంది. మరి ఈ పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం సాధించదల్చుకున్నది, నిరూపించదల్చుకున్నది ఏమిటి?
ఇక్కడ ఒక విషయాన్ని చర్చించుకుందాం. ఎవరైనా షేర్లు కొనుగోలు చేసేటప్పుడు ఫలానా కంపెనీ లాభాలు, స్థిరాస్తుల, అప్పులు, ఇతర లావాదేవీలు గురించి ఆరా తీస్తాము. అపుడపుడూ కీలకమైన విషయాల్లో ప్రభుత్వం తన ఆశక్తతను, అసహాయతను కప్పిపుచ్చుకునేందుకు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ప్రకటించటం అలవాటుగా మారింది. అదే తరహాలో ప్రభుత్వం కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకునే బాధ్యత నుండి తప్పుకునేందుకు మార్కెట్ తన పని తాను చేసుకుపోతుంది. 'మార్కెట్ ధర్మం' దీనికి అంతరాయం కలిగించకూడదు అని వాదించటం కూడా అలవాటుగా మారింది. ఈ సూత్రాన్ని మాటవరసకు అంగీకరించినా ఈ విషయాల్లో ఏ కంపెనీ మెరుగ్గా ఉంటే ఈ కంపెనీ వాటాలు అమ్ముడవటం సోకాల్డ్ మార్కెట్ ధర్మం. ఆ విధంగా చూసుకున్నపుడు పట్టికలో ప్రస్తావించిన కంపెనీలన్నింటిలో ఎన్‌ఎండిసి, ఆర్‌ఇసి కంపెనీల స్థిరాస్తులు, నికర లాభాలుఎక్కువ అన్నది నిస్సందేహం. కనీసం నరవత్న కంపెనీల్లో ఒకటి, అంతర్జాతీయంగా మార్కెట్ ఆదరణ పొందిన ఫోర్బ్స్ 500 కంపెనీల్లో స్థానం పొందిన ఎన్టీపిసీ వాటాలు కూడా కొనుగోలు చేసే నాధుడు కరువయ్యాడని ఈ పట్టిక తెలియచేస్తోంది. అటువంటప్పుడు మార్కెట్ ధర్మం ప్రకారం ఈ కంపెనీల వాటాలకు గిరాకీ ఉండాలి. కానీ మార్కెట్ ధర్మం ఇక్కడ పని చేయలేదు. చిన్న చిన్న కంపెనీలు, నామమాత్రపు స్థిరాస్థులు కలిగి, మార్కెట్ రుణాలపై ఆధారపడే కంపెనీల వాటాలు అమ్ముడయినంతగా ప్రభుత్వరంగంలోని పెద్దఎత్తున స్థిరాస్తులు కలిగి, ప్రతి ఏటా లాభాలు సంపాదిస్తున్న కంపెనీల వాటాలు అమ్ముడుకాలేదు. అంటే ఇక్కడ మార్కెట్ మానాన మార్కెట్ పని చేయలేదని సదరు పెట్టుబడుల ఉపసంహరణ వాదులు, మార్కెట్ వాదులు అంగీకరించాల్సివుంది.
అలా కాదనుకున్న పక్షంలో చట్టానికి కళ్లు లేవు అన్న ధోరణిలో మార్కెట్ కూడా గుడ్డిది, వాస్తవికతను గుర్తించలేదు అని అంగీకరించాలి. ఈ రెండింటిలో ఈ ఒక్క వాదనను అంగీకరించినా పెట్టుబడుల ఉపసంహరణ అర్థం లేని పని అని తీర్మానించాల్సి వస్తుంది. ప్రభుత్వం మరి ఏ వాదన అంగీకరిస్తుంది అన్న విషయాన్ని తెలుసుకోవటానికి సమయం పడుతుంది.ఈ లోగా మార్కెట్ అవకతవకల కోణాన్న పరిశీలిద్దాం. శక్తివంతమైన కంపెనీల వాటాలుమార్కెట్‌లో పలుకుబడి కోల్పోవటం వెనక ఖచ్చితంగా మార్కెట్ ఆపరేటర్లు జట్టు కట్టటం కారణం అయి ఉంటుందన్న సందేహాలు ఉన్నాయి. ఒక వేళ మార్కెట్ వివేకవంతం అయినదైతే షేర్లుకంపెనీల్లో ఒకటి కాకపోతే మరోటైనా వివేకవంతంగా వ్యవహరించాలి కదా... మరి పబ్లిక్ ఇషఉ్య ముగింపు తేదీ వరకూ సదరు కంపెనీల వాటాలు అమ్ముడవకపోవటం వెనక ఉన్న మర్మం ఏమిటి? ప్రభుత్వం స్టేట్ బ్యాంకు, ఎల్ ఐసి వంటి కీలకమైన సంస్థల నిధులు మళ్లించి మరీ ఈ మార్కెట్ సెంటిమెంట్ కాపాడాల్సిన అవసరం ఏమొచ్చింది ? ఈ మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తెస్తే తప్ప పెట్టుబడుల ఉపసంహరణ పేరిట ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో నిజాలు, నీడలు వెలుగు చూడటం సాధ్యం కాదు.
కంపెనీ ఇష్యూ మోతాదు వచ్చిన దరఖాస్తులు గిరాకీ శాతం
డిక్యు 123 11083 86.3
మాన్ ఇన్‌ఫ్రా 142 8904 67.8
ఎఆర్‌ఎస్‌ఎస్ 103 5286 51.3
ఇన్‌ఫినిట్ కంప్యూటర్ 190 6840 36.0
ఐఎల్‌ఎఫ్‌ఎస్ ట్రాన్‌పోర్ట్ 700 22694 32.4
జుబిలియంట్ ఫుడ్స్ 328 8941 27.3
ఆర్‌ఇసి 3486 10945 3.1
ఎన్‌ఎండిసి 9957 12459 1.3
ఎన్‌టిపిసి 8480 10515 1.2

Tuesday, March 9, 2010
పన్ను విధానంలో మార్పుతో చేతిలో మిగిలిలేదెంత?
ప్రజాశక్తి -బిజినెస్‌డెస్క్ Sun, 7 Mar 2010, IST
కొండూరి వీరయ్య
బడ్జెట్ తతంగం పూర్తయ్యింది. ఇక మీదట బడ్జెట్ తర్వాత ఏయే రంగాలకు ఎంతమేర నష్టం కలిగింది, ఎంతమేర ప్రయోజనం కలిగింది అన్న అంశాలపై చర్చలు, సమీక్షలు దృష్టిపెడుతున్నాయి. ముఖ్యంగా విష్లేషకులు వ్యక్తిగత ఆదాయ పన్నుల విధానంలో వచ్చిన మార్పులపై కేంద్రీకరిస్తున్నారు. ఎందుకంటే ఇది మార్కెట్‌లో సరుకుల కదలికపైనా, నిధుల లభ్యతపైనా ప్రత్యక్ష ప్రభావం చూపించనుంది. మార్కెట్ విశ్లేషకులు, ఆర్థిక సంస్థలన్నీ ఈ పన్నుల విధానంలో ప్రతిపాదించిన మార్పు ద్వారా మధ్యతరగతి ప్రజలకు పెద్దఎత్తున మిగులు డబ్బులు చేతిలో ఉంటాయని వాదిస్తున్నారు. దానికనుగుణంగానే పన్నుల్లో వచ్చిన మార్పుల ద్వారా మిగిలిన డబ్బును ఫలానా స్కీంలో పెట్టుబడులు పెట్టండి, ఇంత కాలం తర్వాత అంత ఆదాయం వస్తుందన్న ప్రకటనలుకుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. నిజానికి ప్రస్తుత బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్నుల విధానం వల్ల ప్రజల వద్ద అంత ఎక్కువ మొత్తంలో నిధులు ఆదా అవుతున్నాయా అన్న విషయాన్ని పరిశీలిద్దాం.
తాజా బడ్జెట్‌లో వ్యక్తిగత పన్నుల విధానాన్ని విశ్లేషించేముందు 2011 ఏప్రిల్ 1 నుండీ ప్రత్యక్ష పన్నుల విషయంలో నూతన విధి విధానాలు అమల్లోకి తేనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రస్తుత బడ్జెట్‌లో వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో ప్రతిపాదించిన కొన్ని ప్రతిపాదనలు ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఉన్నాయి. పన్నుల శ్లాబుల్లో ప్రతిపాదించిన మార్పుల వల్ల గతం కంటే ప్రజల వద్ద అదనపు వెసులుబాటు ఉంటుందన్న విషయాన్ని దిగువనున్న పట్టిక రుజువు చేస్తోంది. సదరు మార్పులను అంతవరకే పరిమితం చేసి చూస్తే నిజమే కదా అన్న భావన కూడా కలగటం కద్దు. కానీ ఈ మార్పులను అదే బడ్జెట్ పత్రంలో ప్రతిపాదించిన ఇతర మార్పుల నేపథ్యంలో పరిశీలిస్తే తప్ప నిజంగా కలిగే ప్రయోజనం ఏమిటన్నది అర్థం చేసుకోవటం సాధ్యం కాదు.ఇదే విధంగా సంత్సరానికి యాభై లక్షల ఆదాయం వచ్చే వారికి కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అదనంగా 50,000 రూపాయలు తక్కువ పన్ను కడితే సరిపోతుంది. ఇదే సందర్భంలో ఇతర అంశాల్లో తెచ్చిన మార్పుల వల్ల ఈ మిగులు ఆదాయాన్ని నిర్భయంగా ఉపయోగించే అవకాశం లేకుండా చేసింది ప్రభుత్వం. అదెలాగో ఇప్పుడు పరిశీలిద్దాం. స్థూలంగా చెప్పాలంటే ఈ విధంగా మిగిలిన డబ్బును ఇతర తక్షణ ప్రయోజనకరమైన పనికి - అంటే ఇల్లు కట్టుకోవటానికో మరోదానికో వెచ్చిస్తే భారం మరో రూపంలో వచ్చి పడుతుంది. కేవలం కాపిటల్ మార్కెట్లు, ఈక్విటీ, బాండు మార్కెట్లలో పెట్టుబడులు పెట్టుకుంటేనే ఈ రాయితీల వల్ల వచ్చిన ప్రయోజనం ఒనగూడుతుంది. అంటే ఈ ఆదాయ పన్నుల విధానంలో ప్రతిపాదించిన మార్పులన్నీ ప్రజల చేతిలో అదనపు ఆదాయం మిగిల్చేందుకు కాదు. ద్రవ్య మార్కెట్లలో పెట్టుబడులు ప్రోత్సహించేందుకే అన్నది స్పష్టం అవుతుంది.
ఈ ఇచ్చిన రాయితీలు ప్రధానంగా బాండ్ మార్కెట్‌ను, మ్యుచువల్ ఫండ్ మార్కెట్‌ను, పెన్షన్ మార్కెట్‌ను బలోపేతం చేసేవిగా ఉన్నాయి. పై పద్ధతిలో మిగుల్చుకున్న ఆదాయాన్ని మౌలిక వసతుల కల్పనా రంగంలో విడుదలయ్యే బాండ్లుపై (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు) ఖర్చు పెడితే మరో రూ.20,000 వరకూ మినహాయింపు వస్తుంది. ఆర్థిక రంగంలో ఏ విభాగాన్ని కదిలించినా ఆ విభాగంలో మౌలికవసతుల కల్పనకు లక్షల కోట్లలో నిధులు అవసరం అని ప్రభుత్వం, నిపుణుల కమిటీలు ప్రకటించటాన్ని చూస్తూనే ఉన్నాము. ఈ మార్పుల ద్వారా ప్రభుత్వం సదరు నిధులు కల్పించేందుకు బదులుగా మార్కెట్ ద్వారా, అంటే ప్రజల ద్వారా ఆ నిధుల సేకరణకు మార్గం సుగమమం చేస్తోంది ప్రభుత్వం. అయితే ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు ఎవరు విడుదల చేస్తారు అన్నది కీలక అంశంగా ఉంది. అంతేకాదు. బాండ్ల ద్వారా వచ్చే సగటు ఆదాయం, వడ్డీనికూడా పన్నుల పరిధిలోకి తెస్తూ నిర్ణయించింది ప్రభుత్వం. ప్రైవేటు కంపెనీలకు విడుదల చేసే అటువంటి బాండ్లుకు కూడా ఈ పన్ను రాయితీలు వర్తింపచేస్తే ఇకపై రూపాయి పెట్టుబడి లేకపోయినా ప్రజల సొమ్ముతో దర్జాగా వేల కోట్ల లాభాలు దిగమింగటానికి మార్గం తేలికపర్చటమే అవుతుంది.
ఈ బడ్జెట్ ప్రతిపాదించిన పన్నుల విధానంలో మరో ముఖ్యమైనది నూతన పెన్షన్ పథకానికి సంబంధించింది. కార్మిక సంఘాలు, వామపక్షాల ఒత్తిళ్ల వల్ల నూతన పెన్షన్ విధానం ఇంతవరకూ చట్టరూపానికి నోచుకోలేదు. తాజా బడ్జెట్‌లో ఇపిఎఫ్, పిపిఎఫ్‌ల లబ్దిదారులకు స్కీం మెచ్యూరిటీతో వచ్చే ఆదాయంపై కూడా పన్ను ప్రతిపాదించారు. అంటే ఆర్థిక మంత్రి ప్రతిపాదన పార్లమెంట్ ఆమోదం పొందితే ఇపిఎఫ్ స్కీం మెచ్యూరిటీతో లక్ష రూపాయల ఆదాయం సంపాదించుకుంటే అందులో 60 వేల రూపాయలు పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. పిల్లల చదువులకో, పెళ్లిళ్లకో, ఇల్లు కట్టుకోవటానికో దాచుకున్న డబ్బులపై పన్ను వేటు పడుతోంది. మరోవైపున నూతన పెన్షన్ పథకంలో సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్మికుడు, ఉద్యోగికీ ఏటా ప్రభుత్వం వెయ్యి రూపాయల చొప్పున మూడేళ్ల పాటు నిధి జమచేయనుంది. కొత్త పథకం పట్ల మోజు కల్గించే ప్రయత్నం తప్ప ఇది నిజంగా కార్మికులకు ప్రయోజనం కలిగించే ప్రయత్నం కాదు.
ఒకవేళ ఎవరైనా ప్రయోజనకరమైన వస్తువులు కొనుగోలుచేయాలని ప్రయత్నిస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వివిధ రంగాలపై సర్వీసు పన్ను పెంచటం ద్వారా వస్తువులు, సేవలు మరింత భారంగా మారనున్నాయి. ఉదాహరణకు నిర్మాణంలో ఉన్న ఇంటికి బ్యాంకు రుణం తీసుకుంటే దానిపై కూడా సర్వీసు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇకపై ఇన్‌స్టాల్‌మెంట్ల భారం పెరగనుందన్నమాట. వినిమయ వస్తువులు కొందామంటే కూడా పరిస్థితి అంత తేలికగా ఏమీ లేదు. ఉదాహరణకు పెట్రోలియం ఉత్పత్తులపై పెంచిన భారం అన్ని రంగాల్లోనూ, అన్ని తరగుతల ప్రజలపైనా వడ్డించేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అదేవిధంగా కనీస ప్రత్యామ్నాయ పన్ను (మాట్)లో పెరిగిన భారాన్ని, ఎక్జైజు, కస్టమ్స్ సుంకాల రూపంలో పెరిగిన భారాన్ని కంపెనీలు నేరుగా వినియోగదారులపై వడ్డించేందుకు సిద్ధమయ్యాయి. ఈ దిశలోనే ఎలక్ట్రానిక్, మరియు గృహోపకరణాలు ఉత్పత్తి చేసే ఎల్జీ కంపెనీ తమ ఉత్పత్తుల ధరల్లో 1.5 శాతం నుండి 3.5 శాతం పెంపుదలకు ఆదేశాలు జారీ చేసింది. గోద్రెజ్ కంపెనీ ఉత్పత్తులు బడ్జెట్‌కు ముందు రెండు శాతం తక్కువ ధర పలికితే బడ్జెట్ మరునాడు రెండు శాతం అదనపు ధర పలుకుతున్నాయి. వళ్‌పూల్ కంపెనీ తమ ఉత్పత్తుల న్నింటిపైనా సగటున రెండు శాతం ధరలు పెంచాలని నిర్ణయిం చుకుంది. ఎక్జైజు సుంకాలు పెరగటం వల్ల కార్ల కంపెనీల తమ ఉత్పత్తులపై 3000 నుండి 50000 వరకు పెంచుతూ నిర్ణయించాయి. కొత్త పన్నుల విధానం ద్వారా చేతిలో మిగిలిన డబ్బులు వెచ్చించాలని మార్కెట్‌లోకి అడుగుపెట్టే సోదరులారా... ఎంత ఖర్చుపెడుతున్నారు, ఎందుకు ఖర్చు పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి మరి....
పన్ను పరిధిలోకి గత ప్రస్తుత తేడా
వచ్చే ఆదాయం బడ్జెట్ బడ్జెట్ (మిగులు)
2,00,000 4120 4120 0
5,00,000 55620 35019 20,601
10,00,000 210120 158619 51,501
12,00,000 2,71,919 2,20,419 51,500
15,00,000 3,64,619 3,13,119 51,500
20,00,000 5,19,119 4,67,619 51,500

Wednesday, March 3, 2010
సంస్కరణలపై యావ తగ్గని ప్రభుత్వం
ప్రజాశక్తి -బిజినెస్‌డెస్క్‌కొండూరి వీరయ్య Sun, 28 Feb 2010, IST
ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపి కట్టెది వేరే దారట. సంస్కరణలను వేగవంతం చేసేందుకు మన భారతదేశం 2010-2011 బడ్జెట్‌లో పెద్ద పీట వేయటమే దీనికి ఉదాహరణ. గతవారం చెప్పుకొన్నట్లు రెండు దశాబ్దాల సంస్కరణల అనుభవాలు మదింపు చేసుకునేందుకు వచ్చిన అరుదైన అవకాశాన్ని ప్రభుత్వం వృధా చేసుకొందని చెప్పకతప్పదు. 1990-1991 సంస్కరణలకు ఆరంగేట్రం చేసిన ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్‌సింగ్, మాంటెక్ సింగ్ అహ్లువాలియాలే నేడు కూడా కీలక విధాన నిర్ణాయక హౌదాలో ఉన్నారు. పైగా మొదటి రెండు దశాబ్దాల్లో మౌలిక రంగాలకు పరిమితం అయిన సంస్కరణలను నేడు సామాజిక, అనుబంధ రంగాలకు కూడా విస్తరించటానికి వీరి నేతృత్వంలో ప్రభుత్వం నడుం కట్టినట్లు బడ్జెట్ ప్రసంగాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది.
ఏ దేశానికి సంబంధించిన ఆర్ధిక వ్యవస్థలోనైనా రెండు భాగాలు ఉంటాయి. మొదటిది పరపతి విధానం. దాన్నే విస్తృతార్థంలో మానిటరీ పాలసీ అంటారు. రెండోది ద్రవ్య విధానం. దాన్నే ఫిస్కల్ పాలసీ అంటారు. పరపతి విధానం ద్వారా రిజర్వు బ్యాంకు మార్కెట్లో ఉండాల్సిన రొక్కం నిధులు, దానికి అవసరమైన విధి విధానాలను ప్రభుత్వాలు నియంత్రిస్తాయి. ద్రవ్య విధానంలో భాగంగా ప్రభుత్వం మార్కెట్‌లో ఉన్న నిధులు ఎవరి వద్దకు చేర్చాలి అన్న విషయంలో తన విచక్షణ ప్రదర్శిస్తుంది. ఇందులో ముఖ్యమైనది పన్నుల విధానం. ఏ ప్రభుత్వం అయినా ఎవరి పక్షపాతిగా ఉంది అని చెప్పటానికి సదరు బడ్జెట్‌లో అనుసరించిన పన్నుల విధానం కీలక ప్రాతిపదికగా ఉంటుంది. పరోక్ష పన్నులు (ఎక్సైజ్, కస్టమ్స్, సర్‌చార్జి వంటివి) నూటికి 95 శాతం ప్రజల జీవితాలను, ఆదాయ వ్యవయాలను నేరుగా ప్రభావితం చేస్తాయి. దీనికి భిన్నంగా ప్రతక్ష్య పన్నుల పరిధిలోకి వచ్చే ప్రజల వాటా కేవలం 5 శాతం మాత్రమే.95 శాతం మందిపై విధించే పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం సమకూరవచ్చు. కానీ ఆ మేరకు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పదే పదే కౌటిల్యుడి ఆర్థిక సూత్రాల ప్రకారం బడ్జెట్ రూపొందించామని చెప్పుకున్న ప్రణబ్ ముఖర్జీ , ''మార్కెట్‌లో నియంత్రణలు లేని ధరల వల్ల వేర్వేరు వర్గాల ప్రజలు వేర్వేరు మోతాదుల్లో భారాలపాలవుతారు. ప్రత్యేకించి శ్రమజీవులపై ఈ భారం ఎక్కువగా ఉంటుంది'' అన్న కౌటిల్యుని సూత్రాన్ని మాత్రం మర్చిపోయారు. ఉత్పాదక క్రమాన్ని దెబ్బతీయకుండా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవటానికి అవసరమైతే జూద గృహాలు (నేటి స్పెక్యులేటివ్ వ్యాపారులు)పై కూడా పన్ను వేయాలని కౌటిల్యుడు చెప్పిన సూత్రం మాత్రం ఆర్థిక మంత్రికి గుర్తుకు రాలేదు.
ప్రభుత్వం చమురు ధరలు, ఎరువులపై నియంత్రణ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం మొత్తంగా 95 శాతం మంది ప్రజానీకంపై భారాలు మోపటంతో పాటు ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. దాంతో పాటే ధరలు కూడా పెరుగుతాయి. ధరలు పెరగటం అంటే మార్కెట్‌లో ప్రజల చేతిలో ఉన్న రొక్కం (లిక్విడిటీ) తగ్గిపోవటం అన్నమాట. ధరల రూపంలో ఈ నిధులు చేతులు మారి సంపన్నులకు చేరతాయి. అదే 5 శాతం మంది పారిశ్రామికవేత్తలు, కుబేరులపై విధించే పన్నులు పెంచటం వల్ల నేరుగా ఆర్థిక వ్యవస్థపై పడే భారం పరిమితంగా ఉంటుంది. కానీ ప్రభుత్వం మొదటి నిర్ణయానికే ప్రాధాన్యత ఇచ్చింది.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సిబిడిటి) అంచనా మేరకు కేవలం వివాదాల కారణంగా ప్రభుత్వం ఏటా పన్నుల ద్వారా రావాల్సిన ఆదాయంలో 50 వేల కోట్ల రూపాయలు కోల్పోతోంది. ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పరోక్ష పన్నుల ద్వారా వసూలు చేయదల్చుకొన్న మొత్తం ఆదాయంలో ఇది మూడోవంతు. అంతేకాదు. గత మూడు సంవత్సరాలుగా దేశ స్థూల జాతీయోత్పత్తిలో ప్రత్యక్ష పన్నుల వాటా, కార్పొరేట్ పన్నుల వాటా తగ్గిపోతోందని ఆర్థిక సర్వే స్పష్టంగా చెప్పింది. అయినా ఈ విషయాలు సరి చేయటం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ఉన్న మార్గాలు పరిశీలించటానికి ప్రభుత్వం నిరాకరిస్తోంది.
మధ్యతరగతి ప్రజల మెప్పు పొందటం కోసం ఆదాయపు పన్నుల్లో నామమాత్రపు మార్పులు చేసింది. చూడటానికి 1,60,000 రూపాయలకు లోబడి ఆదాయం వచ్చే వారిపై పన్ను భారం తగ్గించటం ద్వారా వారి చేతిలో ఖర్చుపెట్టటానికి పుష్కలంగా అవసరమైన నిధులు అందుబాటులో ఉంచామని ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రకటించారు. అదే సమయంలో ధరల నియంత్రణను గాలికి వదిలేయటం ద్వారా కుడిచేత్తో ఇచ్చిన రొక్కాన్ని ఎడమ చేత్తో లాగేసుకున్నట్లయ్యింది. చమురు, ఎరువుల ధరలపై నియంత్రణ రద్దు చేయటం ఈ ఒక్క బడ్జెట్‌కే పరిమితమైన కసరత్తు కాదు. రానున్న కాలంలో ఈ ధరల నిర్ణయ క్రమాన్ని మార్కెట్ ఒడిదుడుకులకు అనుగుణంగా నిర్ణయించే స్వతంత్ర అధికారాన్ని ఆయా కంపెనీలకు చేతిలో కట్టబెట్టింది. గత నెల రిజర్వు బ్యాంకు వెలవరించిన ఒక నివేదికలో '' ప్రభుత్వం మార్కెట్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేసేలా తీసుకున్న నిర్ణయాలు భారం తక్షణమే ప్రజలకు చేరుతుంది. సానుకూలంగా ప్రభావితం చేసేలా తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు చేరేసరికి ఆలస్యం అవుతున్నాయి'' అని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెద్దఎత్తున పతనం చవిచూసిన గత రెండు సంవత్సరాల్లో రిటైల్ ధరలు ఏమాత్రం తగ్గాయో మనం చూస్తూనే ఉన్నాము. అందువల్ల ఇకపై ప్రజలపై పడే ధరల భారం ఎగమోరతో ఉంటుందే తప్ప తిరుగుముఖం పట్టే అవకాశాలు లేవు.
సంస్కరణల విషయంలో చెప్పుకోవాల్సిన మరో కీలక అంశం వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు పెంచాలన్న ప్రతిపాదన. విద్యా రంగంలో విదేశీ విశ్వవిద్యాలయాలకు పెద్ద పీట వేయాలన్న ప్రతిపాదన ముఖ్యమైనవి. ప్రభుత్వం మూడ్ గమనించిన రిజర్వు బ్యాంకు కూడా ఈ విధానాలకు మానిటరీ పాలసీలో ఉన్న అవాంతరాలు తగ్గించే విధంగా అవసరమైతే రూపాయి పూర్తి మారకాన్ని అనుమతించేందుకు వెనకాడబోమని ప్రకటించింది. ఆర్థిక సర్వేలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ విధానాల దశ, దిశను మార్చాలని ప్రతిపాదించింది. పాశ్చాత్య దేశాల్లో సంక్షేమ రాజ్యం గురించి జరుగుతున్న చర్చల సారాంశాన్ని భారత ప్రభుత్వం తన విధాన పత్రాల్లో చొప్చించింది. తద్వారా భారతదేశంలో సంక్షేమ రాజ్యం గురించి జరుగుతున్న చర్చకు ఆందోళనకరమైన నూతన కోణాన్ని జోడించింది ఈ బడ్జెట్.

Monday, February 22, 2010
రానున్న దశాబ్ధిలో భారత్ పయనాన్ని నిర్దేశించే బడ్జెట్
Published in Prajasakti Telugu Daily, Mon 22nd Feb 2010, IST
* 20 సంవత్సరాల క్రితం సంస్కరణలు ప్రారంభమైనపుడు ప్రభుత్వం ముందున్న మరో లక్ష్యం, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు నిర్దేశించిన కీలక షరతు, ద్రవ్యలోటు తగ్గించటం. ఈ షరతు అమల్లో భాగంగా తెరమీదకు వచ్చిందే ద్రవ్యనియంత్రణ చట్టం. పెట్టుబడిదారీ వ్యవస్థ తాజా సంక్షోభ దశ నేపథ్యంలో ద్రవ్యలోటు నియంత్రించాలా వద్దా అన్న అంశంపై పెద్దఎత్తున సైద్ధాంతిక చర్చ జరుగుతోంది.
అనుభవాజ్ఞుడైన ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఈ శుక్రవారం యుపిఎ-2 ప్రభుత్వపు రెండో బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రతిపాదించనున్నారు. నిజానికి యుపిఎ-2లో ఇది తొలి పూర్తి స్థాయి బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రతిపాదించారు. ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రతిపాదించినా దానికంటే ముందే ఎన్నికలు ముగియగానే రెండు, మూడు దఫాల ఉద్దీపన పథకాలు ప్రకటించటం మనకు తెలుసు. దాంతో గత సంవత్సరం బడ్జెట్ అంతా పెట్టుబడిదారీ వ్యవస్థ సంక్షోభం పడగ నీడన సాగింది. ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఈ సంక్షోభం పగడ నీడ నుండి బయట పడుతుందని చెప్పుకొస్తున్నారు. వర్ధమాన దేశాలు ప్రత్యేకించి చైనా, భారతదేశాల్లో ఆర్థికాభివృద్ధి వేగం గురించి పుంఖానుపుంఖాలుగా వివరాలు వస్తున్నాయి.
తాజాగా గత వారం విడుదలైన పారిశ్రామికాభివృద్ది సూచికలు కూడా భారతదేశంలో పారిశ్రామికాభివృద్ధి రెండంకెల స్థాయిని దాటిపోతుందని చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రణబ్ ముఖర్జీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రతిపాదించాల్సి ఉంది. ఈ బడ్జెట్‌కు రెండు ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. జనవరి రెండో వారంలో చెప్పుకున్నట్లు గత దశాబ్దం సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు సవాళ్లు విసిరిన దశాబ్దం. అదేసమయంలో వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పట్టు పెంచుకుంటున్న కాలం కూడా. పలువురు అంతర్జాతీయ ఆర్థికవేత్తలు, విశ్లేషకులు ఈ దశాబ్దం చిండియా దశాబ్దం (చైనా, భారత్‌ల ఆధిపత్యం కొనసాగే దశాబ్దం)గా పరిగణిస్తున్నారు. అంటే గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ రెండు దేశాలు ఆర్థిక రంగంలో ప్రదర్శిస్తున్న ప్రతిభాపాటవాలు మరో దశాబ్దం పాటు కొనసాగే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అంటే దశాబ్దం పాటు నిర్వరామమైన అభివృద్ధికి కావల్సిన విధానమార్గదర్శనం చేసేందుకు ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్ ఒక అనూహ్య అవకాశంగా ఉండనుంది.
మరో ముఖ్యమైన ప్రత్యేకత ఈ సంవత్సరంతో కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావునేతృత్వంలో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలకు నిండా రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. విదేశీ మారక ద్రవ్య చెల్లింపుల సంక్షోభంతో సంస్కరణలకు తెరతీసిన ప్రభుత్వాలు వరుసగా కొద్ది పాటి వ్యత్యాసాలు మినహా ఈ ధోరణిని కొనసాగిస్తూ వచ్చాయి. ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదించే బడ్జెట్ గత రెండు దశాబ్దాల ఆర్థిక సంస్కరణలను సమీక్షించుకునేందుకు మంచి అవకాశంగా ఉంటుంది. ప్రణాళికా సంఘం అంచనాల మేరకే సంస్కరణల ఫలితంగా తోసుకొచ్చిన అభివృద్ధి అవకాశాల తర్వాత కూడా 35 శాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. పరిస్థితులు ఎంతగా దిగజారాయంటే చివరికి ప్రాథమిక హక్కుగా గుర్తిస్తే తప్ప ప్రభుత్వం పౌరులందరికీ ఆహారం పెట్టలేని దుస్థితికి చేరింది. ఆహారోత్పత్తుల ధరలు బహుశా చమురు సంక్షోభం తర్వాత ఇంత స్థాయిలో పెరిగింది ఇప్పుడేనేమో.సంస్కరణలు ప్రారంభించే నాటికి ప్రభుత్వం ముందున్న మౌలిక లక్ష్యాల్లో ఒకటి రెండంకెలకు చేరుకున్న ద్రవ్యోల్బణం మదపుటేనుగును లొంగదీసుకోవటం. దాదాపు ఏడెనిమిది సంవత్సరాల పాటు 5-6 శాతానికి అటు ఇటూగా ఉన్న ఈ ద్రవ్యోల్బణం తిరిగి గత రెండు సంవత్సరాలుగా రెండంకెల దశకు చేరుకొంది. గత సంవత్సరం వరకూ వరసగా నాలుగు సంవత్సరాల పాటు కరుణించిన వరుణుడి సహకారంతో అదుపులో ఉన్న ఈ మదపుటేనుగు ఎన్నికలకు ముందు ఒక్కసారిగా కట్లు తెంచుకొంది. దాంతో ద్రవ్యోల్బణం పది శాతానికి పైమాటగానే మిగిలింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంక్షోభం కారణంగా దెబ్బతిన్న పారిశ్రామికోత్పత్తి సంవత్సరం చివరి నాటికి కోలుకున్నా వ్యవసాయోత్పత్తి మాత్రం కరువు బారి నుండి బయటపడలేదు. దాంతో ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 17-19 శాతం మధ్య ఊగిసలాడుతోంది. దాని ప్రభావం మార్కెట్లో కనిపిస్తోంది. మరోవైపున ఉపాధి రంగంలో కొత్తగా కనిపిస్తున్న పురోగతి ఏమీ లేదు. ఐటి రంగంలో, ఎగుమతి ఆధారిత పరిశ్రమల్లో కాస్తంత ఉపాధికల్పన సామర్థ్యం పెరిగినా సాంప్రదాయకంగా ఉండే పారిశ్రామిక రంగం, వ్యవసాయరంగంలో ఉపాధి కల్పన తగ్గిపోయిందని ప్రభుత్వమే అంగీకరిస్తోంది. ఉన్న కొద్ది పాటి ఉపాధి కల్పన కూడా నిరంతరం అభద్రత వాతావరణంలో ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రతిపాదించే బడ్జెట్ ఈ పర్యవసానాలను, ఈ పర్యవసానాలకు కారణమైన విధానాలను సమీక్షించాలని ఆశించటం అత్యాశ కాదు. ప్రభుత్వం ఈ సమీక్షకు సిద్ధమవుతుందా లేదా అన్నది వేరే ప్రశ్న. రెండు దశాబ్దాల సంస్కరణలను పురస్కరించుకుని మిగిలి ఉన్న సంస్కరణల ప్రక్రియను అంటే కాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ, వివిధ దేశాలతో స్వేఛ్చా వాణిజ్య ఒప్పందాలు, కార్మికరంగ సంస్కరణలు వంటి అంశాలకు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు. పన్నుల రంగంలో కూడా సంపన్నులకు, పెట్టుబడిదారీ వర్గానికి మరింత రాయితీలు ఇవ్వాలన్న డిమాండ్ కూడా ముందుకొస్తోంది. ప్రత్యక్ష పన్నుల ప్రవర్తనా నియమావళి, దేశవ్యాప్తంగా వర్తించే ఒకే తరహా వాణిజ్యపన్నుల విధానం- గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్(జిఎస్‌టి)- ఇందులో ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం సంస్కరణలు ప్రారంభమైనపుడు ప్రభుత్వం ముందున్న మరో లక్ష్యం, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులు నిర్దేశించిన కీలక షరతు, ద్రవ్యలోటు తగ్గించటం. ఈ షరతు అమల్లో భాగంగా తెరమీదకు వచ్చిందే ద్రవ్యనియంత్రణ చట్టం. పెట్టుబడిదారీ వ్యవస్థ తాజా సంక్షోభ దశ నేపథ్యంలో ద్రవ్యలోటు నియంత్రించాలా వద్దా అన్న అంశంపై పెద్దఎత్తున సైద్ధాంతిక చర్చ జరుగుతోంది.
యూరోపియన్ యూనియన్ సభ్యదేశం గ్రీస్ తన స్థూల జాతీయోత్పత్తి కంటే 114 శాతం అధికంగా అప్పుల్లో కూరుకుపోయింది. 2012 నాటికి అమెరికా అప్పులు ఆ దేశ స్థూల జాతీయోత్పత్తిలో 77 శాతంగా ఉంటాయని బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్ పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిస్తితుల్లో రానున్న దశాబ్దంలో భారతదేశం ఆర్థిక ఆధిపత్యాన్ని ప్రదర్శించాలంటే ద్రవ్య లోటు నియంత్రించటం ముఖ్యమైన షరతుగా పలువురు ఉదారవాద ఆర్థికవేత్తలు, విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ద్రవ్యలోటు నియంత్రించకపోతే ద్రవ్యరంగంలో సుస్థిరత సాధ్యం కాదన్నది వీరి వాదన. సంక్షోభం నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు విస్తృతంగా ఉత్పాదక, మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెంచుకుంటూ వచ్చాయి. ఈ పెట్టుబడులు పెరుగుతున్నంత కాలం ద్రవ్యలోటుపెరుగుతూ ఉంటుంది. అదేసమయంలో ప్రైవేటు రంగ పెట్టుబడికి గల అవకాశాలు పరిమితం అవుతూ వస్తాయి. అందువల్లనే ద్రవ్యనియంత్రణ పేరుతో ఉత్పత్తి రంగంలోనూ, మౌలిక సదుపాయాల రంగంలోనూ ప్రైవేటు పెట్టుబడికి అవకాశాలు విస్తరింపచేయాలన్నది వీరి వాదన. ద్రవ్యలోటు నియంత్రణ రెండంచెల చర్య. మొదటిది పైది. రెండో అంచెలో భాగంగా ప్రభుత్వ వ్యయం తగ్గించుకునేందుకు గాను సబ్సిడీలపై వేటు వేయాలని వీరు ప్రతిపాదిస్తున్నారు.
బడ్జెట్‌కంటే ముందే ఎరువులపై ఇచ్చే సబ్సిడీని కుదించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాటు జరిగిపోయాయి. గురువారం నాటి క్యాబనెట్ నిర్ణయం వల్ల, డీకంట్రోల్డ్ నుండి న్యూట్రియంట్ బేస్డ్ ఎరువుల సబ్సిడీకి మళ్లటంతో కేంద్ర ప్రభుత్వానికి సుమారు రూ.30వేలకోట్లు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు. స్థూలంగా చూస్తే రెండు దశాబ్దాల ఆర్థికాభివృద్ధి ఫలితాలు, పర్యవసానాలు సమీక్షించి సమగ్ర మానవాభివృద్ధికి అవసరమైన విధానాలకు బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుందా లేక రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచ ఆర్థికరంగంపై భారతదేశ బహుళజాతి కంపెనీల ఆధిపత్యం నిలుపుకోవటానికి అవసరమైన విధానాలకే ఈ బడ్జెట్ పరిమితం అవుతుందా అన్నది దేశం ముందున్న ప్రశ్న.
కొండూరివీరయ్య

Monday, February 8, 2010
సంక్షోభం నుంచి అమెరికా గట్టెక్కాలంటే అవుట్ సోర్సింగ్ పై వేటు పరిష్కారం కాదు
Published in Prajasakti February 8th 2010
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జాతినుద్దేశించి చేసిన ప్రసంగం మరో సారి భారతదేశంలో ఐటి, ఐటెస్ పరిశ్రమల భవితవ్యంపై చర్చను రేకెత్తించింది. నిజానికి ప్రపంచీకరణ నేపథ్యంలో ఔట్‌సోర్సింగ్‌ను తెరమీదకు తెచ్చింది సంపన్న దేశాలే. ఆయా దేశాల్లో 80వ దశకంలో కంపెనీలు ఎదుర్కొంటున్న లాభాల రేటు పతనమవుతున్న నేపథ్యంలో ఈ భావన తెరమీదకు వచ్చింది. బహుళజాతి కంపెనీలు ఉత్పాదక కార్యకాలాపాలు, అనుబంధ కార్యకలాపాల భారం తగ్గించుకోవటానికి ఉత్పత్తి క్రమం దెబ్బతినకుండా కొన్ని కార్యకలాపాలను భారతదేశం వంటి దేశాలకు తరలిస్తూ వచ్చారు. ఈ విధమైన తరలింపుతో ఉత్పత్తి వ్యయం తగ్గించుకోగలిగాయి. లాభాల రేటు పెంచుకోగలిగాయి.అదేసమయంలో అంతేమేరకు మానవవనరుల వినియోగాన్ని తగ్గించుకోగలిగాయి. అంటే ఔట్‌సోర్సింగ్‌కు పాల్పడుతున్న దేశాల్లో సదరు రంగంలో నిరుద్యోగం పెరుగుతూ ఉంటే ఔట్‌సోర్సింగ్ ద్వారా సేవలందిస్తున్న దేశాల్లో ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతుంటాయి. దాంతో పాటు సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశాయి. దేశీయంగా ఇన్ఫొసిస్, విప్రో, టిసిఎస్ వంటి కంపెనీల స్థాపనకు అవకాశం ఇచ్చాయి.
అమెరికా, యూరప్ దేశాల్లో కంటే భిన్నంగా భారతదేశంలో ప్రాథమిక శాస్త్ర విజ్ఞాన రంగం (గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు)లో విద్యార్థులు అసమాన ప్రతిభాపాటవాలు చూపించటం కూడా వివిధ శాస్త్రపరిజ్ఞానం రంగానికి సంబంధించిన సేవలను మన దేశానికి ఔట్‌సోర్సింగ్ చేయటానికి సంపన్న దేశాలు సిద్ధపడ్డాయి. ఔట్‌సోర్సింగ్ రెండు రకాలు. మొదటిది వనరులు, నైపుణ్యం కోసం కొన్ని సేవలు ఇతర దేశాల్లో పూర్తి చేయించుకోవటం కాగా రెండోది మార్కెట్ అవకాశాలు విస్తరించుకోవటం ఔట్‌సోర్సింగ్ విధానాలను అవలంభించటం. భారతదేశంలోని బిపిఒ, ఔట్‌సోర్సింగ్ పరిశ్రమ ప్రధానంగా మొదటి తరహాకు చెందినదిగా చెప్పుకోవచ్చు. అందువల్లనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతున్నా ఈ పరిశ్రమలు మాత్రం నిలకడగా ఉన్నాయి. తాజాగా వెల్లడయిన గణాంకాల ప్రకారం మన దేశంలో 71 శాతం కంపెనీలు ఈ సంవత్సరం సిబ్బంది నియామకానికి గాను పథకాలు సిద్ధం చేసుకున్నాయి. సాధారణంగా ఔట్‌సోర్సింగ్ పరిశ్రమల్లో డిమాండ్‌ను బట్టి తాత్కాలిక ప్రాతిపదికన సిబ్బంది నియామకం జరుగుతుంది. అంటే రానున్న ఆర్థిక సంవత్సరంలో బిపిఒ పరిశ్రమ పెద్దఎత్తున అవకాశాలు వస్తాయన్న అంచనాతో ముందుకు పోతుంది. ఈ పరిస్థితుల్లో భారతదేశానికి వస్తువులు, సేవలు ఔట్‌సోర్సింగ్ రూపంలో తరలించే కంపెనీలపై పన్ను వేస్తామని, అమెరికాలోనే పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు పన్ను రాయితీలు ఇస్తామని ఒబామా ప్రకటించారు. దాంతో ఇటు అమెరికా కంపెనీల్లోనూ, భారతదేశంలోని బిపిఒ పరిశ్రమలోనూ ఆందోళన మొదలైంది.
ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా భారతదేశంలోని బిపిఒ పరిశ్రమ ఆదాయం పడిపోయింది. 2009-2010 ఆర్థిక సంవత్సరానికి గాను 50 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులు సాధించిన బిపిఒ పరిశ్రమ 2010-2011 ఆర్థిక సంవత్సరానికి మరో 15 శాతం ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 7 లక్షల మంది బిపిఒ పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. ఇందులో 60 శాతం ఆదాయం అమెరికా కంపెనీల నుండే వస్తోంది. దాంతో అమెరికా ఆర్థిక విధానాల్లో వస్తున్న మార్పులు ప్రత్యేకించి బిపిఒ పరిశ్రమను ప్రభావితం చేసే విధానాల పట్ల మన దేశంలో సహజమైన ఆసక్తి ఉంటుంది. గత సంవత్సరం ఒక ఉపన్యాసంలో బెంగుళూరులో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే పరిశ్రమల కంటే బఫెలోలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు పన్ను రాయితీలు ఎక్కువగా ఇస్తామని ప్రకటించారు. గత నెల జాతినుద్దేశించి చేసిన 70 నిముషాల ప్రసంగంలో అమెరికాలో దేశీయంగా ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరం గురించి 29 సార్లు ప్రస్తావించారు. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక తన సంపాదకీయంలో 2009 సంవత్సరంలో ఆరోగ్యబీమా లక్ష్యంగా పని చేసిన ఒబామా ప్రభుత్వం 2010 సంవత్సరంలో ఉపాధికల్పన లక్ష్యంతో పని చేయనుందని వ్యాఖ్యానించింది.
ఔట్‌సోర్సింగ్ వల్ల గతంలోకూడా నిరుద్యోగం పెరిగింది. అయితే మిగిలిన పారిశ్రామిక, ఆర్థిక సేవల రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు కనిపిస్తూ ఉండటం, ప్రపంచ ఆర్థికరంగంపై అమెరికా పెత్తనం కొనసాగుతూ ఉండటంతో ఇది పెద్ద సమస్యగా అప్పట్లో కనిపించలేదు. కానీ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం పర్యవసానంగా అమెరికా ఆర్థిక ఆధిపత్యానికి సవాళ్లు ఎదురయ్యాయి. ఉత్పాదకరంగం, ఆర్థిక సేవల రంగం కుదేలయ్యాయి. దాంతో కంపెనీల లాభాలతో పాటే ఉపాధి అవకాశాలూ ఆవిరయ్యాయి. అమెరికాలో అధికారిక లెక్కల ప్రకారం నిరుద్యోగం 12 శాతం వరకూ ఉండగా అనధికారిక లెక్కల ప్రకారం 18 శాతం వరకూ ఉంది. అందువల్లనే ఒబామా ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు లారీ సమ్మర్స్ ''అమెరికా ఆర్థిక వ్యవస్థ గణాంకాల్లో రికవరీ చూపిస్తున్నప్పటికీ మానవవనరుల వృద్ధి విషయంలో స్థబ్దత కొనసాగుతూనే ఉంది'' అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉపాధి అవకాశాలు పెంపొందించాల్సిన తక్షణ ఆవశ్యకత ఒబామా ప్రభుత్వం ముందుంది. దానికనుగుణంగానే ఔట్‌సోర్సింగ్‌కు పాల్పడే కంపెనీలకు ఉన్న పన్ను రాయితీలు రద్దు చేయటంతో పాటు కొత్తగా పన్నులు విధించే అవకాశం కూడా ఉందని ప్రకటించింది. తద్వారా అదనంగా 241 బిలియన్ల డాలర్ల ఆదాయం సంపాదించాలని అమెరికా ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. దీని ప్రభావం రెండు రకాలుగా ఉంటుంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న ఔట్‌సోర్సింగ్ అనుకూల విధానాల వల్ల అమెరికా కంపెనీల పారిశ్రామిక ఉత్పత్తులు చౌకగా తయారవుతున్నాయి.
ఈ విధంగా చౌకైన పారిశ్రామిక ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్‌ను ముంచెత్తుతోంది. మిగిలిన దేశాల పారిశ్రామిక ఉత్పత్తులు భారీ వ్యయంతో కూడుకున్నవి కావటంతో అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా ఉత్పత్తులతో పోటీపడలేకపోతున్నాయి. ఈ అవుట్‌సోర్సింగ్ విధానాలకు స్వస్తి చెబితే అమెరికా కంపెనీల్లో తయారయ్యే ఉత్పత్తుల మార్కెట్ విలువ పెరిగిపోతుంది. ప్రపంచీకృతమైన ఆర్థిక వ్యవస్థలో ఒక్క కలంపోటుతో ఔట్‌సోర్సింగ్‌ను రద్దు చేయటం సాధ్యం కూడా కాదు. ఈ విషయాన్ని గుర్తించబట్టే ఔట్‌సోర్సింగ్‌కు పాల్పడే కంపెనీలపై పన్ను విధిస్తామని ప్రకటించాడు. ఈ చర్య కూడా ఆయా కంపెనీ ఉత్పత్తులను మరింత ప్రియం చేయనున్నాయి. అదే జరిగితే ఇప్పటికే సంక్షోభం పడగ నీడన ప్రాణాలరచేతిలో పెట్టుకు కూర్చున్న అమెరికా పారిశ్రామిక రంగం మరింత ఒత్తిళ్లకు లోనవుతుంది. అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఆధిపత్యానికి సంపూర్ణంగా స్వస్తి చెప్పాల్సి వస్తుంది. దాంతో అదనపు ఆదాయం ఎలా ఉన్నా ఉన్న ఆదాయం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఒక అంచనా మేరకు ఒబామా ప్రతిపాదించిన పన్నుల విధానం అమలు జరిగితే అమెరికాలో తయారయ్యే పారిశ్రామిక వస్తువులు, సేవలు ఖరీదు 50 శాతం అదనంగా పెరుగనున్నాయి. ఈ పరిస్థితి అటు అమెరికా కంపెనీలకు మాత్రమే కాదు, ఇటు అమెరికా ప్రభుత్వానికీ యమపాశంగా మారనుంది. ఈ పరిస్థితుల్లో ఔట్‌సోర్సింగ్ గురించి ఒబామా బెదిరింపులు ఆచరణకు నోచుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వెలుగు చూసిన మూడో త్రైమాసిక ఫలితాల్లో ఐటి, ఐటెస్ రంగ పరిశ్రమల లాభాలు పెరగటం వెనక ఉన్న తర్కం ఇదే.

Monday, February 1, 2010
రికవరీకి సహకరించని ద్రవ్య విధానం
కొండూరి వీరయ్య, Prajasakti Telugu daily, February 1st edition
రిజర్వు బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో తాజా చర్యల వల్ల ద్రవ్యోల్బణం ఎంతమేర అదుపులోకి వస్తుందో ప్రకటించలేదు. పైగా ఈ సంవత్సరం ఋతుపవనాలపై ఆధారపడి ఆహారోత్పత్తులు, ఇతర పారిశ్రామికోత్పత్తుల ధరల నడవడిక ఉంటుందని స్పష్టం చేసింది. అటువంటప్పుడు అమల్లో ఉన్న విధానాన్ని మార్చటం ద్వారా అందుబాటులో ఉన్న ప్రయోజనాలను కూడా వదులుకోవటం ఎందుకో అన్నది అర్థం కాని ప్రశ్నగా ఉంది. మరోవైపున మారిన ద్రవ్య విధానం పర్యవసానంగా పెరిగే ఉత్పత్తి వ్యయం పారిశ్రామిక ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపనుంది. ఇంత వరకు ప్రభుత్వం అభిప్రాయంలో పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉన్నాయి. వ్యవసాయోత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. తాజా చర్యలు వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గించటంలో దోహదం చేయకపోగా పారిశ్రామికోత్పత్తుల ధరలను కూడా పెంచేస్తాయి. ఈ పరిస్థితులు ప్రైవేటు పెట్టుబడులపై వచ్చే లాభాలను తగ్గించేస్తాయి. దాంతో ప్రైవేటు పెట్టుబడుల చలనం కూడా తగ్గిపోతుంది. ఇది మార్కెట్లో నిధుల కొరతకు దారితీసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
భారత రిజర్వు బ్యాంకు శుక్రవారం నాడు ప్రకటించిన విధానం అటు ఆర్థిక వ్యవస్థలో రికవరీని పెంచేందుకు గానీ, ఇటు ద్రవ్యోల్భణాన్ని తగ్గించేందుకు గానీ దోహదపడేదిగా కనిపించటం లేదు. మూడో త్రైమాసం ఆర్థిక ఫలితాలు సమీక్షించిన అనంతరం ప్రకటించిన ఈ విధానం మార్కెట్‌లో నిధుల లభ్యతను తగ్గించటమే లక్ష్యంగా ఉంది. గత నెలరోజుల నుండే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోనుందన్న విషయాన్ని చూచాయగా వెల్లడిస్తూనే వచ్చారు. డిసెంబరు మూడో వారంలో మాజీ రిజర్వు బ్యాంకు గవర్నరు, ప్రధాని ఆర్థిక మండలి సలహాదారు రంగరాజన్ డిసెంబరులో సాధారణంగా కనిపించే ధరల తగ్గుదల ఈ సారి కనిపించకపోతే మార్కెట్లో నిధుల లభ్యతపై ఆంక్షలు విధించటం ఒక్కటే ధరల నియంత్రణ సాధనంగా ఉంటుందని ప్రకటించారు. జనవరి రెండో వారాంతంలో రిజర్వు బ్యాంకు డిప్యూటీ గవర్నర్ ఉషా థోరట్ గృహ నిర్మాణ రంగంలో అవసరానికి మించి బకాయిలు పేరుకుపోతున్నాయని దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందని ప్రకటించారు. అదే విధంగా డిసెంబరులోనే విడుదలైన మరో ప్రకటనలో బ్యాంకుల వద్ద స్థూల పారుబకాయిల రేటు పెరుగుతుందని నిర్దారించారు. ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న ఈ లక్షణాలన్నింటికీ కారణం మార్కెట్లో అవసరానికి మించి నిధులు అందుబాటులో ఉండటమేనని ఆర్థికవేత్తలు, ప్రభుత్వం అభిప్రాయపడింది. వీటన్నింటికి తోడు జి 20 ఆర్థిక మంత్రుల సమావేశంలో 2010-2011 ఆర్థిక సంవత్సరంలో సరళ ద్రవ్య విధానాలు సమీక్షించుకోవాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం అమల్లో భాగమే ప్రభుత్వం తీసుకుంటున్న తాజా చర్యలు అని చెప్పవచ్చు.
మరో వైపున నిజ ఆర్థిక వ్యవస్థ గురించి వస్తున్న వార్తలు కూడా ఆర్థిక వ్యవస్థ రికవరీ దారిలో పడిందన్న గట్టి అభిప్రాయాన్ని కల్గించింది.
డిసెంబరు నాటి పత్రికలు పరిశీలిస్తే లాభాల రేటు పెరగటం వల్ల కంపెనీలు 20 శాతం మేర అడ్వాన్సు పన్ను ముందే చెల్లించటం గురించి, పెరుగుతున్న ఉపాధి అవకాశాలు గురించిన వార్తలే ప్రధానంగా కనిపించాయి. దాంతో నిజ ఆర్థిక వ్యవస్థ కూడా గాడిన పడ్డట్లు ప్రభుత్వం అంచనాకు వచ్చింది. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను ఆదుకోటానికే గత సంవత్సర కాలంగా ప్రభుత్వం సరళమైన ద్రవ్య విధానాన్ని అనుసరిస్తూ వచ్చింది. ఒక సారి ఆర్థికవ్యవస్థ గాడినపడిందన్న అంచనాకు వచ్చిన తర్వాత సహజంగానే ద్రవ్య విధానాన్ని పటిష్టం చేయటానికి నడుం కట్టింది. (అందువల్లనే ఆర్థిక వ్యవస్థలో కనిపిస్తున్న రికవరీ ఈ మార్పులను అనివార్యం చేస్తుంది. ఇంత కాలం అమలు జరిగిన విధానాలు స్థబ్దతతో కూడుకున్న ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించినవే తప్ప పరుగులెత్తే ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించినవి కాదు) అని చెప్పుకొంది. స్థూలంగా చెప్పుకోవాలంటే గత సంవత్సర కాలానికి పైగా కుదేలైన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కల్పించే లక్ష్యంతో అమలు జరిగిన ద్రవ్య విధానం నేడు సదరు లక్ష్యాన్ని పక్కన పెట్టి ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చే లక్ష్యంపై కేంద్రీకరించింది. భారతదేశంలో సంస్కరణలు మొదలైన నాటి నుండీ ద్రవ్యోల్బణం అదుపు చేయటం ద్రవ్య విధానపు మౌలిక లక్ష్యాల్లో ఒకటిగా మారింది. అంటే భారత ద్రవ్య విధానం తిరిగి సంస్కరణల నాటి ధోరణికి తిరిగి మళ్లుతుందని చెప్పవచ్చు.
నేడు ప్రకటించిన ద్రవ్య విధానం భారత ఆర్థిక వ్యవస్థలు పలు రూపాల్లో ప్రభావితం చేయనుంది. ముందుగా నిధుల లభ్యత విషయాన్ని పరిశీలిద్దాం. గత సంవత్సరం కాలంగా రిజర్వుబ్యాంకు ప్రకటించిన వివిధ రాయితీల వలన మార్కెట్లో సుమారు 5,60,000 కోట్ల రూపాయల అదనపు నిధులు అందుబాటులోకి వచ్చాయి. దాంతో పారిశ్రామిక రుణాలు, గృహ నిర్మాణ రంగానికి రుణాలు చౌకగా అందుబాటులోకి వచ్చాయి. ఇది ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించటానికి తోడ్పడింది. ఉత్పత్తి వ్యయం తగ్గటంతో కంపెనీల లాభాల రేటు బాగా పెరిగింది. ఈ విషయాన్ని బిజినెస్‌వాచ్ గత సంచికల్లో ఉద్దీపన లాభాల శీర్షికన వచ్చిన వ్యాసాల్లో వివరంగా తెలియచేశాము. అదేవిధంగా మార్కెట్లో నిధుల లభ్యత అధికంగా ఉండటంతో ఈ నిధులు ఈక్విటీ మార్కెట్‌కు మళ్లించబడ్డాయి. గత సంవత్సరకాలంలో అనుత్పాదక ఆర్థిక రంగంలో ఈక్విటీ మార్కెట్ లాభాల పంట పడించిన వాటిలో ఒకటిగా ఉంది. అదేవిధంగా పుష్కలంగా లభ్యమవుతున్న నిధులు తక్కువ వడ్డీలకు చేతికందటంతో ముఖ్యమైన కంపెనీలన్నీ తమ ఉత్పాదక విస్తరణకు అవసరమైన వనరులు సమకూర్చుకున్నాయి.
ఈ పెరిగిన సామర్థ్యంలో ముడివనరుల మొదలు సాంకేతిక పరిజ్ఞానం వరకూ ఉన్నాయి. దీంతో కంపెనీలు రానున్న కాలంలో అవసరమైన ఉత్పత్తిని అందించగలిగే సామర్థ్యంతో పాటు అంతర్జాతీయ పోటీని తట్టుకోవటానికి అన్ని విధాలా సిద్ధం కావటానికి సరళమైన ద్రవ్య విధానం ఎంతగానో తోడ్పడింది. ప్రస్తుతం దశల వారీగా ఈ అదనపు నిధులను ఉపసంహరించుకోవటానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగా శుక్రవారం నాటి చర్యల ద్వారా మార్కెట్‌లో చలామణిలో నుండి 36000 కోట్ల నిధులు తగ్గించింది. రానున్న కాలంలో కూడా మరిన్ని నిధులు మార్కెట్ నుండి వెనక్కుపోనున్నాయి. ఈ పరిణామం పైన పేర్కొన్న సానుకూల అంశాలన్నింటికీ నష్టదాయకంగా మారనుంది. ఉన్న ఫళంగా ఆర్థిక వ్యవస్థకు పెద్దగా నష్టం జరక్క పోయినా ఇటువంటి నిర్ణయాలు గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థను అడ్డుకోవటంలో మాత్రం ఈ మార్పులు కీలక పాత్ర పోషించనున్నాయని చెప్పవచ్చు.
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటం ఈ తాజా మార్పులకు తక్షణ లక్ష్యమని రిజర్వు బ్యాంకు ప్రకటించింది. కానీ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో మాత్రం తాజా చర్యల వల్ల ద్రవ్యోల్బణం ఎంతమేర అదుపులోకి వస్తుందో ప్రకటించలేదు. పైగా ఈ సంవత్సరం ఋతుపవనాలపై ఆధారపడి ఆహారోత్పత్తులు, ఇతర పారిశ్రామికోత్పత్తుల ధరల నడవడిక ఉంటుందని స్పష్టం చేసింది. అటువంటప్పుడు అమల్లో ఉన్న విధానాన్ని మార్చటం ద్వారా అందుబాటులో ఉన్న ప్రయోజనాలను కూడా వదులుకోవటం ఎందుకో అన్నది అర్థం కాని ప్రశ్నగా ఉంది. రిజర్వు బ్యాంకు మాటల్లోనే.. ''పెద్దఎత్తున ఆహారధాన్యాల నిల్వలు సిద్ధం చేసుకోవటం ధరల నియంత్రణకు ఉపయోగపడుతుంది. జూలై తర్వాతికాలంలో ద్రవ్యోల్బణం ఋతుపవనాలపై ఆధారపడి ఉంటుంది.'' మరోవైపున మారిన ద్రవ్య విధానం పర్యవసానంగా పెరిగే ఉత్పత్తి వ్యయం వల్ల పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు కూడా భారం కానున్నాయి. ఇంత వరకు ప్రభుత్వం అభిప్రాయంలో పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు స్థిరంగా ఉన్నాయి. వ్యవసాయోత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. తాజా చర్యలు వ్యవసాయోత్పత్తుల ధరలు తగ్గించటంలో దోహదం చేయకపోగా పారిశ్రామికోత్పత్తుల ధరలను కూడా పెంచేస్తాయి. ఈ పరిస్థితులు ప్రైవేటు పెట్టుబడులపై వచ్చే లాభాలను తగ్గించేస్తాయి.
దాంతో ప్రైవేటు పెట్టుబడుల చలనం కూడా తగ్గిపోతుంది. ఇది మార్కెట్లో నిధుల కొరతకు దారితీసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సరళమైన ద్రవ్య విధానం కారణంగా గత సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల కోసం పెద్దగా బహుళజాతి సంస్థలు అంటే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి వాటిపై ఆధారపడాల్సిన అవసరం లేకపోయింది. నేడు కేంద్ర ప్రభుత్వం ఈ విధానం నుండి వైదొలగటం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే రుణాలపై భారాన్ని కూడా పెంచనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే రుణాలు భారం కావటం అంటే వివిధ పన్నులు, సేవలపై విధించే చార్జీల రూపంలో ప్రజలపై మరో రకమైన భారం పెరగటమే. భారత ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కోలుకోవటం అనేది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోలుకోవటంపై ఆధారపడి ఉంటుందని గుర్తించిన రిజర్వు బ్యాంకు అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థలో సరళ ఆర్థిక విధానాలు కొనసాగుతున్నంత కాలం వాటిని దేశీయంగా కూడా అమలు చేయాలి. అటువంటి విధానాల ప్రయోజనం నేరుగా ప్రజలకు చేరేందుకు మార్గాలు ఏమిటో ఆలోచించకుండా రూళ్ల కర్ర సిద్ధాంతం ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవటం ఆర్థిక వ్యవస్థ కోలుకోవటానికి అంతగా సహకరించే అంశం కాబోదు.

Subscribe to:
Posts (Atom)